Black thread to leg: కాలికి నల్ల దారం ఎందుకు కట్టుకుంటారు? దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి?
Black thread to leg: కాలికి నల్ల దారం కట్టుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. స్త్రీలు ఏ కాలికి ధరించాలి? పురుషులు ఏ కాలికి ధరించాలో తెలుసుకుందాం.
Black thread to leg: ఒకప్పుడు పసిపిల్లలకు దిష్టి తగలకుండా ఉండడం కోసం కాలికి నల్ల దారం కట్టేవాళ్ళు. ఇప్పటికీ ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు. వెంట్రుకలతో చేసిన దారం లేదంటే నలుపు రంగు దారాన్ని కడుతూ ఉంటారు. అయితే ఇప్పుడు చాలామందికి ఇది ఒక ఫ్యాషన్ గా భావిస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా కాలికి నల్ల దారాన్ని కట్టుకుంటున్నారు. వాటికి మధ్యలో ఈవిల్ ఐ కూడా జత చేస్తున్నారు.
కాలికి నల్ల దారం కట్టుకోవడం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి. ఇవి చెడు దృష్టి నుంచి కాపాడతాయని ఎక్కువగా నమ్ముతారు. సంతోషం, శ్రేయస్సును ఇస్తాయని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. కాలికి నల్ల దారం ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం.
చెడు దృష్టి రక్షణ
చెడు దృష్టి నుంచి రక్షణ పొందటం కోసం నలుపు రంగు దారాన్ని ధరించాలని చెబుతారు. ఏదైనా ప్రతికూల శక్తి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నట్లయితే అటువంటి వాళ్ళు పాదాలకు నల్ల దారం ధరించవచ్చు. ప్రతికూల శక్తులు, హానికరమైన శక్తుల నుంచి ఇది రక్షణగా ఉంటుంది. అనుకూల శక్తిని ఇస్తుంది. నలుపు రంగు శని గ్రహాన్ని సూచిస్తుందని నమ్ముతారు. కాలికి నల్ల దారాన్ని ధరించడం వల్ల శని దేవుడు రక్షిస్తాడని విశ్వసిస్తారు.
శక్తి ప్రవాహం పెరుగుతుంది
కాలికి నల్లదారం ధరించడం వల్ల శరీర శక్తి ప్రసరణపై బ్యాలెన్స్ ప్రభావం చూపుతుంది. ఆరోగ్యకరమైన శక్తి ప్రవాహాలు మానసిక, శారీరక ఆరోగ్యానికి తోడ్పడుతాయి. అలాగే శరీరంలోని చక్రాలను సమతుల్యం చేస్తుంది. ప్రతి చక్రం జీవితంలో ప్రత్యేక కోణాన్ని సూచిస్తుంది. జీవితంలోని ఈ భాగాలు సమతుల్యంగా ఉన్నప్పుడే శ్రేయస్సు మెరుగుపడుతుందని భావిస్తారు.
వైద్య లక్షణాలు
నల్ల దారం చికిత్స లక్షణాలను కలిగి ఉంటుందని అంటారు. మానసిక, శారీరక వైద్యం రెండింటినీ సులభతరం చేస్తుంది. కాలికి నల్లదారాన్ని ధరించడం వల్ల సహజంగా చేసే వైద్య ప్రక్రియలకు మద్దతు ఉంటుందని చెబుతారు. మానసిక శారీరకంగా బలాన్ని ఇస్తుంది. సమస్యలను ఎదుర్కోవడానికి, అడ్డంకులను అధిగమించేందుకు ఓర్పు, స్థిరత్వాన్ని అందిస్తుంది.
అదృష్టాన్ని తీసుకొస్తుంది
చాలామంది నల్ల దారాన్ని రక్షణగా చూస్తారు. అటువంటి నలుపు రంగు దారం కాళ్లకు ధరించడం వల్ల జీవితంలో పాజిటివ్ వైబ్స్ ఉంటాయని నమ్ముతారు. అదృష్టం సంపదను ఆకర్షిస్తుందని అంటారు.
రాహుకేతు దోషాలు నుంచి విముక్తి
రాహు కేతు దోషాలు ఉంటే ఆకస్మిక ధన నష్టం జరుగుతుంది. అటువంటి పరిస్థితుల్లో రాహు, కేతువు దుష్ప్రభావాల నుంచి విముక్తి పొందడం కోసం ఎడమ కాలికి నల్లటి దారం ధరించడం శ్రేయస్కరం. ఇలా చేయడం వల్ల రాహుకేతు ప్రతికూల ప్రభావాల నుంచి ఉపశమనం కలుగుతుంది.
ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది
మీరు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే మీరు కాలికి నల్ల దారం ధరించవచ్చు. అలాగే ఉద్యోగం లేదా వ్యాపారంలో నష్టం ఉంటే మీ పాదాలకు నల్ల దారం ధరించడం వల్ల నష్టాలు తొలగిపోవడం కాకుండా ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది.
నల్ల దారాన్ని ఏ కాలికి కట్టాలి?
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం స్త్రీలు ఎప్పుడు ఎడమ కాలికి నల్ల దారాన్ని ధరించాలి. అలాగే పురుషులు వారి కుడి కాలుకు నల్లదారాన్ని కట్టుకోవాలి. ఇలా చేయడం చాలా శుభకరంగా భావిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం నాడు పురుషులు తమ పాదాలకు నల్ల దారాన్ని కట్టుకోవచ్చు.
గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.
టాపిక్