Maha Kumbhamela: కుంభమేళాలో స్నానం ఎందుకు చేయాలి? స్నానం చేసేటప్పుడు ఏం చేయాలి?
Maha Kumbhamela: వైశాఖంలో నర్మదానదిలో కోటిసార్లు స్నానం చేస్తే ఎంత ఫలితం వస్తుందో, ప్రయాగలో కుంభమేళా జరిగే సమయంలో ఒక్కసారి స్నానంచేస్తే ఆ పుణ్యఫలాన్ని పొందవచ్చని స్కాందపురాణం చెబుతోంది అని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

కార్తీకమాసంలో వెయ్యిసార్లు గంగాస్నానం, మాఘమాసంలో వందసార్లు గంగాస్నానం, వైశాఖంలో నర్మదానదిలో కోటిసార్లు స్నానం చేస్తే ఎంత ఫలితం వస్తుందో, ప్రయాగలో కుంభమేళా జరిగే సమయంలో ఒక్కసారి స్నానంచేస్తే ఆ పుణ్యఫలాన్ని పొందవచ్చని స్కాందపురాణం చెబుతోంది అని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
ఆది శంకరాచార్యులవారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాధు, సంతు సమాజమును ఒక్క చోటికి చేర్చి,13 అఖారాలను ఏర్పరిచి సనాతన ధర్మరక్షక వ్యవస్థను ఏర్పరిచారు. తరువాత కాలములో అనేక ధర్మాచార్యులు ఈ వ్యవస్థను దశదిశలా విస్తరింపజేసారు.
అటువంటి సాధువులలో కొందరిని నాగసాధువులని పిలుస్తారు. వీరు కుంభమేళాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు. వీరికి శరీరంతో తాదాత్మ్యం ఉండదు. మనం జీవిస్తున్న సమాజానికి అతీతంగా ఉండే ఆ యోగుల తత్త్వం మనకు అంతుపట్టదు. అందుకే వారు మనకు సాధారణ సామాజిక జీవితంలో ఎదురుపడరు.
భక్తితో గంగను తలచుకుంటూ నదిలో మూడు మునకలు వేయాలి. పవిత్రమైన నదిని అపరిశుభ్రం చేయకుండా జాగ్రత్త తీసుకోవాలి. స్నానం తరువాత దగ్గరలో ఉన్న ఆలయాలను దర్శించుకోవాలి అని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
పురాణాలు, జ్యోతిష్యశాస్త్రం కుంభమేళాలో చేసే పవిత్ర స్నాన విశిష్టతను ఎంతో కీర్తించాయి. అయితే ఆరోగ్యరీత్యా, వయోభారంవల్ల అక్కడికి పోలేనివారు అక్కడినుంచి తెచ్చిన నీటిని తాము స్నానం చేసే నీటిలో కలుపుకొని స్నానం చేయవచ్చు.
అదీ కుదరకపోతే తామున్న చోటే గంగా నదీ పేరును తలచుకుని స్నానం చేయవచ్చు అని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారుఐక్యత, ఏకత్వాల పండుగ కుంభమేళా. శాశ్వతమైన, అనంతమైన దివ్య స్వభావాన్ని కుంభమేళాలో అనుభవించగలం. నదీ ప్రవాహంలాగే జనప్రవాహం కూడా కుంభమేళా వైపు సాగి సముద్రంలో నదులు సంగమించినట్టు వివిధ ప్రదేశాలవారు ఏకమయ్యే సంగమస్థలం కుంభమేళా.