Holika dahan: కొత్తగా పెళ్ళైన వాళ్ళు హోలికా దహన్ ఎందుకు చూడకూడదు? దీని వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి?-why newly married couple do not to see holika dahan what is the reason behind this ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  Why Newly Married Couple Do Not To See Holika Dahan, What Is The Reason Behind This

Holika dahan: కొత్తగా పెళ్ళైన వాళ్ళు హోలికా దహన్ ఎందుకు చూడకూడదు? దీని వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి?

Gunti Soundarya HT Telugu
Mar 14, 2024 01:20 PM IST

Holika dahan: హోలీ ముందు రోజు చేసే హోలికా దహన్ వేడుకని కొత్తగా పెళ్ళైన నూతన వధూవరులతో పాటు కొంతమంది చూడకూడదు. దీని వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో తెలుసా? వాళ్ళు హోలికా దహనం చూస్తే ఏమవుతుంది.

హోలికా దహనం
హోలికా దహనం (pinterest)

Holika dahan: ఫాల్గుణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజు హోలీ పండుగ జరుపుకుంటారు. హోలీకి ఒక రోజు ముందు హోలీకా దహనం నిర్వహిస్తారు. ఈ ఏడాది హోలికా దహనం మార్చి 24న వచ్చింది. కొన్ని ప్రాంతాల్లో హోలికా దహనాన్ని చాలా ఉత్సాహంగా జరుపుతారు. హోలిక బొమ్మని తయారు చేసి నిప్పు అంటిస్తారు. చెడుపై విజయాన్ని సూచికగా ఇలా చేస్తారు. అయితే హోలికా దహనం మీద గురించి కొన్ని అంశాలు ఉన్నాయి. సంప్రదాయం ప్రకారం కొంతమంది దీన్ని చూడటం నిషేధం.

ట్రెండింగ్ వార్తలు

హిందూ మతంలో హోలికా దాహనానికి చాలా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. అయితే కొంతమంది హోలికా దహనం చూడటానికి వీల్లేదు. దానికి వెనుక ఒక మతకారమైన కారణం కూడా ఉంది. దీనికి మతపరమైన, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంటుంది. మహిళలు సాయంత్రం పూట పూజ చేసి దేవతకు నైవేద్యం సమర్పించి విశ్వాసంతో పూజించి, పెద్దల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. శుభ ముహూర్తంలో హోలికా దహనం నిర్వహిస్తారు. మహిళలు, పురుషులు, పిల్లలు అందరూ హోలికా దహనం వేడుకుని చూస్తారు. అయితే కొత్తగా పెళ్లయిన అమ్మాయిలు, కొత్తగా ఇంట్లోకి వెళ్ళిన వ్యక్తులతో పాటు కొంతమంది ఈ వేడుకను చూసేందుకు వీల్లేదు.

హోళికా దహన్ ఎందుకు చూడకూడదు?

మత విశ్వాసాల ప్రకారం కొత్తగా పెళ్లైన మహిళలు తమ అత్తమామలతో కలిసి మొదటి హోలికా దహనాన్ని చూడకూడదు. అందుకే నూతన వధువు తమ పుట్టింట్లో మొదటి హోలీ జరుపుకుంటుంది. పురాణాల ప్రకారం హోలిక దహనం రోజున హోలిక అగ్నిలో ఆహుతి అయిపోతుంది. ఇది చెడుపై మంచి సాధించిన విజయంగా పరిగణిస్తారు. అంటే అగ్నిలో శరీరం కాలిపోవడానికి చిహ్నంగా భావిస్తారు.

అలా దహనం అవుతున్న శరీరాన్ని కొత్తగా పెళ్లయిన స్త్రీలు చూడటం మంచిది కాదు. ఇది వారి వైవాహిక జీవితం మీద ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఇతిహాసాల ప్రకారం హోలిక అగ్నిలో మండుతున్న స్త్రీ శరీరం గా చూస్తారు. దీన్ని చూడటం వల్ల దాంపత్య జీవితంలో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఎవరెవరు హోలికా దహనం చూడకూడదు?

అత్తా, కోడలు కూడా కలిసి హోలికా దహనాన్ని చూడకూడదు. ఇది వారి జీవితాలకు హాని కలిగిస్తుంది. గర్భిణీ స్త్రీలు కూడా చూడకుండా ఉండాలి. నవజాత శిశువు కలిగిన తల్లిదండ్రులు కూడా ఈ వేడుకకు దూరంగా ఉండాలి. ఒక సంతానం ఉన్న వాళ్ళు హోలికా దహనానికి నిప్పు పెట్టకూడదని అంటారు. కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళు హోలికా దహనం కార్యక్రమాన్ని వీక్షించకూడదు. కొత్తగా పెళ్లైన జంటలు హోలికా దహనంలోని అగ్నిని చూడకూడదు. ఫాల్గుణ పౌర్ణమి రోజు హోలిక తన ప్రేమికుడిని పెళ్లి చేసుకోవాలని అనుకుందట. అయితే పెళ్లి కాకముందే ఆమె అగ్నిలో కాలి చనిపోయిందని చెబుతారు. ఈ కారణంగా కొత్తగా పెళ్లయిన జంటలు ఈ ఆచారంలో పాల్గొనకూడదని అంటారు.

హోలికా దహనం వేడుకలో తెలుపు రంగు మినహా అన్ని రంగులు ధరించడం శుభప్రదంగా ప్రకటిస్తారు. ఈ సమయంలో పాలు, ఖీర్ వంటివి తెల్లని పదార్థాలు నైవేద్యంగా పెట్టకూడదు. అలా చేస్తే ప్రతికూల ప్రభావం ఉంటుంది