గుడికి వెళ్లి పొర్లు దండాలు ఎందుకు పెడతారు దీని వల్ల కలిగే లాభాలేంటి?-why do you go to the temple and offer shayana pradikshinam what are the benefits of this ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  గుడికి వెళ్లి పొర్లు దండాలు ఎందుకు పెడతారు దీని వల్ల కలిగే లాభాలేంటి?

గుడికి వెళ్లి పొర్లు దండాలు ఎందుకు పెడతారు దీని వల్ల కలిగే లాభాలేంటి?

Ramya Sri Marka HT Telugu
Nov 15, 2024 01:27 PM IST

దేవాలయాలకు వెళ్లనిప్పుడు అక్కడున్న కొలనులో స్నానం చేసి, తడి బట్టలతో పొర్లు దండాలు పెట్టడం ఆచారంగా వస్తుంది. పొర్లు దండాలు ఎందుకు పెట్టాలి.. దీని వల్ల కలిగే లాభాలేంటి చూద్దాం.

గుడిలో పొర్లు దండాలు ఎందుకు పెడతారు
గుడిలో పొర్లు దండాలు ఎందుకు పెడతారు (pixabay)

గుడికి వెళ్లిన ప్రతి సారి గుడు చూట్టు మూడు లేదా ఐదు ప్రదక్షిణలు చేయడం శుభఫలితాలు కలిగిస్తుందని పూర్వీకులు చెబుతుంటారు. ముఖ్యంగా ఆలయ ఆచారాల్లో పొర్లు దండాలకు విశిష్ట ప్రాముఖ్యత ఉంటుంది. ముఖ్యంగా కొత్తగా పెళ్లైన వారు, సంతాన లేమి సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు, వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు పొర్లు దండాలు పెట్టడం వల్ల దైవాశీస్సులు లభించి కోరిన కోరికలు తీరతాయని నమ్ముతారు. నిజంగా పొర్లు దండాలు ఎందుకు పెడతారు. వీటి వల్ల కలిగే లాభాలేంటి తెలుసుకుందాం.

దేవుడికి మొక్క పెట్టుకున్నామనీ, వ్రతంలో లేక పూజలో ఇదొక భాగమని చాలా మంది పొర్లు దండాలు పెడుతుంటారు. గుడిలోని కొలనులో తలస్నానం చేసి, తడి బట్టలతో గుడి చుట్టూ పొర్లు దండాలు పెడుతుంటారు. అయితే ఇది కేవలం భక్తితో కూడుకున్న ఆచారం కాదని. దీంట్లో శాస్త్రోక్తమైన అంశాలు, సైన్స్ ట్రిక్స్ కూడా ఉన్నాయని ఆధ్యాత్మిక నిపుణులు చెబుతున్నారు. అవేంటో చూద్దాం.

శాస్త్రాల్లో నిర్మితమై ఉన్న సమాచారం ప్రకారం శరీరాన్ని, మనస్సునీ పూర్తిగా భక్తితో నింపే ప్రక్రియే శయన ప్రదక్షణ(పొర్లు దండాలు). సాధారణంగా కళ్లు మూసుకుని, చేతులు ముడుచుకుని దేవుడిని ప్రార్థించేటప్పడు మన మనస్సు పూర్తిగా ప్రార్థనలో మునిగిపోతుందని చెప్పలేము. ఏ పని చేసేటప్పుడైనా పూర్తి శరీరాన్ని అంకితం చేసినప్పుడు మాత్రమే దానిపై మనస్సును లగ్నం చేయగలుగుతాం. అలా పూర్తి శరీరాన్ని భాగం చేయడం వల్ల మాత్రమే మనస్సును పూర్తిగా దేవుడికి అంకితం చేయగలుగుతామని శాస్త్రాల్లో పేర్కొన్నారు. అంగ ప్రదక్షిణ చేసే వ్యక్తి తన రెండు చేతులూ తలపైకి ఎత్తి దండం పెట్టి చేతులను అదే స్థితిలో ఉంచి నేలను తాకుతూ ప్రదక్షిణ చేస్తాడు. తద్వారా శరీరంలోని ప్రతి భాగాన్ని ఆలయ భూమికి అనుసంధానం చేస్తారు. ఫలితంగా దైవ భక్తిలో మనస్సును, శరీరాన్ని పూర్తిగా అంకితం చేయగలుగుతారు.

సైన్స్ చెబుతున్న విషయాలేంటంటే ఇష్ట దేవుడి ముందు అభీష్ట వృద్ధి కోసం మనస్సును, శరీరాన్ని లగ్నం చేసినప్పుడు మనస్సు శాంతి కలుగుతుంది. పొర్లు దండాల వల్ల శరీరానికి దివ్యమైన తేజస్సు లభిస్తుంది. ఈ ప్రక్రియ శరీరంలో శక్తిని పెంచుతుంది. మనస్సునీ, శరీరాన్ని పాజిటివ్ ఎనర్జీతో నింపుతాయి. భక్తితో ఏకాగ్రత, వ్యాయామ సంకల్పం ఏర్పడతాయి. శరీరంలోని చక్రాలన్నీ యాక్టివ్ అవుతాయి. సూర్య రశ్మి లభిస్తుంది. ఎన్నో రకాల రుగ్మతలు దూరమవుతాయి. మనస్సుకు ఉత్సాహం కలుగుతుందని నిపుణులు చెబుతారు.

ముఖ్యంగా సంతాన సమస్యలతో ఇబ్బంది పడుతున్న దంపతులు పొర్లు దండాలు పెట్టడం వల్ల పిల్లలు పుడతారని పూర్వీకులు చెబుతారు. ఇందుకు కారణం పొర్లు దండాలు పెడుతున్నప్పుడు స్త్రీల గర్భాశయం నేలకు తాకుతుంది. చీర కట్టుకుని పొర్లు దండాలు చేస్తున్నప్పుడు చీరకున్న కుచ్చుళ్లి గర్భశయంపై ఒత్తిడి తెస్తాయి. ఈ ప్రక్రియ కారణంగా సంతానలేమి కారణమైన కణితులు, గడ్డలు, వాపులు వంటి గర్భాశయ సమస్యలు తగ్గుతాయి. ఫలితంగా సంతాన సమస్యలు తీరతాయని నమ్ముతారు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Whats_app_banner