Ekamukhi Rudraksha: ఏకముఖి రుద్రాక్ష ఎవరు ధరించాలి, కలిగే లాభాలేంటి? వేసుకునేటప్పుడు పాటించాల్సిన నియమాలు తెలుసుకోండి..-who should wear ekamukhi rudraksha check benefits of wearing it and also see which rules to follow before wearing ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Ekamukhi Rudraksha: ఏకముఖి రుద్రాక్ష ఎవరు ధరించాలి, కలిగే లాభాలేంటి? వేసుకునేటప్పుడు పాటించాల్సిన నియమాలు తెలుసుకోండి..

Ekamukhi Rudraksha: ఏకముఖి రుద్రాక్ష ఎవరు ధరించాలి, కలిగే లాభాలేంటి? వేసుకునేటప్పుడు పాటించాల్సిన నియమాలు తెలుసుకోండి..

Peddinti Sravya HT Telugu
Jan 21, 2025 04:30 PM IST

Ekamukhi Rudraksha: జపం చేసినప్పుడు రుద్రాక్ష మాలని చాలామంది ఉపయోగిస్తూ ఉంటారు. ఇలా రుద్రాక్షకి హిందూమతంలో ఎంతో గొప్ప ప్రాముఖ్యత ఉంది. సనాతన ధర్మంలో రుద్రాక్ష పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. రుద్రాక్ష ఎవరు వేసుకోవాలి? కలిగే లాభాలు, వేసుకునేటప్పుడు పాటించాల్సిన నియమాలు గురించి తెలుసుకోండి.

Ekamukhi Rudraksha: ఏకముఖి రుద్రాక్ష ఎవరు ధరించాలి, కలిగే లాభాలేంటి?
Ekamukhi Rudraksha: ఏకముఖి రుద్రాక్ష ఎవరు ధరించాలి, కలిగే లాభాలేంటి? (pinterest)

రుద్రాక్షని ఎంతో పవిత్రంగా భావిస్తారు. పూజ సమయంలో రుద్రాక్ష మాలను వాడుతూ ఉంటారు. జపం చేసినప్పుడు రుద్రాక్ష మాలని చాలామంది ఉపయోగిస్తూ ఉంటారు. ఇలా రుద్రాక్షకి హిందూమతంలో ఎంతో గొప్ప ప్రాముఖ్యత ఉంది. సనాతన ధర్మంలో రుద్రాక్ష పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. రుద్రాక్షతో తయారు చేయబడిన మాలలని మతపరమైన ఆభరణంగా పరిగణిస్తారు.

సంబంధిత ఫోటోలు

దీనిని ధరించడం వలన అనేక అతీంద్రియ శక్తులు కలుగుతాయని నమ్ముతారు. రుద్రాక్ష శివుడికి సంబంధించిన దానిగా భావిస్తారు. సతీదేవి అగ్నిలోకి దూకి ప్రాణాలని వదిలినప్పుడు, శివుడు ఆమె సగం కాలిన శరీరం చూసి ఎంతో ఏడ్చాడు. అతని కళ్ళలోంచి వచ్చిన కన్నీళ్లు రుద్రాక్షగా మారిందట. అందుకని రుద్రాక్షను ఎంతో పవిత్రంగా భావించడం జరుగుతుంది. రుద్రాక్ష సానుకూల శక్తిని కూడా ప్రవహిస్తుంది.

ఏకముఖి రుద్రాక్ష మాల వలన కలిగే లాభాలు ఏంటి?

  1. రుద్రాక్ష హిమాలయాల్లో అరుదైన చెట్లపై పెరిగే విత్తనాలు. వీటి నుంచి దండలని తయారుచేస్తారు. 14 రకాలు ఇందులో ఉన్నాయి. వాటికి చాలా ముఖాలు ఉంటాయి. వీటిలో ఏకముఖి రుద్రాక్ష అత్యంత అరుదైనది. అలాగే శక్తివంతమైనది.
  2. పండితులు ప్రకారం, ఏకముఖి రుద్రాక్ష మాల ధరించడం వలన మనస్సుకి అపరిమితమైన శక్తి లభిస్తుంది. జీవితంలో సానుకూల శక్తి ప్రవహిస్తుంది.
  3. చెడు అలవాట్ల నుంచి బయటపడటానికి సహాయపడుతుంది.
  4. ఏకముఖి రుద్రాక్ష ఆధ్యాత్మిక పురోగతికి, స్వీయ జ్ఞానానికి, ధ్యానానికి ప్రభావితమైనదిగా పరిగణించబడుతుంది.
  5. దీనిని ధరించడం వలన మరణ భయం తొలగిపోవడమే కాకుండా మానసిక ఆందోళన నుంచి కూడా బయటపడడానికి అవుతుంది.

ఏకముఖి రుద్రాక్షను ఎవరు ధరించవచ్చు?

  1. సనాతన ధర్మం ప్రకారం ఏకముఖి రుద్రాక్ష ధరించే ముందు పండితులు సలహా తీసుకోవడం మంచిది.
  2. శని దోషం, చంద్రదోషం ఉన్నవాళ్లు ధరిస్తే మంచిది.
  3. జాతక దోషాలు ఏమైనా ఉంటే ఏకముఖి రుద్రాక్ష తొలగిస్తుంది.
  4. ఏకముఖి రుద్రాక్షను ధరించేటప్పుడు నల్లటి దారంతో కలిపి వేసుకోవడం మంచిది కాదు.
  5. ఎప్పుడైనా వేసుకునేటప్పుడు ఎర్రటి దారంతో ఉన్న రుద్రాక్ష వేసుకోండి.
  6. రుద్రాక్ష మూలమంత్రాన్ని 9సార్లు జపించి ఆ తర్వాత ధరించడం మంచిది.

ఏకముఖి రుద్రాక్షను వేసుకునేటప్పుడు పాటించాల్సిన నియమాలు

  1. సోమవారం, అమావాస్య, పౌర్ణమి లేదా శివరాత్రి రోజు ఏకముఖి రుద్రాక్షని ధరించడం మంచిది.
  2. ఎప్పుడైనా రుద్రాక్ష మాలను వేసుకునే ముందు గంగాజలం లేదా పచ్చిపాలతో కడిగి ఆ తర్వాత ధరించడం మంచిది. అలా వేసుకోవడం వలన రుద్రాక్ష వేసుకున్న ప్రయోజనం కలుగుతుంది.
  3. బంగారం, వెండి గొలుసుతో పాటు రుద్రాక్షను వేసుకోవచ్చు.
  4. రుద్రాక్ష మాలను వేసుకునేటప్పుడు ‘ఓం నమ:శ్శివాయ’ అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం మంచిది.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Whats_app_banner

సంబంధిత కథనం