శివుడు ఆదిగానీ, అంతుగానీ లేని పరమాత్మ స్వరూపం. బ్రహ్మ (సృష్టి), విష్ణు (పాలన), మరియు రుద్ర (లయ) తత్త్వాలను కలిగిన పరబ్రహ్మ పరమేశ్వరుడు అని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.శివుడు శూన్య తత్వాన్ని సూచిస్తాడు, అంటే ఎలాంటి ఆకారము లేకున్నా, సమస్త జగత్తుని తనలో కలిపిన పరిపూర్ణ తత్వం.
అందుకే, శివుడు నిరాకార పరబ్రహ్మంగా కూడా పూజించబడతాడు అని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు..సృష్టిలోని అన్ని జీవరాశులు చివరికి లయించాల్సిన మూలం శివతత్వమే.
శివుడు శ్మశాన వాసి అని పురాణాలు చెబుతున్నాయి. అంటే, ఆయన శ్మశానంలో నివసిస్తాడని మనం నమ్ముతాం. దీనికి ఆంతర్యం ఎంతో లోతైన ఆధ్యాత్మికతతో నిండి ఉంది. శివుడు శ్మశానంలో ఉండటానికి అనేక కారణాలు ఉన్నాయి అని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
బ్రహ్మ సృష్టి చేస్తాడు, విష్ణువు పోషిస్తాడు, కానీ శివుడు లయకారకుడు. శ్మశానం అంటే, జీవితంలోని చివరి స్థానం, అక్కడికి చేరుకున్న ప్రతి జీవి ఈ భౌతిక ప్రపంచాన్ని వదిలి పరమతత్వంతో కలుస్తుంది.అందుకే, శివుడు అక్కడ ఉండి ఆత్మలను మోక్ష మార్గంలో నడిపిస్తాడు అని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
మనుషులు జీవితంలో ఎన్నో విషయాలకు అహంకారం పెంచుకుంటారు – ధనం, పదవి, బంధుత్వాలు. కానీ శ్మశానం అందరినీ సమానంగా చూసే ప్రదేశం.శివుడు అక్కడ ఉండటం ద్వారా ఈశ్వర సమత్వాన్ని సూచిస్తాడు – జీవితం తాత్కాలికమని, చివరికి అంతా భస్మమైపోతుందని గుర్తు చేస్తాడు. అందుకే శివుడు భస్మధారణం చేస్తాడు – ఇది అహంకార రహిత జీవన విధానానికి ప్రతీకం అని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
శివుడు సంపద, భోగభాగ్యాలను కోరడు.ఆయన శ్మశాన వాసిని కావడంతో పాటు, భిక్షాటన చేయడాన్ని కూడా మన పురాణాలు చెబుతున్నాయి.శివుడు శ్మశానంలో నివసించడం వల్ల అహంకారం, భయాన్ని తొలగించుకోవడం, జీవితపు తాత్కాలికతను గుర్తించడం, శివ తత్వాన్ని గ్రహించడం వంటి ఎన్నో గొప్ప సందేశాలను మనం పొందగలం అని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.