Deeparadhana: ఒక దీపం నుంచి ఇంకో దీపాన్ని ఎందుకు వెలిగించకూడదు? ఈ చిన్న పొరపాటు వలన ఎంత నష్టమంటే?
Deeparadhana: దీపాలని వెలిగించడానికి ప్రత్యేక నియమాలు అయితే ఉన్నాయి. ఒక దీపం యొక్క మంట నుంచి ఇంకో దీపాన్ని ఎప్పుడూ వెలిగించకూడదు. అయితే, తెలుసో తెలియకో కొంత మంది ఈ పొరపాటు చేస్తూ ఉంటారు. ఈ తప్పు చేయకుండా చూసుకోవాలి. పెద్దలు కూడా ఇది తప్పు అని చెప్తూ ఉంటారు.
మనం ఎన్నో పురాతన పద్ధతుల్ని పాటిస్తూ ఉంటాము. ప్రతి రోజూ చేసే పూజకి కూడా కొన్ని నియమాలని అనుసరిస్తూ ఉంటాము. ప్రతీ రోజూ చేసే పూజకి కూడా కొన్ని ప్రత్యేక నియమాలు ఉంటాయి. అలాగే ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంటాయి. వీటిని తప్పనిసరిగా ఆచరిస్తూ ఉంటాము.

హిందూ మతంలో పూజ సమయాల్లో దీపాలు వెలిగించే సంప్రదాయం ఉంది. దీపారాధన చేసిన తర్వాత పూజని మొదలు పెడతాము. దీపాన్ని వెలిగించడం వలన చీకటి తొలగిపోతుంది. దైవిక శక్తి కూడా ప్రసరిస్తుంది.
దీపారాధన
పూజ సమయంలో ఉదయం, సాయంత్రం రెండు పూట్లా దీపం వెలిగించాలి. దీపానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అయితే, దీపారాధన చేసేటప్పుడు కొన్ని నియమాలు ఉంటాయి. వాటిని ప్రతి ఒక్కరూ తప్పక పాటించాలి. పూర్వికులు కూడా దీపారాధనకి సంబంధించి ఎన్నో నియమాలు చెబుతూ ఉంటారు.
దీపాలని వెలిగించడానికి ప్రత్యేక నియమాలు అయితే ఉన్నాయి. ఒక దీపం యొక్క మంట నుంచి ఇంకో దీపాన్ని ఎప్పుడూ వెలిగించకూడదు. అయితే, తెలుసో తెలియకో కొంత మంది ఈ పొరపాటు చేస్తూ ఉంటారు. ఈ తప్పు చేయకుండా చూసుకోవాలి. పెద్దలు కూడా ఇది తప్పు అని చెప్తూ ఉంటారు.
ఒక దీపం నుంచి ఇంకో దీపం ఎందుకు వెలిగించకూడదు?
- ఒక దీపం నుంచి ఇంకో దీపం ఎందుకు వెలిగించకూడదు అనేది చూస్తే.. ఒక దీపం నుంచి ఇంకో దీపం వెలిగించకూడదని పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. వీటిని పాటిస్తే సంతోషంగా ఉండొచ్చు. భవిష్యత్తులో జరిగే అశుభ సంఘటనల నుంచి బయటపడడానికి అవుతుంది. దీపంలో అగ్నిదేవుడు ఉంటాడు. మనం దీపాన్ని వెలిగించినప్పుడు అది ఇంట్లో ప్రతికూలతని ఆకర్షిస్తుంది. సానుకూల శక్తిని పెంచుతుంది.
- అలాంటప్పుడు మనం ఒక దీపం నుంచి ఇంకో దీపాన్ని వెలిగించినట్లయితే, ఆ దీపంలో ఉన్న ప్రతికూలత ఇంకో దీపానికి ప్రవేశిస్తుంది. ప్రతికూలత మొత్తం అంతమైపోకుండా మన ఇంట్లోనే మళ్లీ మళ్లీ తిరుగుతూ ఉంటుంది.
- అందుకని ఒక దీపం నుంచి ఇంకో దీపాన్ని వెలిగించకూడదు. పూర్వికులు కూడా అందుకే ఒక దీపం నుంచి ఇంకో దీపాన్ని వెలిగించకూడదని చెప్తారు.
దీపం అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రకాశింపజేస్తుంది. అటువంటి మహోన్నత దీపాన్ని మనం వెలిగించాక ఆ స్థానం నుంచి కదపడం పాపం. కనుక దీపారాధన చేసాక ఆ స్థానం నుంచి కదపకూడదు. అలా చేయడం వలన దరిద్రం పట్టుకునే అవకాశం వుంది. ప్రతికూల శక్తి కూడా వ్యాపించచ్చు. కనుక దీపాన్ని వెలిగించాక మరో దీపాన్ని దాని నుంచి వెలిగించకూడదు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం