Pearl wearing rules: ముత్యాలు ఎవరు ధరించాలి? ఎలాంటివి ధరించాలి? ఎలాంటివి ధరించకూడదు?
Pearl wearing rules: రత్న జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పండితుల సలహా తీసుకున్న తర్వాత వజ్రం, ముత్యం, నీలమణి, పచ్చలతో సహా అనేక రత్నాలను ధరించడం చాలా శుభప్రదంగా భావిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, నిర్దిష్ట తేదీలలో జన్మించిన వారికి ముత్యం అదృష్ట రత్నంగా నిరూపించబడుతుంది.
Pearl wearing rules: జ్యోతిషశాస్త్రంలో ముత్యాన్ని చంద్రునికి ఇష్టమైన రత్నంగా పరిగణిస్తారు. జాతకంలో చంద్రుని స్థానం బలహీనంగా ఉన్నప్పుడు ముత్యాల రత్నాన్ని ఉపయోగించడం ప్రయోజనకరంగా ఉంటుందని నమ్ముతారు. సోమవారం నాడు ఈ రత్నాన్ని ధరించడం శుభప్రదం. అయితే, ఏదైనా రత్నాన్ని ధరించే ముందు జ్యోతిష్య సలహా తీసుకోవాలి.
చంద్ర దోషం ఉన్న వాళ్ళు ధరించడం వల్ల దాని నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే చంద్రుడి స్థానం బలహీనంగా ఉంటే దాని ప్రభావం మనసు మీద పడుతుంది. ఎందుకంటే చంద్రుడు చల్లని మనసు, భావోద్వేగాలకు కారకుడిగా చెప్తారు. అందువల్ల మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలని అనుకునే వాళ్ళు ముత్యం ధరించవచ్చు. పండితుల సూచనల మేరకు డిసెంబర్ 21 నుండి 27 జనవరి, 21 ఏప్రిల్ నుండి 27 మే వరకు జన్మించిన వారికి ముత్యం ధరించడం చాలా అదృష్ట రత్నం. ముత్యాలు ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం.
ముత్యాలు ధరించడం వల్ల ప్రయోజనాలు
ముత్యం ధరించడం వల్ల సంతోషం, అదృష్టం పెరుగుతాయని నమ్ముతారు.
మానసిక ప్రశాంతతకు ముత్యాల రత్నం కూడా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది.
రత్న జ్యోతిష్యం ప్రకారం ఈ మహారత్నం అనేక రోగాల నుండి బయటపడటానికి చాలా శుభప్రదమైనది.
ముత్యాన్ని దగ్గర ఉంచుకుంటే ఆయురారోగ్యాలు లభిస్తాయనే నమ్మకం కూడా ఉంది.
రత్న జ్యోతిష్యం ప్రకారం ముత్యం ధరించడం వల్ల మనిషికి కోపం తగ్గుతుంది.
ఎవరు ధరించవచ్చు?
రత్న జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కర్కాటకం, ధనుస్సు, మీన రాశుల వాళ్ళు ముత్యాన్ని ధరించడం మంచిది. వీరితో పాటు జాతకంలో చంద్రుడి స్థానం సరిగా లేని వాళ్ళు పెట్టుకోవచ్చు. వెండితో చేసిన ఉంగరంతో కలిపి ముత్యాన్ని ధరించడం వల్ల మేలు జరుగుతుంది. ఈ ఉంగరాన్ని కూడా చూపుడు వేలికి ధరించాలి.
రత్నం స్వచ్చమైనదని చాలా మంది నమ్ముతారు. ఇది ధరించడం వల్ల శ్రేయస్సు, సంతోషం లభిస్తాయి. ముత్యం ఉన్న ఉంగరం ధరించడం వల్ల ఎలాంటి చెడు ప్రభావం కూడా ఉండదని చాలా మంది నమ్ముతారు. ఇవి విలాసవంతమైన జీవితాన్ని సూచిస్తాయి. ముత్యాల ధరించడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని కొందరు చెబుతారు. మానసిక ప్రశాంతత, లభిస్తుంది. ఒత్తిడి నుంచి దూరం చేస్తుందని అంటారు.
ముత్యాల రత్నం యొక్క లోపాలు
విరిగిన, సన్నని గీత, ముత్యం చుట్టూ గుంతలు, ఎరుపు లేదా నల్లటి మొటిమ ఆకారంలో ఉన్న ముత్యం, పొడి లేదా సన్నగా ఉండటం, చిన్న గుంట వంటి ముత్యం, మూడు మూలల ముత్యం, రాగి వంటి ఎర్రటి ముత్యం, చదునైనది, పగడపు వంటిది ఎరుపు రంగు ముత్యం, కాకి రెక్క లేదా పాదం వంటి మరకతో కూడిన ముత్యాన్ని ధరించడం మంచిది కాదు. ఇవి ముత్యపు లోపాలుగా పరిగణిస్తారు. అటువంటి ముత్యాన్ని ధరించడం ద్వారా ఒక వ్యక్తి జీవితంలో మానసిక క్షోభతో సహా అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుందని నమ్ముతారు.
నిరాకరణ: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనది అని మేము క్లెయిమ్ చేయము. వీటిని అవలంబించే ముందు, ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి.
టాపిక్