Lord rahu: రాహువు చెడు దృష్టి వల్ల ఇబ్బంది పడుతున్నారా? ఇది ధరిస్తే అంతా మంచే జరుగుతుంది
Lord rahu: నీడ గ్రహంగా పరిగణించే రాహువు చెడు ప్రభావాలు చాలా ఇబ్బందులు పెడతాయి. వాటి నుంచి తప్పించుకోవడం కోసం రాహువు రత్నంగా పరిగణించే గోమేధికం ధరించడం చాలా ఉత్తమమని పండితులు సూచిస్తున్నారు. ఈ రత్నం ఎవరు ధరించాలి? దీని వల్ల ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.
Lord rahu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవగ్రహాలకు అనుగుణంగా ఒక్కో రత్నం ఉంటుంది. నీడ గ్రహంగా పరిగణించే రాహువుకు సంబంధించిన రత్నం కూడా ఉంది. రత్నశాస్త్రంలో గోమేధికాన్ని రాహువు రత్నంగా పరిగణిస్తారు. జాతకంలో రాహువు స్థానం శుభప్రదంగా ఉంటే ఒక వ్యక్తి ప్రతి పనిలో మంచి ఫలితాలను పొందుతాడని నమ్ముతారు. అయితే రాహువు బలహీనత కారణంగా వ్యక్తి జీవితం సమస్యలతో చుట్టుముట్టడతాయి.
రాహువు దుష్ప్రభావాల వల్ల కోపం, మానసిక ఒత్తిడి, అబద్ధాలు చెప్పడం అలవాటు అవడం, చెడు పనులు వంటి అనేక సమస్యలను కలిగిస్తుంది. అటువంటి పరిస్థితిలో రాహువు అశుభ ప్రభావాలను తగ్గించడానికి గోమేధిక రత్నాన్ని ధరించడం ప్రయోజనకరంగా పరిగణిస్తారు. అయితే ఏదైనా రత్నాన్ని ధరించే ముందు జ్యోతిషశాస్త్ర సలహా తీసుకోవాలి. నిపుణులు చెప్పే దాని ప్రకారం ఫిబ్రవరి 15 నుండి మార్చి 14 మధ్య జన్మించిన వారు సూర్యుడు కుంభ రాశిలో ఉన్నప్పుడు రాహువు రత్నాన్ని ధరించవచ్చు. గోమేధికాన్ని ఒనిక్స్ అని కూడ పిలుస్తారు. ఒనిక్స్ ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలు, ఎలా ధరించాలి అనే విషయాల గురించి తెలుసుకుందాం.
గోమేధికం ధరించేందుకు నియమాలు
రత్న జ్యోతిష్యం ప్రకారం గోమేధికం బరువు 6,11 లేదా 13 క్యారెట్లు ఉండాలి. అదే సమయంలో 7, 10 లేదా 16 రట్టిల ఒనిక్స్ ధరించడం మానుకోవాలి. ఈ రత్నాన్ని వెండి లేదా అష్టధాతువుతో చేసిన ఉంగరంలో ధరించవచ్చు.
శనివారం సూర్యాస్తమయం తర్వాత గోమేధిక రత్నాన్ని మధ్య వేలుకు ధరించాలి. రత్న జ్యోతిష్యం ప్రకారం గోమేధికమును రూబీ, పగడం, ముత్యాలతో ధరించకూడదు. మిథునం, తుల, మకరం, కుంభం, వృషభ రాశి వాళ్ళు గోమేధికాన్ని ధరించవచ్చు. అలాగే జాతకంలో రాహువు ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు ఈ రత్నం ధరిస్తే ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి. ఆర్థికంగా బలపడతారు. రాహువు శుభ ప్రభావంతో అన్నింటా విజయం లభిస్తుంది.
గోమేధికం ధరించడం వల్ల ప్రయోజనాలు
రత్న జ్యోతిష్యం ప్రకారం గోమేధికం ధరించడం న్యాయపరమైన విషయాలలో శాంతిని కలిగిస్తుంది. మానసిక ఒత్తిడిని తగ్గించడంలో లేదా తొలగించడంలో ఈ రత్నం ప్రయోజనకరంగా సహాయపడుతుంది. అనేక వ్యాధులు, లోపాల నుండి ఉపశమనం పొందడానికి కూడా ఈ రత్నం మంచిదని భావిస్తారు.
రాహు గ్రహం చెడు స్థితితో సహా రాహు కోపం నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి మీరు గోమేధికాన్ని ధరించవచ్చు. రాహు చెడు ప్రభావం బాధపడుతున్న వాళ్ళు దీన్ని తప్పనిసరిగా ధరించాలని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఉంగరం శనివారం రోజు ధరించడం ఉత్తమం. అలాగే దీన్ని పెట్టుకునే ముందు గంగా జలం, పాలతో శుద్ది చేసి పూజ చేసిన తర్వాత ధరించడం వల్ల మెరుగైన ప్రయోజనాలు పొందుతారు.
నిరాకరణ: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనది అని మేము క్లెయిమ్ చేయము. వీటిని అవలంబించే ముందు, ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి.