Lakshmi puja: దీపావళి రోజు లక్ష్మీపూజ రాత్రి వేళ ఎందుకు చేస్తారు? దీని వెనుక ఉన్న కారణాలు ఏంటి?-why diwali lakshmi puja conducted in evening time what is the reason behind this ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Lakshmi Puja: దీపావళి రోజు లక్ష్మీపూజ రాత్రి వేళ ఎందుకు చేస్తారు? దీని వెనుక ఉన్న కారణాలు ఏంటి?

Lakshmi puja: దీపావళి రోజు లక్ష్మీపూజ రాత్రి వేళ ఎందుకు చేస్తారు? దీని వెనుక ఉన్న కారణాలు ఏంటి?

Gunti Soundarya HT Telugu

Lakshmi puja: దీపావళి రోజు తప్పనిసరిగా లక్ష్మీ పూజ చేస్తారు. అయితే ఈ పూజ సాయంత్రం వేళ నిర్వహిస్తారు. లక్ష్మీదేవి పూజను సాయంత్రమే ఎందుకు చేస్తారు? అనే సందేహం చాలా మందికి వస్తుంది. దీని వెనుక ఉన్న కారణాలు, సాయంత్రం పూజ ఎందుకు విశేషమైనదో ఇక్కడ తెలుసుకోండి.

దీపావళి రోజు లక్ష్మీపూజ సాయంత్రమే ఎందుకు చేస్తారు?

అందరూ ఒక్క చోటకు చేరి ఆనందంగా జరుపుకునే అతిపెద్ద ముఖ్యమైన పండుగ దీపావళి. ఏడాది మొత్తం ప్రతి ఒక్కరూ దీని కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కుటుంబమంతా కలిసి పూజ జరుపుకుని ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుంటూ బాణాసంచా కాలుస్తారు.

దీపావళి రోజు లక్ష్మీపూజకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. సాధారణమైన రోజుల్లో అయితే లక్ష్మీ పూజ ఉదయం వేళ చేస్తారు. కానీ దీపావళి రోజు మాత్రం సాయంత్రం పూజ చేస్తారు. అది కూడా సూర్యాస్తమయం తర్వాతే చేస్తారు. ఇలా ఎందుకు చేస్తారు అనే దాని వెనుక అనేక కారణాలు ఉన్నాయి. అవి ఏంటో తెలుసుకుందాం.

లక్ష్మీదేవికి ఇష్టమైన సమయం

దీపావళి రోజు రాత్రిపూట లక్ష్మీదేవిని పూజించడం శుభ్రంగా భావిస్తారు. అంటే శాస్త్రాల ప్రకారం ప్రదోషకాలంలో మాత్రమే ఈ పూజ చేస్తారు. ఎందుకంటే లక్ష్మీదేవికి సాయంత్రం వేళ ఇష్టమైన సమయం అని నమ్ముతారు. అందుకే సాయంత్రం పూట ఇంట్లో లైట్లు వేయగానే కాసేపు ఇంటి గేటు, ప్రధాన ద్వారం తెరిచి ఉంచాలని అంటారు. ఈ సమయంలో లక్ష్మీదేవి ఇంటికి వస్తుందని విశ్వసిస్తారు. సాయంత్రం వేళ గుమ్మంలో దీపాలు వెలిగించడం వల్ల లక్ష్మీదేవి ఆనందంగా ఆ ఇంట్లోకి ప్రవేశిస్తుందని అంటారు. జ్యోతి లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు. రాత్రిపూట దీపాలు వెలిగించడం వల్ల మన జీవితం నుంచి అజ్ఞానం చీకటి తొలగిపోతుందని నమ్ముతారు.

పురాణాల ప్రకారం క్షీరసాగరం మథనం జరిగింది రాత్రివేళ అనే అంటారు. లక్ష్మీదేవి సముద్రం మథనం సమయంలోనే ఉద్భవించింది. అందుకే సాయంత్రం వెళ్లే లక్ష్మీదేవిని ఆరాధించడం పవిత్రంగా భావిస్తారు. పరిశుభ్రంగా దీపాలతో ప్రకాశవంతంగా కనిపించే ఇంట్లోకి ప్రవేశించేందుకు లక్ష్మీదేవి ఎప్పుడూ ఆసక్తి చూపిస్తుందని ప్రతిదీ అందుకే సాయంత్రం వేళ ఇంట్లోని ఏ మూలలో కూడా చీకటి ఉండకూడదని చెబుతారు. అలా ఉన్న ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించదని అంటారు.

జ్యోతిష శాస్త్రం ప్రకారం దీపావళి రోజున లక్ష్మీపూజకు మంచి సమయం ప్రదోషకాలం. ఇది సూర్యాస్తమయం తర్వాత మూడు గంటల వరకు ఉంటుంది. ఈ సమయం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ప్రదోష కాలంలో పూజ చేస్తే లక్ష్మీదేవి త్వరగా ప్రసన్నరాలవుతుందని నమ్ముతారు. సాయంత్రం వేళ దీపాలు వెలిగించి మంత్రాలు పఠించి లక్ష్మీదేవికి పూజ చేయడం వల్ల ఇంట్లో ఆనందం, శ్రేయస్సు ఉంటాయి. అలాగే చీకటి పడిన వేళ దీపాలు వెలిగించడం వల్ల ఇల్లు కళకళాడుతుంది. అలా ఉన్న ఇల్లు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. లక్ష్మీదేవికి స్వాగతం పలుకుతూ దీపాలతో అలంకరిస్తారు. ఇలా చేయడం వల్ల ప్రతికూల శక్తి తొలగిపోయి సానుకూలత ఉంటుందని అంటారు.

దీపావళి రోజు లక్ష్మీదేవితో పాటు వినాయకుడు, కుబేరుడిని కూడా పూజిస్తారు. అమ్మవారికి ఇష్టమైన దీపాలు, పండ్లు సమర్పిస్తారు. లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ ఇంటి ప్రధాన ద్వారం దగ్గర దీపం వెలిగిస్తారు. ఇలా చేయడం వల్ల సంపద పెరుగుతుంది. కుటుంబంలో శ్రేయస్సు, సంతోషం నిండిపోతాయి. అమావాస్య రోజు దీపావళి వస్తుంది. చీకటిని తరిమికొడుతూ దీపాలు వెలిగించి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ దీపావళి జరుపుకుంటారు. ఈరోజు లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల ఏడాది పొడవునా ఇంట్లో సుఖసంతోషాలు నెలకొంటాయని నమ్ముతారు.

గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.