Copper Ring: రాగి ఉంగరం ధరిస్తే మంచిదని ఎందుకంటారు? దీని వల్ల కలిగే ప్రయోజనాలేంటి?
Copper Ring: రాగి ఉంగరం ధరించడం చాలా మంచిది. ఎంత మంచిదంటే, ఆధ్మాత్మికంగానే కాదు, శారీరకంగా, మానసికంగానూ ప్రయోజనాలను తెచ్చిపెడుతుందట. అదెలాగో చూసేద్దామా..!!
వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, భారతీయ ప్రాచీన సంప్రదాయాల్లో కొన్ని లోహాలు మన శరీరాన్ని, మనసును ప్రభావితం చేసే శక్తిని కలిగి ఉంటాయి. వాటిల్లో ఒకటైనదే ఈ రాగి లోహం. దీనిని మన వేలికి ధరించినప్పుడు మన మొత్తం శారీరక, మానసిక ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపుతుందని నమ్ముతారు. కొన్ని నమ్మకాల ప్రకారం, కాపర్ ఉంగరం ధరించడం అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందని చెబుతారు. ఈ ఉంగరం శరీరంలోని శక్తుల సమతుల్యతను కాపాడి, మంచి ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుందని చెబుతారు. కాపర్ కు యాంటీమైక్రోబియల్ లక్షణాలు ఉండడం వలన, ఇది అంటువ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది.
కాపర్ ఉంగరం ధరించడం వల్ల సానుకూల ఫలితాలు కలుగుతాయనే నమ్మకం విస్తారంగా ఉంది. కాపర్ లోహం లక్షణాలే దీనికి కారణమని నిపుణులు చెబుతున్నారు. ఈ లోహ స్వభావాన్ని బట్టి చర్మ ఉబ్బరాన్ని నివారించగలదు. రక్తప్రసరణను మెరుగుపరచగలదు. ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థను ప్రోత్సహించగలదు. అదనంగా, కాపర్ ఉంగరం ఎముకల మధ్య జాయింట్‌ను ఆరోగ్యంగా ఉంచి ఆర్థరైటిస్ సమస్యలు రాకుండా చేయగలదనే విషయం ప్రచారంలో ఉంది. ఈ నమ్మకాలపై శాస్త్రీయ ఆధారాలు లేకపోయినా, అనేకమంది కాపర్ శక్తిని నమ్మి కాపర్ ఆభరణాలు ధరించడానికి ప్రాధాన్యం ఇస్తారు. రాగి లోహంతో తయారుచేసిన ఉంగరాలు ధరించడం వల్ల మరిన్ని ప్రయోజనాలున్నాయట. అవేంటో చూద్దాం.
రాగి ఉంగరం ప్రయోజనాలు..
రెండవ వేలికి కాపర్ ఉంగరం ధరించడం శరీరం, మనసుకు అనేక ప్రయోజనాలను కలిగిస్తుందని నమ్ముతారు. కాపర్ శరీర శక్తి స్థాయిలను సమతుల్యం చేసి, మనసుకు శాంతి భావనను ప్రేరేపిస్తుందని చెబుతారు. ఇది రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. శరీరానికి ఆక్సిజన్ సరఫరా అయ్యేటట్లుగా ఉంచి, ఆరోగ్యంగా ఉంచుతుంది. కాపర్‌లో సహజమైన యాంటీమైక్రోబియల్, యాంటీఫంగల్ లక్షణాలు ఉండటం వలన, ఇది మీ ఇమ్యూనిటీని బూస్ట్ చేసి, అంటువ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది.
రాగి లోహపు ఉంగరం ధరించడం కారణంగా శరీరంలోని శక్తి సమతుల్యత ఏర్పడుతుంది. ఆధ్మాత్మికంగా చెప్పాలంటే, దుష్టశక్తిని పారద్రోలి ఆత్మను శుద్ధి చేస్తుంది. ప్రత్యేకించి చెప్పాలంటే మనం చేసే ఆరాధానల్లోని పాజిటివ్ శక్తిని ఆత్మకు చేరవేస్తుంది.
కాపర్ లో ఉండే యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు జాయింట్ నొప్పులు, కఠినతనాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. ప్రత్యేకంగా ఆర్థరైటిస్ ఉన్న వ్యక్తులు కాపర్ ఉంగరం ధరించడం మంచిది. ఇంకా ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని, స్వీయ గౌరవాన్ని మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది. దీని వల్ల నిర్ణయాలు తీసుకోవడం సులభమవుతుంది.
కాపర్ ఉంగరం ధరించడం చర్మానికి కూడా మంచిదేనట. ఎందుకంటే ఇది శరీరానికి కోలాజెన్, ఎలాస్టిన్ ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది. ఈ రెండు పదార్థాలు చర్మాన్ని మృదువుగా చేసి, ముడతలు, మచ్చలు తగ్గించడంలో సహాయపడతాయి.
చివరగా, రాగిలో ఆధ్యాత్మిక లక్షణాలు కూడా ఉంటాయని చెబుతారు. ఇది మీ ఆధ్యాత్మిక అవగాహనను మెరుగుపరచి, అంతర్గత జ్ఞానం పెరిగేందుకు దారితీస్తుంది.
కాపర్ ఉంగరాన్ని ఉంగరపు వేలికి ధరించడం అందరికీ ఒకేలా ప్రభావం చూపించకపోవచ్చు. దీనిని ధరించే ముందు నిపుణుడైన జ్యోతిష్కుని సంప్రదించడం మంచిది. అనేక మంది కాపర్ ఉంగరాలు ధరించడం వల్ల సానుకూల ప్రభావాలను అనుభవించారు. ఉంగరం ధరించే సమయంలో అది మంచినాణ్యత కలిగి ఉందా, చర్మానికి ఇరిటేషన్ లేదా ఇతర సమస్యలు కలిగించని పదార్థాలతో తయారు చేయబడినదేనా అని చెక్ చేసుకోవాలి.