Lakshmi devi: చీకటి పడ్డాక మాత్రమే కాదు.. ఈ సమయంలో కూడా ఎవరికీ అప్పు ఇవ్వకూడదని తెలుసా? దాని వలన ఈ నష్టాలు కలగవచ్చు
Lakshmi devi: ముఖ్యంగా సాయంత్రం పూట ఎవరికీ డబ్బులు ఇవ్వకూడదని పెద్ద వాళ్ళు చెప్పడం మనం వినే ఉంటాం. అయితే, వాళ్ళు చెప్పింది నిజమా కాదా..? అసలు ఎందుకు అలా చెప్పారు అనే దాని గురించి చూద్దాం.
సూర్యాస్తమయం అయిన తర్వాత డబ్బులు ఇవ్వకూడదని చాలా మంది చెప్తూ ఉంటారు. సూర్యస్తమయం అయిన తర్వాత ఇంట్లో దీపాలు వెలగాలని, ఇల్లు చీకటిగా ఉండకూడదని ఇలా చాలా చెప్తూ ఉంటారు. అయితే, అసలు పెద్ద వాళ్ళు ఎందుకు సూర్యాస్తమయం అయిన తర్వాత ఇతరులకి డబ్బులు ఇవ్వకూడదని చెప్తారు..? దాని వెనుక కారణం ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
లక్ష్మీదేవి:
ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలని అనుకుంటారు. ప్రతి ఒక్కరు వారి ఇంట లక్ష్మీదేవి ఉండాలని, సంతోషంగా జీవించాలని కోరుతుంటారు. కానీ, కొన్ని కొన్ని సార్లు కొంతమంది ఇళ్లల్లో ఇబ్బందులు తప్పవు. ఎప్పుడూ కూడా డబ్బులు ఒక వైపు నుంచి వచ్చి ఇంకో వైపు నుంచి వెళ్ళిపోతాయి.
సాయంత్రం పూట ఎవరికీ డబ్బులు ఇవ్వకూడదా?
ఒకసారి మన చేతిలోకి డబ్బులు వచ్చిన తర్వాత దానిని మనం రకరకాలుగా ఖర్చు చేస్తూ ఉంటాం. అలా నెమ్మదిగా మన దగ్గర ఉన్న డబ్బులు ఖర్చు అయిపోతూ ఉంటాయి. అయితే, డబ్బులకి సంబంధించి కొన్ని నియమాలు ఉన్నాయి. వాటిని తప్పకుండా పాటించాలి. లేకపోతే లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది.
ముఖ్యంగా సాయంత్రం పూట ఎవరికీ డబ్బులు ఇవ్వకూడదని పెద్ద వాళ్ళు చెప్పడం మనం వినే ఉంటాం. అయితే, వాళ్ళు చెప్పింది నిజమా కాదా..? అసలు ఎందుకు అలా చెప్పారు అనే దాని గురించి చూద్దాం.
పెద్దలు చెప్పిన విషయాలని ఆచరించినట్లయితే భవిష్యత్తులో ఇబ్బందులు ఏమీ లేకుండా సంతోషంగా ఉండొచ్చు. శాస్త్రాల ప్రకారం సాయంత్రం పూట ఎవరికీ డబ్బులు ఇవ్వకూడదు. లేదంటే ఎవరి నుంచి అప్పు తీసుకోకూడదు. ఇలా చేస్తే డబ్బుకి సంబంధించిన సమస్యలు వస్తాయి. సాయంత్రం సమయంతో పాటుగా బ్రహ్మముహూర్తంలో కూడా డబ్బులు ఎవరికి ఇవ్వకూడదు.
ఎందుకు ఇలా ఈ సమయాల్లో డబ్బులు ఇవ్వకూడదు?
ఈ సమయాల్లో ఎందుకు డబ్బులు ఇవ్వకూడదంటే సాయంత్రం పూట లక్ష్మీదేవి సంచరించడమే ప్రధాన కారణం. అలాగే బ్రహ్మ ముహూర్తంలో దేవతలను పూజించే సమయంగా పరిగణించబడుతుంది.
ఈ సమయంలో డబ్బు ఇవ్వడం మంచిది కాదు. అలా చేస్తే డబ్బులు ఎప్పుడు మన దగ్గరికి రావని, డబ్బుకి దూరంగా ఉండాల్సిన పరిస్థితి వస్తుందని, కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని పండితులు చెప్పడం జరిగింది.
కాబట్టి ఈ పొరపాట్లు చేయకుండా చూసుకోండి. ఉదయం బ్రహ్మముహూర్తం సమయంలో, సూర్యాస్తమయం అయిన తర్వాత ఎవరికీ డబ్బులు ఇవ్వకండి. బ్రహ్మ ముహూర్తం తర్వాత నుంచి సూర్యాస్తమయంలోగా ఎవరికైనా డబ్బులు ఇవ్వచ్చు. కానీ ఆ తర్వాత ఆ ముందు మాత్రం ఇవ్వద్దు. అలా చేస్తే లక్ష్మీదేవికి దూరంగా ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ జీవించాల్సిన పరిస్థితి కలుగుతుంది. కష్టాలు కూడా తలెత్తే అవకాశం ఉంది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం