Utpanna Ekadashi: ఏకాదశి దేవత ఎవరు? ఉత్పన్న ఏకాదశి ఎందుకు జరుపుకుంటారు? దీని ప్రాముఖ్యత ఏంటి?-why is utpanna ekadashi celebrated learn religious significance ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Utpanna Ekadashi: ఏకాదశి దేవత ఎవరు? ఉత్పన్న ఏకాదశి ఎందుకు జరుపుకుంటారు? దీని ప్రాముఖ్యత ఏంటి?

Utpanna Ekadashi: ఏకాదశి దేవత ఎవరు? ఉత్పన్న ఏకాదశి ఎందుకు జరుపుకుంటారు? దీని ప్రాముఖ్యత ఏంటి?

Gunti Soundarya HT Telugu
Nov 18, 2024 08:10 PM IST

Utpanna Ekadashi: ఏకాదశి తిథికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. అయితే ఏకాదశి ఒక దేవత అనే విషయం చాలా తక్కువ మందికే తెలుసు. ఏకాదశి దేవత ఎలా ఉద్భవించింది? విష్ణుమూర్తికి ఏకాదశి తిథికి ఉన్న సంబంధం ఏంటి? ఉత్పన్న ఏకాదశి ఎందుకు జరుపుకుంటారు అనేది తెలుసుకుందాం.

ఉత్పన్న ఏకాదశి ఎందుకు జరుపుకుంటారు?
ఉత్పన్న ఏకాదశి ఎందుకు జరుపుకుంటారు?

విష్ణు ఆరాధనకు ఏకాదశి ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. విష్ణువును ఆరాధించడం ద్వారా సాధకుడు అన్ని బాధలు, పాపాలను తొలగిస్తాడని నమ్ముతారు. కార్తీక మాసంలో వచ్చే ఏకాదశిని ఉత్పన్న ఏకాదశి అంటారు. ఈ ఏడాది నవంబరు 26న ఉత్పన్న ఏకాదశిని జరుపుకుంటున్నారు.

మత విశ్వాసాల ప్రకారం ఏకాదశి దేవత ఈ రోజున ఉద్భవించింది. ఈ రోజు ఉపవాసం పాటించడం వల్ల ఆరోగ్యం, సంతానం, సుఖం, మోక్షం, పాపాల నుండి విముక్తి లభిస్తాయి. సాధకుడికి విష్ణువు అనుగ్రహం ఉంటుంది. ఉత్పన్న ఏకాదశి ఖచ్చితమైన తేదీ, మతపరమైన ప్రాముఖ్యతను తెలుసుకుందాం.

ఉత్పన్న ఏకాదశి ఎప్పుడు?

దృక్ పంచాంగ్ ప్రకారం ఏకాదశి తిథి నవంబర్ 26, 2024న ఉదయం 01:01 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు నవంబర్ 27, 2024 తెల్లవారుజామున 03:47 గంటలకు ముగుస్తుంది. ఈసారి ఉత్పన్న ఏకాదశి రోజున 3 శుభ యోగాలు రూపొందుతున్నాయని పండితులు తెలిపారు. ఉపవాసం రోజున హస్తా నక్షత్రం ఉంటుంది. ఈ రోజున ఉపవాసం ఉండి విష్ణువును ఏకాదశి దేవతను పూజించే సంప్రదాయం ఉంది. నమ్మకం ప్రకారం దేవి ఏకాదశి ఈ తేదీన జన్మించింది. అందుకే దీనిని ఉత్పన్న ఏకాదశి అంటారు. ఈ ఉపవాసం, పూజల వల్ల పాపాలు నశించి పుణ్యం, మోక్షం కలుగుతాయి.

ఈ సంవత్సరం ఉత్పన్న ఏకాదశి నాడు 3 శుభ యోగాలు ఏర్పడుతున్నాయి. ప్రీతి యోగం ఉదయం ప్రారంభమై మధ్యాహ్నం 2:14 గంటలకు ముగుస్తుంది. ఆ తర్వాత ఆయుష్మాన్ యోగం ఏర్పడుతుంది. ఇది మరుసటి రోజు మధ్యాహ్నం వరకు ఉంటుంది. ఏకాదశి రోజున ద్విపుష్కర యోగం నవంబర్ 27వ తేదీ ఉదయం 4:35 AM నుండి 6:54 AM వరకు ఉంటుంది.

ఉత్పన్న ఏకాదశి ఎందుకు ప్రత్యేకం?

పురాణాల ప్రకారం దేవత ఏకాదశి విష్ణువు శరీరం నుండి ఉద్భవించింది. విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉన్న సమయంలో మురా అనే రాక్షసుడు అతనిపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తారు. అదే సమయంలో విష్ణువు శరీరం నుండి దేవత దివ్య రూపం కనిపించింది. ఆమె యుద్ధంలో మురా రాక్షసుడిని సంహరించినది. నిద్రలేచిన తర్వాత విష్ణుమూర్తి తన దివ్య దృష్టితో జరిగింది తెలుసుకుంటాడు.

ఆమెకు ఏకాదశి అని పేరు పెట్టారు. అప్పటి నుంచి ఏకాదశి తిథి విష్ణుమూర్తికి ప్రత్యేకంగా మారింది. ఏకాదశిని పూజిస్తే సుఖ సంతోషాలు పెరుగుతాయని వరం ఇచ్చాడు. ఉత్పన్న ఏకాదశి రోజున విష్ణుమూర్తితో పాటు అమ్మవారిని ఏకాదశి పూజించడం చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. ఏకాదశి వ్రతం ప్రారంభించాలనుకునే వారు ఉత్పన్న ఏకాదశి నుంచి మొదలుపెట్టవచ్చు. శ్రీమహావిష్ణువు అనుగ్రహం వల్ల పాపాలు నశించి, జీవితాంతం ఆయన పాదాల చెంత స్థానం పొందుతారు.

గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.

Whats_app_banner