అష్టాదశ పురాణాల్లో గరుడ పురాణానికి ఎంతో ప్రత్యేకత ఉంది. మహా విష్ణువు గరుడ పురాణానికి అధిపతి. కేవలం మానవ జీవితానికే కాదు, మరణం తర్వాత జీవిత ప్రయాణం గురించి కూడా ఇందులో వివరంగా వర్ణించబడింది.
గరుడ పురాణంలో దహన సంస్కారం గురించి కూడా అనేక ముఖ్యమైన విషయాలను వివరించడం జరిగింది. చనిపోయిన తర్వాత మృతదేహాన్ని ఒంటరిగా ఎందుకు వదలకూడదు? అంత్యక్రియలు అయిన తర్వాత ఎందుకు వెనక్కి తిరిగి చూడకూడదు? ఇలా అనేక విషయాల గురించి వివరించబడింది.
ఇది ఇలా ఉంటే, గరుడ పురాణం ప్రకారం సూర్యాస్తమయం అయిన తర్వాత అంత్యక్రియలు జరిగితే ఏమవుతుంది? ఎందుకు సూర్యాస్తమయం అయిన తర్వాత అంత్యక్రియలు చేయరు అనే దాని గురించి తెలుసుకుందాం.
గరుడ పురాణం ప్రకారం చూసినట్లయితే, సూర్యాస్తమయం అయిన తర్వాత అంత్యక్రియలు చేయకపోవడం వెనుక బలమైన కారణం ఉంది. గరుడ పురాణం ప్రకారం, సూర్యాస్తమయం తర్వాత దహనం చేస్తే ఆ వ్యక్తి ఆత్మకు శాంతి కలగదట.
సూర్యాస్తమయం అయిన తర్వాత స్వర్గ ద్వారాలు మూసుకుపోతాయని అంటారు. దహన సంస్కారాలను సూర్యాస్తమయం అయిన తర్వాత జరపరు. ఆత్మ గమ్యాన్ని చేరుకోలేకపోతుందని దహనం చేయరు. సూర్యాస్తమయం తర్వాత కేవలం నరక ద్వారాలు తెరిచి ఉంటాయట. అందుకని మరణించిన వ్యక్తిని రాత్రిపూట దహనం చేయరు. దహనం చేయడం వలన ఆత్మకి నరక బాధ తప్పదని భావిస్తారు.
మరో కారణం కూడా ఉంది. అదేంటంటే, అంత్యక్రియలు సూర్యాస్తమయం తర్వాత జరిపితే ఆ వ్యక్తి ఇంకో జన్మలో ఏదైనా శరీరభాగాల లోపంతో జన్మించే అవకాశం ఉంటుందట. ఈ కారణంగానే రాత్రిపూట అంత్యక్రియలు జరపరు.
అంత్యక్రియలు అనేవి తండ్రి, కొడుకు లేదా సోదరుడు, మనవడు చేయవచ్చు. లేదంటే కుటుంబంలో ఏ పురుషుడైనా చేయొచ్చు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.