సూర్యాస్తమయం తర్వాత ఎందుకు ఉప్పు ఇవ్వకూడదు, ఏ రోజు ఉప్పుని ఇంటికి తెచ్చుకోవాలి? ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం పక్కా!-why we should give or take salt after sunset and when we must buy salt follow these to get lakshmi devi blessings ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  సూర్యాస్తమయం తర్వాత ఎందుకు ఉప్పు ఇవ్వకూడదు, ఏ రోజు ఉప్పుని ఇంటికి తెచ్చుకోవాలి? ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం పక్కా!

సూర్యాస్తమయం తర్వాత ఎందుకు ఉప్పు ఇవ్వకూడదు, ఏ రోజు ఉప్పుని ఇంటికి తెచ్చుకోవాలి? ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం పక్కా!

Peddinti Sravya HT Telugu

హిందూమతంలో, ఆచారాలలో ఉప్పుకి ప్రత్యేక స్థానం ఇస్తారు. ఉప్పుని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. సూర్యాస్తమయం తర్వాత ఎందుకు ఉప్పు ఇవ్వకూడదు, ఏ రోజు ఉప్పుని ఇంటికి తెచ్చుకోవాలి? వంటి విషయాలను తెలుసుకుందాం.

సూర్యాస్తమయం తర్వాత ఎందుకు ఉప్పు ఇవ్వకూడదు? (pinterest)

చాలా మంది పూర్వికులు చెప్పిన పురాతన పద్ధతుల్ని పాటిస్తూ ఉంటారు. నిజానికి వాటి వెనుక కారణాలు తెలియనప్పటికీ పెద్ద వారు చెప్పారని పాటిస్తూ ఉంటారు. హిందూమతంలో, ఆచారాలలో ఉప్పుకి ప్రత్యేక స్థానం ఇస్తారు. ఉప్పుని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు.

ఉప్పు సానుకూల శక్తిని తీసుకు వచ్చి, దుష్టశక్తుల్ని, ప్రతికూల శక్తుల్ని తొలగిస్తుందని నమ్ముతారు. అయితే, సాయంత్రం పూట ఎవరైనా ఉప్పుని అప్పుగా అడిగితే ఇవ్వరు. చాలామంది ఇళ్లల్లో ఇదే జరుగుతోంది.

సాయంత్రం ఉప్పుని ఎందుకు ఇవ్వకూడదు?

  1. సాయంత్రం ఎవరూ కూడా ఎవరైనా ఉప్పుని అడిగితే ఇవ్వరు. ఉప్పుని లక్ష్మీదేవి స్వరూపంగా భావించి, ఉప్పును ఇవ్వడానికి ఇష్టపడరు. లక్ష్మీదేవి వచ్చే సమయంలో ఇంట్లో సానుకూల వాతావరణం కలగాలని అనుకుంటారు. అందుకనే డబ్బులు, ఉప్పు వంటి వాటిని సాయంత్రం పూట ఇతరులకి ఎవరూ ఇవ్వరు. ఇవ్వకూడదు కూడా.
  2. సంధ్య వేళలో లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది. సూర్యాస్తమయం తర్వాత ప్రతికూల శక్తులు ప్రవహించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక సాయంత్రం పూట ఎక్కువ సానుకూల శక్తిని పొందాలని అందరూ ప్రయత్నం చేస్తూ ఉంటారు. సాయంత్రం పూట ఇతరులకు ఉప్పు ఇస్తే లక్ష్మీదేవిని ఇంట్లో నుంచి పంపించినట్లు, లక్ష్మీదేవిని అవమానించినట్లవుతుంది.
  3. జీవితంలో ఐశ్వర్యం కలగాలంటే లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలి. లక్ష్మీదేవిని ఆరాధించాలి. లక్ష్మీదేవిని పూజించి అమ్మవారి కృపకు పాత్రులు అవుతారు.
  4. లక్ష్మీదేవిని ఈ సమయంలో ఆరాధించడం వలన సంపద కలుగుతుంది. ఈ నేపథ్యంలో సాయంత్రం పూట ఎవరికి ఉప్పు ఇవ్వడం, స్వీకరించడం నిషేధించబడింది.
  5. సూర్యాస్తమయం అయ్యాక ఉప్పు ఇవ్వడం లేదా తీసుకోవడం వలన జీవితంలో కొన్ని సమస్యలు, మార్పులు సంభవిస్తాయి.
  6. ఉప్పు సూక్ష్మ కణాలతో కూడి ఉంటుంది. లక్ష్మీదేవిగా పరిగణించబడుతుంది. ఉప్పుని జాగ్రత్తగా ఉంచాలి. నేలపై చల్లడం లేదా అనుకోకుండా కింద పడేయడం వంటివి దురదృష్టంగా పరిగణించబడుతుంది.

జేబులో ఉప్పుని పెట్టుకోండి

దుష్టశక్తులతో పోరాడే శక్తి ఉప్పులో ఉంటుంది. భయాందోళనలకు గురవుతున్నట్లయితే ఉప్పును జేబులో పెట్టుకోండి. సానుకూల శక్తి ప్రవహించడమే కాకుండా దుష్టశక్తులు భయాల నుంచి బయటపడొచ్చు.

శుక్రవారం నాడు కొనుగోలు చేయండి

ఉప్పును కొనుగోలు చేయడానికి శుక్రవారం మంచి రోజు. ఈ రోజున ఉప్పుని ఇంటికి తెచ్చుకోవడం వలన లక్ష్మీదేవి ఇంటికి వస్తుంది. జీవితంలో ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. అప్పుల బాధల నుంచి కూడా బయటపడొచ్చు, ప్రశాంతత కలుగుతుంది.

ప్రశాంతత కలగాలంటే?

ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య ఇబ్బందులు వస్తున్నట్లయితే.. చిన్న గాజు పాత్రలో ఉప్పు వేసి మూత పెట్టండి. పడకగదలో కానీ దేవుడు మూలలో కానీ దీనిని ఉంచాలి. ఇలా చేయడం వలన శాంతి, ఐశ్వర్యం కలుగుతాయి. ప్రశాంతత ఉంటుంది.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు.

సంబంధిత కథనం