వాస్తు ప్రకారం బాత్రూం తలుపును ఎందుకు మూసి ఉంచాలి?-why we should close bathroom doors according to vastu check problems occurs with this ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  వాస్తు ప్రకారం బాత్రూం తలుపును ఎందుకు మూసి ఉంచాలి?

వాస్తు ప్రకారం బాత్రూం తలుపును ఎందుకు మూసి ఉంచాలి?

Peddinti Sravya HT Telugu

చాలా మంది తెలియక కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. దాని వలన ఎంతో నష్టం కలుగుతుంది. మనం కొన్ని కొన్ని సార్లు చేసే కొన్ని పొరపాట్లు వలన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. బాత్రూం తలుపును ఎందుకు తెరిచి ఉంచకూడదు? అలా చేస్తే ఎలాంటి నష్టాలు కలుగుతాయి వంటివి తెలుసుకుందాం.

వాస్తు ప్రకారం బాత్రూం తలుపును ఎందుకు మూసి ఉంచాలి? (pinterest)

వాస్తు ప్రకారం పాటించడం వలన సానుకూల శక్తి ప్రవహిస్తుంది. ప్రతికూల శక్తి తొలగిపోతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం పాటించడం వలన ఇబ్బందుల నుంచి కూడా బయటపడొచ్చు. చాలా మంది తెలియక కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. దాని వలన ఎంతో నష్టం కలుగుతుంది. మనం కొన్ని కొన్ని సార్లు చేసే కొన్ని పొరపాట్లు వలన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

వాస్తు ప్రకారం బాత్రూం ఏ దిశలో ఉండాలి, టాయిలెట్ సీట్ ఎటువైపు ఉండాలి ఇలాంటివి కూడా చూసుకోవాలి. అలాగే చాలా మంది బాత్రూం తలుపుని తెరిచి ఉంచుతారు. కానీ బాత్రూం తలుపుని మూసి ఉంచాలి. బాత్రూం తలుపుని ఎందుకు మూసి ఉంచాలి? ఒకవేళ అలా చేయకపోతే దాని వలన కలిగే నష్టం ఏంటి? వంటి వివరాలను తెలుసుకుందాం.

వాస్తు దోషాలు

ఇంట్లో చేసే కొన్ని పొరపాట్ల వలన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. బాత్రూం సరైన వైపు లేకపోయినట్లయితే వాస్తు దోషాలని ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీని కారణంగా ఆర్థిక సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. పేదరికం, గొడవలు ఇలా ఎన్నో చోటు చేసుకుంటూ ఉంటాయి.

బాత్రూం సరైన దిశలో లేకపోతే ఏమవుతుంది?

ఇంట్లో ఉండే బాత్రూం దిశ విషయంలో వాస్తు నియమాలను పాటించాలి. బాత్రూం సరైన దశలో లేకపోతే చెడు ప్రభావాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. బాత్రూం ని సరైన దిశలో నిర్మించకపోతే రాహువు అశుభ ఫలితాలను ఇస్తాడు. వాస్తు శాస్త్రంలో బాత్రూం తలుపు తెరిచి ఉండడాన్ని అశుభంగా పరిగణించబడుతుంది.

బాత్రూం తలుపును ఎందుకు తెరిచి ఉంచకూడదు?

వాస్తు ప్రకారం బాత్రూం తలుపుని తెరిచి ఉంచడం వలన ఇబ్బందులు వస్తాయి. అలా బాత్రూం తెరిచి ఉంచడం వలన రాహువు దోషాలని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇంట్లో ప్రతికూల శక్తి కూడా కలుగుతుంది. ముఖ్యంగా బెడ్ రూమ్ కి అనుసంధానమై బాత్రూం ఉన్నట్లయితే కచ్చితంగా తలుపును మూసివేయండి. లేదంటే బెడ్ రూమ్ లో ప్రతికూల శక్తి ఏర్పడుతుంది.

బాత్రూం ఏ దిశలో ఉండాలి?

  1. వాస్తు ప్రకారం బాత్రూం నిర్మించేటప్పుడు సరైన దిశ ఏదో ఖచ్చితంగా తెలుసుకోవాలి. బాత్రూం వాయువ్య లేదా ఆగ్నేయ దశలో నిర్మించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది.
  2. ఈశాన్యం వైపు మాత్రం బాత్రూం నిర్మించవద్దు, అలా చేయడం వలన కుటుంబానికి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది.
  3. బాత్రూం గోడలు, టైల్స్ తెలుపు, లైట్ బ్లూ, ఆకుపచ్చ లేదా క్రీమ్ కలర్ లో ఉంటే మంచిది.
  4. నలుపు, ముదురు రంగులు ఉండడం మంచిది కాదు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు.

సంబంధిత కథనం