Karthika amavasya: రేపే అమావాస్య.. లక్మీ దేవి, వినాయకుడిని ఇలా పూజిస్తే కష్టాలు తీరుతాయి
Karthika amavasya: కార్తీక మాసంలో వచ్చే అమావాస్య రోజు వినాయకుడిని, లక్ష్మీదేవిని పూజించడం వల్ల సర్వ పాపాలు తొలగిపోయి ఐశ్వర్యం పొందుతారని నమ్మకం.
Karthik amavasya: హిందువులకు అత్యంత పవిత్రమైన మాసాలలో కార్తీకమాసం ఒకటి. శివుడికి ఎంతో ప్రీతికరమైన మాసం. అందుకే అందరూ ఈ మాసంలో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు. శివుడిని బిల్వ పత్రాలతో, విష్ణువుని తులసి ఆకులతో పూజించడం వల్ల అద్భుతమైన ఫలితాలు లభిస్తాయని నమ్ముతారు.
డిసెంబర్ 12న కార్తీకమాసంలో వచ్చే చివరి అమావాస్య. ఆరోజు గంగానదిలో స్నానం చేస్తే పాపాలన్నీ తొలగిపోతాయని చెబుతారు. స్నానామాచరించిన తర్వాత విష్ణువుకి పూజ చేస్తారు. అమావాస్య రోజు దేవుడికి పూజ చేసి ధాన ధర్మాలు చేయడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది. ఇంట్లో సంతోషంగ, సౌభాగ్యాలు కలుగుతాయి. కార్తీక మాసంలో వస్తున్న చివరి అమావాస్య రోజు పూజ చేస్తే మంచి జరుగుతుంది. ఈ అమావాస్య రోజు ధృతి యోగం ఉంటుంది. ఈ యోగంలో విష్ణుమూర్తిని పూజించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారని జ్యోతిష్యులు చెబుతున్నారు.
కార్తీకమాస పూజా విధానం
పొద్దున్నే లేచి చన్నీటి స్నానం చేయాలి. శుభ్రమైన దుస్తులు ధరించాలి. సూర్యుడికి అర్ఘ్యం సమర్పించేటప్పుడు అరచేతిలో నల్లనువ్వులు వేసుకుని సూర్యదేవుడిని పూజించాలి. దుష్ట గ్రహాల సానుకూల ప్రభావం పొందటం కోసం నవగ్రహ స్త్రోత్రం పఠించాలి. ఈరోజు విష్ణువు, శివుడి విగ్రహాలు పెట్టి దీపం వెలిగించాలి. నైవేద్యం సమర్పించాలి. రోజంతా ఉపవాసం ఉండాలి.
నవగ్రహ దోషాలు నివారించడానికి ఉదయం విష్ణు సహస్రనామం చదవాలి. శివుని అనుగ్రహం కోసం శివలింగాన్ని తేనెతో అభిషేకించాలి. కార్తీక అమావాస్య రోజు పుణ్యకార్యాలు చేయని వారికి దైవానుగ్రహం పొందేందుకు ఇదే చివరి అవకాశంగా చెప్తారు. ఈరోజు ఉపవాసం ఉంటే మాసం మొత్తం ఉపవాసంతో సమానమని పురాణాలు పేర్కొంటున్నాయి. కార్తీక అమావాస్య సంపదకి దేవతగా భావించే లక్ష్మీదేవికి అంకితం చేశారని కొన్ని పురాణాలు చెబుతున్నాయి. దీన్నే కమల జయతిగా కూడ జరుపుకుంటారు.
ఈరోజు పవిత్రమైన ఆచారాలు పాటించడం వల్ల గతంలో ఉన్న చెడు కర్మలు వదిలించుకుని మోక్ష మార్గాన్ని పొందేందుకు సహాయపడుతుందని పురాణాలు చెబుతున్నాయి.
లక్ష్మీదేవి, గణపతిని ఎందుకు పూజిస్తారు?
కార్తీక అమావాస్య రోజు లక్ష్మీదేవి, గణపతి, విష్ణువులకు కూడా పూజ చేస్తారు. లక్ష్మీదేవిని తామర పూలతో దీపారాధన చేస్తే అమ్మవారి కృప లభించి ఐశ్వర్యం సిద్ధిస్తుందని నమ్ముతారు. ఈ పూజ చేసిన వారికి జీవితంలో డబ్బుకి ఎటువంటి లోటు ఉండదు. లక్ష్మీదేవీ శ్రేయస్సు, సంపదకి ప్రతీక. ఆమెను పూజించడం వల్ల అన్ని రకాల ఆర్థిక అడ్డంకులు తొలగిపోతాయి.
గణేషుడిని పూజిస్తారు. జ్ఞానానికి ప్రతీకగా పిలుస్తారు. కార్తీఅక అమావాస్య రోజు వినాయకుడిని పూజిస్తే ఎటువంటి అడ్డంకులైన తొలగిపోతాయని నమ్మకం. ఏ పని తలపెట్టినా విజయం సాధించాలని విఘ్నాలు తొలగిపోవాలని వినాయకుడిని పూజిస్తారు. విష్ణువుని ఆరాధించడం వల్ల అన్ని కోరికలు, లక్షణాలు నెరవేర్చడంలో సహాయం లభిస్తుంది. కర్మ, పితృ రుణాల నుంచి మోక్షం పొందుతారు. ఈ పవిత్రమైన రోజు శ్రీమహావిష్ణువుని ఆరాధిస్తే శాంతి, సామరస్యం ఏర్పడుతుంది. సవాళ్ళని సులభంగా అధిగమించగలుగుతారు.
అందుకే కార్తీక మాస అమావాస్య నాడు లక్ష్మీదేవి, గణపతి, విష్ణువుని పూజించి ఆశీర్వాదాలు తీసుకుంటారు. భగవంతుని అనుగ్రహంతో ప్రతికూలత, దురదృష్టాలు తొలగిపోతాయి. పూజ పూర్తయిన తర్వాత స్తోమతకి అనుగుణంగా దానధర్మాలు చేయడం మంచిది.