పూజలో పెర్ఫ్యూమ్ ఎందుకు సమర్పిస్తారు? దీని వెనుక ఉన్న పరమార్థం ఏంటి?-why perfumes are offered to god or goddess in puja time ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  పూజలో పెర్ఫ్యూమ్ ఎందుకు సమర్పిస్తారు? దీని వెనుక ఉన్న పరమార్థం ఏంటి?

పూజలో పెర్ఫ్యూమ్ ఎందుకు సమర్పిస్తారు? దీని వెనుక ఉన్న పరమార్థం ఏంటి?

Gunti Soundarya HT Telugu

పూజ చేసేటప్పుడు కొంతమంది సువాసనలు వెదజల్లే అగరబత్తితో పాటు పెర్ఫ్యూమ్ కూడా అందిస్తారు. ఇది హిందూ సంప్రదాయంలో మాత్రమే కాదు ఇస్లామిక్ సంప్రదాయంలోనూ ఉంది. అసలు సెంట్ ఎందుకు సమర్పిస్తారు? దీని వెనుక ఉన్న పరమార్థం ఏంటో తెలుసుకుందాం.

పూజలో సెంట్ ఎందుకు సమర్పిస్తారు? (pinterest)

దేవతలకు పూజ చేసేటప్పుడు దీపం వెలిగించి పూలు, పండ్లు సమర్పించడం ఆచారం. వాటితో పాటు ఖచ్చితంగా పెర్ఫ్యూమ్ కూడా సమర్పిస్తారు. ఇది మతపరంగా, ఆధ్యాత్మిక సంప్రదాయాలలో విశేషమైన ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. సువాసన దైవిక సంబంధాన్ని సూచిస్తుంది. పరిసరాలను శుద్ది చేస్తుంది.

పూజలో సెంట్ ఎందుకు సమర్పిస్తారు

ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టిస్తుంది. దేవతలను సంతోషపెట్టడం కోసం తప్పనిసరిగా పెర్ఫ్యూమ్ ని అందిస్తారు. ఇది కేవలం హిందూ మతంలో మాత్రమే కాదు ఇస్లాంతో పాటు వివిధ సంప్రదాయాలలో కనిపిస్తుంది. పూజలో సమర్పించే సుగంధ ద్రవ్యాలు సహజ పదార్థాలు, సింథటిక్ సమ్మేళనాల మిశ్రమంతో తయారు చేస్తారు. శరీరాలు, వస్త్రాలకు మంచి సువాసన ఇచ్చేందుకు వీటిని ఉపయోగిస్తారు. ఇది కేవలం సౌందర్య సాధనం మాత్రమే కాదు వివిధ సంప్రదాయాలలో మతపరమైన ప్రాముఖ్యత ఉంది. స్వచ్చత, భక్తికి ప్రతీక.

మతపరమైన ఆచారాలు, వేడుకల సమయంలో పవిత్ర వాతావరణాన్ని మెరుగుపరుస్తుంది. దేవతలకు సువాసన అందించే చర్య దైవిక ఇంద్రియాలను సంతోషపెట్టడం, వారి ఆశీర్వాదాలను కోరడం లక్ష్యంగా గౌరవ సూచకంగా పరిగణిస్తారు. ఆహ్లాదకరమైన సువాసన ఆధ్యాత్మికంగా మంచి వాతావరణాన్ని సృష్టిస్తుంది. దైవంతో మనల్ని కనెక్ట్ చేస్తుంది. ఆధ్యాత్మిక అనుభవాని పెంచుతుంది.

శివలింగానికి పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా పెర్ఫ్యూమ్ అందిస్తారు. ఇలా చేయడం అంటే శివుని అనంతమైన అనుగ్రహం ఇవ్వమని భక్తులు కోరుకుంటూ ఇలా చేస్తారు. వివాహాలు, భాగస్వామ్యాలకు సంబంధించిన సమస్యలను తగ్గించగల దైవిక శక్తిని ఇది ప్రేరేపిస్తుంది. సువాసనతో కూడిన భక్తి స్వచ్చత, ప్రేమ, ప్రశాంతమైన వాతావరణాన్ని ఇస్తుంది. సంబంధంలోని సవాళ్ళను తొలగించేందుకు సహాయపడుతుంది.

గంధం సేవ

పూజలో గంధం సేవకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఇది కూడా దేవుడికి సువాసన ఇచ్చే పరిమళాన్ని సమర్పించడమే అవుతుంది. భగవంతుడి విగ్రహానికి గంధాన్ని మెత్తగా నూరి ఆ పేస్ట్ ను పూస్తారు. గంధం మంచి సువాసను వెదజల్లుతుంది. గంధం మెత్తగా నూరడం ఎంతో ఓర్పు, నేర్పుతో చేస్తారు. అప్పుడే అది మంచి సువాసన ఇస్తుంది. మన జీవితం కూడా ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ వాటిని చిరునవ్వుతో స్వీకరించాలని దీని ఉద్దేశం. భక్తుడు కూడా కష్టాలు రాగానే దైవాన్ని నిందించకుండ ఓర్పుగా దేవుడిని నమ్ముకుని ఉండాలని సూచిస్తుంది. అందుకే పూజలో చేసే గంధసేవకు ఎంతో అర్థం ఉంటుంది.

ఇస్లామిక్ సంప్రదాయంలో ఎందుకు ఉపయోగిస్తారంటే

హిందూ మతంలోనే కాదు ఇస్లామిక్ సంప్రదాయంలోనూ పెర్ఫ్యూమ్ ఉపయోగిస్తారు. ఇది మతపరమైన బోధనలు, సంప్రదాయ ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. మొహమ్మద్ ప్రవక్త ఆహ్లాదకరమైన సువాసనలను ఉపయోగించడాన్ని ప్రోత్సహించినట్టు చెబుతారు. ఇది పరిశుభ్రత, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. ముస్లింలు తరచుగా ప్రార్థనలు, మసీదు సందర్శనకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా వ్యక్తిగత శుద్ధీకరణలో భాగంగా పెర్ఫ్యూమ్ చేసుకుని వెళతారు.

గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.