Karthika masam: కార్తీక మాసంలో గృహ ప్రవేశం, వివాహాలు ఎక్కువగా ఎందుకు చేసుకుంటారు?
Karthika masam: గృహ ప్రవేశాలు, వివాహాలు చేసుకునేందుకు కార్తీక మాసం చాలా అనువైనది. ఈ మాసంలో వివాహం చేసుకుంటే వారి దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో నిండిపోతుందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
జ్యోతిష్య శాస్త్ర ప్రకారం గృహప్రవేశానికి ఉత్తమ మాసములు వైశాఖ, జ్యేష్ఠ, కార్తీక, మాఘ, ఫాల్గుణ మాసములు అని ప్రముఖ ఆధ్యాత్మికవేత పంచాంగ కర్త బ్రహ్మ శ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ గారు తెలియజేశారు.
కార్తీక మాసం అత్యంత పవిత్రమైన మాసంగా పరగణిస్తారు. శివుడు, విష్ణువు వంటి దేవతలను ఈ మాసంలో పూజించడం అత్యంత శుభప్రదం. అందువల్ల గృహ ప్రవేశాలు, వివాహాలు వంటి శుభకార్యాలను ఈ మాసంలో నిర్వహించడం చాలా సాంప్రదాయంగా ఉంటుంది. ఈ సమయంలో సంప్రదాయపరంగా భగవంతుడి అనుగ్రహం, క్షేమం, సౌభాగ్యం సులభంగా లభిస్తాయని భక్తులు నమ్ముతారు.
గృహ ప్రవేశం అనేది ఒక ముఖ్యమైన శుభకార్యం. జ్యోతిష్య నిబంధనలు, నియమాలను అనుసరించడం ద్వారా ఈ శుభకార్యాన్ని సరైన మార్గంలో నిర్వహించడం ద్వారా శ్రేయస్సు, సంపద, క్షేమం పొందవచ్చు. ఈ విధంగా గృహ ప్రవేశం చేసేటప్పుడు జ్యోతిష్యశాస్త్రంలోని నియమాలను పాటించడం ద్వారా మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంది. కొత్త గృహంలో అడుగుపెట్టే సమయం దేవతలకు నివేదించడం, వారి అనుగ్రహం పొందడం ముఖ్యమని భక్తులు విశ్వసిస్తారు.
కార్తీక మాసంలో గృహ ప్రవేశం చేయడం వలన భవిష్యత్తులో శ్రేయస్సు, సంతోషం, సంపద, ఆరోగ్యం ఉంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి. కార్తీక మాసం అనేది గృహ ప్రవేశానికి అత్యంత శుభమైన మాసం. ఈ మాసంలో చేసే శుభకార్యాలు, దానం, పూజలు దేవతలను ఆనందించిస్తాయని చిలకమర్తి తెలిపారు.
గృహ ప్రవేశ పూజా విధానం
గృహ ప్రవేశం ముందు, ఇంటిని శుద్ధి చేయడం, గోమయం లేదా గంగాజలం చల్లడం ముఖ్యమని భావిస్తారు. శ్రీ సూక్తం, వాస్తు శాంతి, శివ పూజ వంటి పూజలను నిర్వహించడం ద్వారా కొత్త ఇంటికి శుభం కలుగుతుందని విశ్వాసం.
దీపం వెలిగించి శ్రద్ధతో ఇంట్లోకి అడుగు పెట్టడం వలన సకల సౌభాగ్యాలు కలుగుతాయని మన పురాణాలు చెబుతున్నాయి.
పౌరాణిక విశ్వాసం: పురాణాల ప్రకారం కార్తీక మాసంలో గృహ ప్రవేశం చేస్తే ఇంటికి అనేక శ్రేయస్సులు, సంతోషాలు, సుఖశాంతులు వస్తాయి. ఇది వాస్తు దేవతను సంతోషపరుస్తూ ఇంటిని క్షేమముగా ఉంచేలా చేస్తుంది.
కార్తీక మాసంలో వివాహాల ప్రాముఖ్యత
వివాహం అనేది మన భారతీయ సంప్రదాయంలో ఒక పవిత్ర కర్మ. కార్తీక మాసంలో వివాహం చేయడం విశేషమైన పుణ్యం అని భక్తులు విశ్వసిస్తారు. ఎందుకంటే కార్తీక మాసం హిందూ ధార్మిక ఆచారాలలో ఒక పవిత్రమైన కాలం. శివుడు, పార్వతిల కలయికకు ఈ మాసం ప్రతీకగా భావిస్తారని చిలకమర్తి తెలిపారు.
వివాహ వేళా శుభత
కార్తీక మాసంలో వివాహం చేస్తే దాంపత్య జీవితం సుఖముగా, సంతోషముగా ఉంటుంది అని విశ్వాసం. పాప విముక్తి, సంతాన సాఫల్యం కలిగేలా వివాహం అనంతరం కార్తీక పూజలు చేయడం, శివ పూజ నిర్వహించడం ద్వారా దాంపత్య జీవితం సాఫల్యం పొందుతుందని భావన.
వివాహ పూజా విధానం
వివాహం చేసే ముందు కార్తీక పౌర్ణిమ నాడు స్నానాలు చేసి శివుడికి, విష్ణువుకు ప్రత్యేక పూజలు చేయడం దాంపత్య జీవితంలో సౌభాగ్యాన్ని పెంపొందిస్తుంది. నూతన దంపతులు ఈ మాసంలో దీపారాధన చేయడం, కార్తీక దీపాలు వెలిగించడం ద్వారా సన్మార్గంలో ఉండేందుకు దేవతా కృప లభిస్తుంది అని ప్రముఖ ఆధ్యాత్మికవేత పంచాంగ కర్త బ్రహ్మ శ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ గారు తెలియజేశారు.
దాంపత్య సౌఖ్యం: కార్తీక మాసంలో వివాహం చేసుకునే వారు ఆధ్యాత్మికతను పెంపొందించుకుంటూ శివుడు, పార్వతుల ఆశీర్వాదంతో సుఖశాంతులతో కూడిన దాంపత్యం పొందుతారని విశ్వాసం.
ఇంటికి శ్రేయస్సు: గృహ ప్రవేశం చేస్తే ఇంటికి శ్రేయస్సు, సంతోషం, సౌభాగ్యం, ఆర్థిక స్థిరత్వం వస్తాయని మన సంప్రదాయ పండితులు చెబుతారు. ఇది ఇంట్లో ప్రతి ఒక్కరికీ శాంతిని, సుఖాన్నిని అందిస్తుంది అని ప్రముఖ ఆధ్యాత్మికవేత పంచాంగ కర్త బ్రహ్మ శ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ గారు తెలియజేశారు.