కార్తీక పౌర్ణమి రోజు ఉపవాసం ఎవరు చేయాలి? ఎలా చేయాలి?-who should fast on kartika pournami know in detail ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  Who Should Fast On Kartika Pournami Know In Detail

కార్తీక పౌర్ణమి రోజు ఉపవాసం ఎవరు చేయాలి? ఎలా చేయాలి?

HT Telugu Desk HT Telugu
Nov 26, 2023 07:02 AM IST

కార్తీక పౌర్ణమి రోజు ఎవరు ఉపవాసం చేయాలి? ఎలా చేయాలి? ఇక్కడ తెలుసుకోండి.

కార్తీక పౌర్ణమి రోజు ఉపవాసం ఎవరు చేయాలి?
కార్తీక పౌర్ణమి రోజు ఉపవాసం ఎవరు చేయాలి? (Pixabay)

పవిత్రమైన మాసాలలో కార్తీక మాసం ఒకటి. ఇక కార్తీకమాసంలో పవిత్రమై రోజు కార్తీక పౌర్ణమి. ఈ రోజు కోసం ఏడాదంతా ఎదురు చూసే వాళ్లు ఎంతోమంది. కార్తీక పౌర్ణమి రోజు పెద్ద ఎత్తున పూజలు చేసే వాళ్లు ఎంతో మంది. ఈ పున్నమి రోజు తెల్లవారుజామునకు ముందే లేచి తలస్నానం చేయాలి. తులసి మొక్క దగ్గర దీపం పెట్టి పూజా కార్యక్రమాలు మొదలుపెట్టాలి.

ట్రెండింగ్ వార్తలు

ఆ రోజు ఉపవాసం లేదా నక్తం ఉండాలి. చిన్న పిల్లలు ముసలి వారు, అనారోగ్యంతో ఉన్నవారు, ఉద్యోగాల వల్ల వీలు కాని వారు ఉపవాసం చేయాల్సిన అవసరం లేదు. తల స్నానం చేసి, దీపారాధన చేస్తే చాలు.

ఇక కార్తీక పౌర్ణమి రోజు ఉపవాసం చేయాలనుకుంటున్నారో, నక్తం ఉండాలనుకుంటున్నారో నిర్ణయించుకోండి. ఉపవాసం అంటే వండినవి, ఉప్పు కారాలు, నూనెలు వేసినవి తినకూడదు. కేవలం పండ్లు వంటివి మాత్రమే తినాలి.

ఇక ఏకభుక్తం అంటే ఉదయం భోజనం చేసి ఒక రాత్రి వరకు ఏమీ తినకుండా ఉండాలి. నక్తం... అంటే పగలంతా ఏమీ తినకుండా ఉండి సాయంకాలం పూజ చేసుకున్నాక, నక్షత్ర దర్శనం చేసుకుని అప్పుడు భోజనం చేయడం.

కార్తీక పౌర్ణమి రోజు మీరేం చేయాలనుకుంటున్నారో నిర్ణయించుకోండి. తినే ఆహారంలో ఉల్లి, వెల్లుల్లి, దుంపలు, ముల్లంగి వంటివి లేకుండా చూసుకోవాలి.

కార్తీక పౌర్ణమి రోజు ఇంట్లో శుచిగా వండుతున్న ఆహారాలనే తినాలి. చలిమిడి, పెసరపప్పు, కొబ్బరి, పానకం వంటివి ప్రసాదాలుగా నివేదించి వాటిని ఆ రోజు తింటూ ఉండాలి. ఆరోజున మంచమ్మీద నిద్రపోకూడదు. నేల మీదే పడుకోవాలి.

కార్తీక పౌర్ణమి రోజు ఉసిరి కాయ దానం, దీప దానం, అన్నదానం వంటివి చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది. తేనె, నెయ్యి, పెరుగు, చెరుకు, ఆవులు, వెండి, దుస్తులు, భూమి, ఆవు పాలు వంటివి దానం చేసినా ఎంతో పుణ్యం చేస్తుంది.

కార్తీక పౌర్ణమి రోజు వీలైనంత వరకు దేవుని సన్నిధానంలో ఉండేందుకు ప్రయత్నించండి. ఇంట్లో మీ పూజా గది ముందే నిద్రపోవడం, ఎక్కువ కాలం అక్కడే గడపడం చేయాలి. కార్తీక పౌర్ణమి రోజు శివాలయం, విష్ణు ఆలయం, గణపతి, లక్ష్మీదేవి ఆలయాలను సందర్శించుకోవాలి. ఆ ఆలయాల్లో ఉసిరి దీపాలను వెలిగించడం, 365 వత్తులతో దీపం పెట్టడం చేయాలి.

అలాగే కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం నీటిలో కార్తీక దీపాలను వదిలాలి. అరటి డొప్పల్లో కార్తిక దీపాలను వదిలితే మంచిది. నదులు, సరస్సులు అందుబాటులో లేకపోతే మీ ఇంట్లో తులసి మొక్క ముందు బకెట్ నీటిని పెట్టి అందులో దీపాలను వదిలేందుకు ప్రయత్నించండి.

WhatsApp channel

2024 సంవత్సర రాశి ఫలాలు

నూతన సంవత్సర రాశి ఫలాలు, పండగలు, శుభాకాంక్షలు ఇంకా మరెన్నో ఇక్కడ చదవండి.