నుదటిపై తిలకం లేదా బొట్టు పెట్టుకోవడం హిందూ ఆచారాలలో చాలా పవిత్రమైనది.ప్రతి రోజు నుదుటున బొట్టు పెట్టుకోకుండా బయటకు రాని వారు చాలా మంది ఉంటారు. అయితే బొట్టు అనేది కేవలం సంప్రదాయం, అలంకరణలో భాగమేనా..? అంటే కచ్చితంగా కాదనే చెబుతున్నాయి శాస్త్రాలు. సైన్స్ కూడా బొట్టు పెట్టుకోవడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయని చెబుతోంది. పురాణాలు, యోగ శాస్త్రం, జ్యోతిష్య శాస్త్రం, ఆయుర్వేద శాస్త్రాలతో పాటు సౌందర్య శాస్త్రాల్లో బొట్టు గురించి కొన్ని ఆసక్తికర విషయాలను చెబుతున్నాయి.అవేంటో తెలుసుకుందాం.
పురాణాలు ఉపనిషత్తులు, వేద గ్రంథాలు నుదిటిన బొట్టుకు చాలా ప్రాధాన్యతనిస్తాయి.తిలకం దేవుడిపై విశ్వాసానికి చిహ్నమని పురాణాలు చెబుతున్నాయి. పూజలు, వ్రతాలు, శుభకార్యాలకు ముందు తప్పకుండా బొట్టు ధరిస్తారు. అజ్ఞా చక్రం మీద బొట్టు పెట్టుకోవడం వల్ల శాంతి, శక్తి, ఏకాగ్రత లభిస్తాయని విశ్వాసం. కుంకుమ లక్ష్మీదేవికి ప్రతీక.వివాహిక స్త్రీలు నుదిటిపై తిలకం ధరించడం వల్ల ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆకర్షించినట్టవుతుంది. దైవత్వాన్ని ఆకర్షిస్తుంది. పసుపు పొడి, సున్నంతో తయారయే బొట్టులో సానుకూల లక్షణాలు ఎక్కవ.కనుక ప్రతిరోజూ కుంకుడు ధరించే స్త్రీలు చెడు శక్తుల నుండి, ప్రతికూలత నుండి రక్షణ పొందుతారని నమ్ముతారు.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బొట్టు స్వచ్ఛతకు చిహ్నం. నుదిటిపై బొట్టు పెట్టుకోవడం వల్ల కనుబొమ్మల మధ్యలో ఉంటే అధిష్టాన దేవతకు శక్తి , రక్షణ లభిస్తాయి. అధిష్టాన దేవత అనుగ్రహం ఉంటే వ్యక్తి సంతోషంగా జీవించగలుగుతాడు.
నుదిటిపై తిలకం పెట్టుకోవడం వల్ల కనుబొమ్మల మధ్యన ఉండే అజ్ఞా చక్రం సక్రియం అవుతుంది. శరీరంలోని మొత్తం 7 శక్తి కేంద్రాల్లో అత్యంత కీలమైనది అజ్ఞా చక్రం. ఇది శక్తికి నిలయం. మానవ శరీరంలోని 3నాడీ వ్యవస్థలు ఇక్కడ కలుస్తాయి. ఇక్కడ తిలకం ధరించడం వల్ల ఆధ్మాత్మిక, భౌతికపరంగా ప్రయోజనాలను పొందవచ్చు. శారీరక స్పృహ పెరుగుతుంది.
సైంటిఫిక్ అధ్యయనాల ప్రకారం నుదిటిపై తిలకం పెట్టుకోవడం వల్ల పిట్యటూరీ గ్రంథి ఉత్తేజితం అవుతుంది. ఇది మనిషికి శక్తిని ఇస్తుంది. మెదడు చురుగ్గా మారి సోమరితనం నశిస్తుంది. మానసిక ఒత్తిడి తగ్గి రిఫ్రెషింగా అనిపిస్తుంది. ఓపిక, శాంతి పెరుగుతుంది. తిలకం రాసుకోవడం వల్ల మెదడులోని కొన్ని రసాయనాలు సమతుల్యంగా స్రవిస్తాయి. ఇది ఉదాసీనత, ప్రతికూలత, నిరావ భావాలను తగ్గిస్తుంది. వ్యక్తిలో సానుకూలతను పెంచుతుంది. నుదిటిపై తిలకం ధరించినప్పుడు నాడీ మండల క్రియాశీలత ప్రారంభమయి నాడీ మండలాన్ని సక్రియం చేస్తుంది. ఫలితంగా నిద్రలేమి, సైనసైటిస్, మానసిక ఇబ్బందులు వంటి వివిధ వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఆయుర్వేదం ప్రకారం నుదుటిన కుంకుమ ధరించడం వల్ల ఒత్తిడి, నిద్రలేమి వంటి అనేక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. చందనం, విభూది వంటి వాటిని పెట్టుకోవడం వల్ల తలనొప్పి, ఒత్తిడి తగ్గుతాయి.సైనసైటిస్ సమస్యకు కూడా బొట్టు మంచిది. కనుబొమ్మల మధ్యలో ట్రైజెమినల్ నర్వ్ అనే నాటి ఉంటుంది. దీన్ని తాకడం వల్ల ముక్కుకు రక్త ప్రసరణ పెరిగి సైనస్ క్లియర్ అవుతుంది.
తిలకాన్ని ధరించడం వల్ల నుదిటిపై ఉండే చర్మం ముడతలు రాకుండా ఉంటుందని సౌందర్య అధ్యయనాలు చెబుతున్నాయి. వాటి ప్రకారం నుదిటిపై కొన్ని తంతువులు, కళ్లు, చర్మానికి సంబంధించిన కండరాలు ఉంటాయి బొట్టు పెట్టుకోవడం వల్ల అవి ఉత్తేజితమవుతాయి. ఆక్సిజన్ ఒత్తిడిని, రక్త సరఫరాలను పెంచి నల్లటి వలయాలు, ముడతలు రాకుండా కాపాడుతుంది. కంటి చూపును సమతుల్యం చేయడానికి, చర్మాన్ని మృదువుగా మార్చడానికి కూడా తిలకం సహాయపడుతుంది.తిలకాన్ని ప్రతి రోజూ ధరించడం వల్ల అంటు వ్యాధుల నుంచి కూడా రక్షణ లభిస్తుంది.