Vastu tips: బయట కూరగాయలు కొనుక్కుని అనారోగ్య సమస్యలు తెచ్చుకోవడం ఎందుకని చాలా మంది తమ ఇళ్లలోనే గార్డెన్ లో అనేక కూరగాయలు, ఆకుకూరలు పండించుకుంటారు. ఈ మధ్య కాలంలో ఇంటి మీద గార్డెన్ ఏర్పాటు చేసుకుని సాగు చేసుకుంటారు. తమకి నచ్చిన మొక్కలు ఇంట్లో పెట్టుకుంటే పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుందని, గాలిని శుద్ది చేస్తుందని భావిస్తారు.
ఇంట్లో పచ్చని మొక్కలు ఉంటే అందంగా, ఆహ్లాదకరంగా ఉంటుందనే మాట వాస్తవమే. కొన్ని చెట్లు లేదా మొక్కలు ఇంట్లో ఉండటం వల్ల ఆనందం, శ్రేయస్సు కలుగుతుంది. వీటివల్ల సానుకూల శక్తి ప్రసరిస్తుంది. కానీ కొన్ని మొక్కలు మాత్రం ఇంటికి ఇబ్బందులు తీసుకొస్తాయి.
ఇంటి మీద ఏర్పాటు చేసుకునే గార్డెన్ లో చాలామంది బీరకాయ, కాకరకాయ వంటి తీగ మొక్కలు పెంచుకుంటూ ఉంటారు. అయితే అన్ని రకాల మొక్కలు వాస్తు శాస్త్రం ప్రకారం శుభఫలితాలు ఇవ్వవు.
వాస్తు ప్రకారం కొన్ని చెట్లు అశుభ ప్రభావాలను కలిగిస్తాయి. వాటిలో ఒకటి కాకరకాయ. సహజంగానే కాకరకాయ చేదు స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఫలితంగా ఈ మొక్క కూడా చేదు ప్రభావాలను ఇస్తుంది. ఈ మొక్క మీ ఇంటి మీద పెంచుకోవడం కంటే ఇంటి వెలుపల గార్డెన్లో ఉంచుకోవడం ఉత్తమం.
దురదృష్టాన్ని ఇచ్చే కొన్ని మొక్కలు ఆర్థిక ఇబ్బందులను మాత్రమే కాకుండా ఆరోగ్య సంబంధిత సమస్యలు కూడా కలిగిస్తాయి. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో కాకరకాయ ఉండటం వల్ల అది ఇంటి ఆర్థిక పరిస్థితి మీద తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అప్పుల బాధలు ఎక్కువవుతాయి. ఇంట్లో ప్రశాంతత దెబ్బతీస్తుంది. ఇంట్లో కాకరకాయ మొక్క ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఉండదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
వ్యాపారాల్లో నష్టం తలెత్తే అవకాశం ఉంటుంది. అప్పుల భారం నెత్తి మీద పడుతుంది. అలాగే ఈ మొక్క మీ ఇంట్లో ఉంటే మీ గౌరవానికి భంగం వాటిల్లుతుంది. పనిచేసే ప్రదేశంలో ఇతరుల వల్ల మీరు అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దీని నుంచి వెలువడే ప్రతికూల శక్తి మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. కాకరకాయ నుంచి వెలువడే శక్తి ప్రతికూలంగా ఉంటుంది. దీని నుంచి విడుదలైన గాలి పీల్చడం వల్ల అనారోగ్య సమస్యలు కలుగుతాయి. ఈ మొక్క ఉండటం వల్ల ఇంట్లో ఆనందం, శాంతి కొరవడతాయి.
గార్డెనింగ్ అంటే ఇష్టం ఉన్నవాళ్లు ఇంట్లో కూరగాయలు, ఆకుకూరలు పెంచుకోవాలనుకునే వాళ్ళు కాకరకాయని తప్పనిసరిగా కూర్చుంటారు. ఇది చాలా సులభంగా పెరిగే మొక్క. ఇంట్లో పెంచుకుంటే ప్రతికూల శక్తులు కలిగిస్తున్నప్పుడు మరి ఎక్కడ పెంచుకోవాలి అనే సందేహం కలుగుతుంది. అందుకే మీ ఇంటి బయట ఖాళీ స్థలం ఉంటే అక్కడ మీరు కాకర మొక్కను పెంచుకోవచ్చు. అది కూడా దక్షిణ దిశలో పొరపాటున కూడా పెట్టకూడదు. దీనివల్ల ప్రతికూల శక్తి ప్రభావం రెట్టింపు అవుతుంది. అందుకే కాకర మొక్క వేసే ముందు సరైన స్థలం ఎంచుకుని వేసుకోవాలి. లేదంటే అది మీ కుటుంబం మొత్తం మీద ప్రభావం చూపుతుంది.
టాపిక్