Sankranti Kites: మకర సంక్రాతి నాడు గాలిపటాలను ఎందుకు ఎగురవేయాలి? శ్రీరాముడికి గాలిపటాలకు సంబంధం ఏంటి?
Sankranti Kites: ఈ నాలుగు రోజులు కూడా గంగిరెద్దులు, హరిదాసులు భోగి మంటలు పిండివంటలు గాలిపటాలు.. ఇలా చెప్పుకుపోతే సంక్రాంతి గురించి చాలానే ఉంది. అయితే సంక్రాంతి నాడు ఎందుకు గాలిపటాలు ఎగరవేయాలి? దాని వెనుక కథ ఏంటి అనేది చాలా మందికి తెలియదు. ఆ విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం.
సంక్రాంతిని మనం పెద్ద పండుగ అని అంటాము. పల్లెల్లో ఎప్పుడూ లేనంత జనం మనకు సంక్రాంతికి కనపడతారు. సంక్రాంతి సెలవులకి విదేశాల్లో ఉద్యోగం చేసే వాళ్ళు, మహానగరాల్లో ఉద్యోగం చేసే వాళ్ళు అందరూ కూడా పల్లెల్లో వచ్చి పండుగను కుటుంబ సభ్యులతో సంతోషంగా జరుపుకుంటారు.
సంక్రాంతి నాడు ఆకాశంలో గాలిపటాలు మనకి ఎగురుతూ కనబడుతూ ఉంటాయి. సంక్రాంతి ముందు రోజు భోగి పండుగ చేసుకుంటాము. సంక్రాంతి తర్వాత రోజు కనుమ. ఆ తర్వాత రోజు ముక్కనుమ పండుగను జరుపుకుంటాము. ఈ నాలుగు రోజులు కూడా గంగిరెద్దులు, హరిదాసులు భోగి మంటలు పిండివంటలు గాలిపటాలు.. ఇలా చెప్పుకుపోతే సంక్రాంతి గురించి చాలానే ఉంది.
అయితే సంక్రాంతి నాడు ఎందుకు గాలిపటాలు ఎగరవేయాలి? దాని వెనుక కథ ఏంటి అనేది చాలా మందికి తెలియదు. ఆ విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఎందుకు సంక్రాంతి నాడు గాలిపటాలు ఎగురవేయాలి?
సంక్రాంతి నాడు గాలిపటాలని ఎగరవేయడం ఎప్పటి నుంచో వస్తున్న సంప్రదాయం, పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రంగురంగుల గాలిపటాలని ఎగుర వేస్తూ సంతోషంగా సమయాన్ని గడుపుతారు.
సంక్రాంతి నాడు గాలిపటాలని ఎగరవేయడం వెనక శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి. బహిరంగ ప్రదేశంలో ఆకాశంలో గాలిపటాలని ఎగరవేయడం వలన విటమిన్ డి మనకి లభిస్తుంది. విటమిన్ డి శరీరానికి చాలా అవసరం. ఎండలో కాసేపు నిలబడి గాలిపటాలని ఎగరు వేస్తే మనకి చలి నుంచి రక్షణ అందుతుంది. శరీరానికి వ్యాధులు ఏమి కూడా సోకవు.
సంక్రాంతి నాడు గాలిపటాలని ఎగరవేయడం వెనక మతపరమైన కారణాలు ఉన్నాయి. ఆ విషయానికి వచ్చేస్తే, ఇతిహాసాల వివరాల ప్రకారం చూస్తే మకర సంక్రాంతి నాడు గాలిపటాలని ఎగురవేసే సంప్రదాయం ఇప్పుడు వచ్చినది కాదు. శ్రీరాముడు నుంచి కూడా ఉంది.
ఆయన ఈ సాంప్రదాయాన్ని మొదలుపెట్టారట. మొదటిసారి శ్రీరాముడు గాలిపటం ఎగుర వేశారు. ఆ గాలిపటం ఇంద్ర లోకానికి వెళ్ళింది. అప్పటినుంచి శ్రీరాముడు మొదలుపెట్టిన సాంప్రదాయాన్ని హిందువులు కొనసాగిస్తున్నారు.
సరదాగా, సంతోషంగా..
సంక్రాంతి నాడు పతంగులు ఎగరవేయడం ఎంతో సంతోషంగా ఉంటుంది. గాలిపటం ఐశ్వర్యానికి, ఆనందానికి, స్వేచ్ఛకి చిహ్నం అని కూడా అంటారు.
నల్ల చెరుకుని ఎందుకు వాడతారు?
సంక్రాంతి నాడు నల్లచెరుకుని వాడడం కూడా మనం చూస్తూ ఉంటాం. నల్లచెరుకుని ఎందుకు సంక్రాంతికి వాడతారు అనే విషయానికి వచ్చేస్తే, దక్షిణాది రాష్ట్రాల్లో నల్ల చెరుకు లేకుండా ఈ పండుగ పూర్తవదు.
సంక్రాంతి నాడు నల్లచెరుకుని నువ్వులు, బెల్లంతో కలిపి బంధువులకి ఇస్తారు. నల్ల చేరుకొని తినడం సాంప్రదాయం ఎప్పటి నుంచో ఉంది. పండుగ పూట గుమ్మడికాయతో చేసిన పులుసు, మినప గారెలు, నల్ల చెరుకు ముక్కలు, నువ్వుల వంటలు తప్పకుండా తింటారు.
ఆరోగ్యంగా ఉండడానికి ఈ కాలంలో చలి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఔషధ గుణాలు ఉన్న నల చేరుకొని తింటే మంచిదని పెద్దలు అంటూ ఉంటారు. గుమ్మడికాయను తీసుకోవడం వలన సంతాన సమస్యలు కలగకుండా ఉంటాయట.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం