Mehndi in Pregnancy: గర్భిణీలు ఎందుకు గోరింటాకు పెట్టుకోకూడదు? గ్రహాలకు, గోరింటాకుకి ఉన్న సంబంధం ఏంటి?-why we should keep mehndi in pregnancy how it is linked with planets check the reason behind it full details are here ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Mehndi In Pregnancy: గర్భిణీలు ఎందుకు గోరింటాకు పెట్టుకోకూడదు? గ్రహాలకు, గోరింటాకుకి ఉన్న సంబంధం ఏంటి?

Mehndi in Pregnancy: గర్భిణీలు ఎందుకు గోరింటాకు పెట్టుకోకూడదు? గ్రహాలకు, గోరింటాకుకి ఉన్న సంబంధం ఏంటి?

Peddinti Sravya HT Telugu
Jan 20, 2025 07:00 AM IST

Mehendi in Pregnancy: పూర్వకాలం నుంచి కూడా పెద్దలు ఈ విషయాన్ని చెప్తూ వస్తున్నారు. అయితే, నిజంగా గర్భిణీలు చేతులకు గోరింటాకు పెట్టుకోకూడదా..? ఎందుకు పెట్టుకోకూడదు అనే వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Mehndi in Pregnancy: గర్భిణీలు ఎందుకు గోరింటాకు పెట్టుకోకూడదు?
Mehndi in Pregnancy: గర్భిణీలు ఎందుకు గోరింటాకు పెట్టుకోకూడదు?

గర్భిణీలు ఆరోగ్యంగా ఉండడానికి చాలా నియమాలని పాటిస్తూ ఉంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడంతో పాటుగా పెద్దలు చెప్పిన మంచి విషయాలను కూడా ఆచరిస్తూ ఉంటారు. పూర్వికులు పాటించిన సాంప్రదాయాలను కూడా ఇప్పటికి కూడా చాలా మంది పాటిస్తున్నారు. సీమంతం వేడుక నుంచి ప్రతీది కూడా పురాతన పద్ధతుల ప్రకారం చాలా మంది ఇంకా అనుసరిస్తున్నారు. అయితే, గర్భిణీలు చేతులకి గోరింటాకు పెట్టుకోకూడదని చెప్తూ ఉంటారు.

yearly horoscope entry point

పూర్వకాలం నుంచి కూడా పెద్దలు ఈ విషయాన్ని చెప్తూ వస్తున్నారు. అయితే, నిజంగా గర్భిణీలు చేతులకు గోరింటాకు పెట్టుకోకూడదా..? ఎందుకు పెట్టుకోకూడదు అనే వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

గోరింటాకు స్త్రీకి అలంకరణ:

నిజానికి చాలా మంది మహిళలు గోరింటాకును ఇష్టపడతారు. హిందూమతంలో గోరింటాకు 16 అలంకారాలలో భాగంగా పరిగణించబడింది. పెళ్లికి మాత్రమే కాకుండా శుభకార్యాలు, పండుగలు, ఏదైనా సంతోషకరమైన వేడుకలకు కూడా ఖచ్చితంగా గోరింటాకును పెట్టుకుంటారు. వైవాహిక ఆనందానికి సంబంధించిన ఉపవాసాలు, పండుగలు గోరింటాకు లేకుండా పూర్తి కావు. వివాహిత స్త్రీలకు గోరింటాకు శుభప్రదంగా పరిగణించబడుతుంది.

గర్భధారణ సమయంలో గోరింటాకు పెట్టుకోకూడదా?

  1. ఇంటి పెద్దలు, అమ్మమ్మలు గర్భధారణ సమయంలో గోరింటాకు పెట్టుకోకూడదని చెప్తూ ఉంటారు. గర్భధారణ సమయంలో కొన్ని పనులు చేయకూడదు. ఎందుకంటే గర్భధారణ సమయంలో కొన్నిటి వలన కడుపులో పెరుగుతున్న బిడ్డకు హాని కలగవచ్చు. వీటిలో ఒకటి గోరింటాకు. అందుకే పూర్వీకులు దీనిని నిషేధించారు.
  2. అమ్మమ్మలు వాళ్ళు చెప్పే వాటిని చాలా మంది కొట్టి పారేయొచ్చు. కానీ దాని వెనక శాస్త్రం ఉంది. కాబట్టి పూర్వీకులు చెప్పిన వాటిని పాటిస్తే సంతోషంగా ఉండొచ్చు.
  3. గోరింటాకు ఆనందం, ప్రేమ, అందాన్ని సూచించే శుక్ర గ్రహానికి సంబంధించినది. గోరింటాకు పెట్టుకోవడం వలన శుక్ర గ్రహం శక్తిని తీవ్రతరం చేస్తుంది.
  4. సామరస్యం, శ్రేయస్సు, భావోద్వేగ సమతుల్యతలను కూడా నిర్వహిస్తుంది. అందుకని పెళ్లి సమయంలో వధువులు చేతులకి గోరింటాకుని పెట్టుకోవడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. కనుక గర్భిణీలు గోరింటాకు పెట్టుకోకపోవడమే మంచిది.
  5. దీని వలన గర్భధారణ సమయంలో గ్రహాల ప్రభావం పట్ల స్త్రీ సున్నితత్వం గణనీయంగా పెరుగుతుంది. గర్భిణీ స్త్రీ జాతకంలో శుక్రుడు బలహీనంగా బాధతో లేదా అశుభంగా ఉన్నట్లయితే గోరింటాకు పెట్టుకోవడం సానుకూల ప్రభావాలకు బదులుగా ప్రతికూల ప్రభావాన్ని కలిగిస్తుంది.
  6. గర్భధారణ సమయంలో జాతకంలో శని, రాహువు లేదా కేతువు వంటి గ్రహాలు బలంగా ఉన్నట్లయితే గోరింటాకు పెట్టుకోవడం ఇంకా హానికరం. ఇబ్బందులు, ఆందోళన, ఒత్తిడిని పెంచుతుంది. ప్రమాదాలు లేదంటే ఇబ్బందులు తలెత్తకుండా ఉండడానికి గర్భధారణ సమయంలో గోరింటాకును పెట్టుకోకూడదని పండితులు కూడా సూచిస్తున్నారు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Whats_app_banner