Puja vessels: పూజకు ఎటువంటి లోహ పాత్రలు ఉపయోగించాలి? ఎటువంటి పాత్రలు శుభం చేకూరుస్తాయి-which type of vessels to use puja why we dont use iron steel puja vessels ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Puja Vessels: పూజకు ఎటువంటి లోహ పాత్రలు ఉపయోగించాలి? ఎటువంటి పాత్రలు శుభం చేకూరుస్తాయి

Puja vessels: పూజకు ఎటువంటి లోహ పాత్రలు ఉపయోగించాలి? ఎటువంటి పాత్రలు శుభం చేకూరుస్తాయి

Gunti Soundarya HT Telugu
Feb 08, 2024 12:07 PM IST

Puja vessels: పూజ గదిలో ఎటువంటి వస్తువులు పెట్టుకోవాలి, పూజకి ఎలాంటి పాత్రలు వినియోగించాలనేది తప్పకుండా తెలుసుకోవాలి. అప్పుడే మనం చేసే పూజకి శుభ ఫలితం దక్కుతుంది.

పూజకి ఏ పాత్రలు ఉపయోగించాలి?
పూజకి ఏ పాత్రలు ఉపయోగించాలి? (pixabay)

Puja vessels: ప్రతి ఒక్కరూ రోజూ తప్పనిసరిగా పూజ చేసుకుంటారు. కొన్ని రోజులు మినహా రోజు దేవుడి ముందు దీపం వెలిగించి పూజ చేస్తారు. హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం పూజ చేసేందుకు కొన్ని నియమాలు ఉన్నాయి. వాటి ప్రకారం పూజి చేస్తే దేవతల అనుగ్రహం లభిస్తుంది.

దేవుళ్ళని పూజించేటప్పుడు చేసే చిన్న చిన్న పొరపాట్లు జీవితంలో సమస్యలు సృష్టిస్తాయి. పూజ సమయంలో దేవుడికి సమర్పించే పువ్వుల దగ్గర నుంచి చివరిగా ఇచ్చే హారతి వరకు ప్రతీ దానికి ఒక్కో ప్రాముఖ్యత, విశేషం ఉన్నాయి. అయితే పూజ గదిలో ఎటువంటి పాత్రలు వినియోగించాలో ఖచ్చితంగా తెలుసుకుని ఉండాలి. పూజకి ఉపయోగించే పాత్రల కొనుగోలు విషయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలి.

పూజకి ఏ పాత్రలు వినియోగించాలి?

కొంతమంది తమ స్తోమతకి తగినట్టుగా వెండి, బంగారం పాత్రలు ఉపయోగిస్తారు. ఇవి మాత్రమే కాదు ఇత్తడి, రాగి పాత్రలు ఉపయోగించడం శుభప్రదంగా పరిగణిస్తారు. వెండి చంద్రుడితో సంబంధం కలిగి ఉండటం వల్ల వాటిని పూజకి వినియోగించడం మంచిదిగా చెప్తారు. అలాగే పూజకి రాగి పాత్రలు ఉపయోగించడం అత్యంత పవిత్రమైనవి.

ఎక్కువ మంది తమ ఇళ్ళలో రాగి పాత్రలను మత, ధార్మిక కార్యక్రమాలకు కూడా వినియోగిస్తారు. ప్రస్తుత కాలంలో వెండి కోటింగ్ ఉన్న పాత్రలు ఎక్కువగా ప్రజాదరణ పొందుతున్నాయి. వాటి మన్నిక ఎక్కువ రోజులు ఉంటుంది అలాగే పూజ గదికి అందం తీసుకొస్తుంది. చూసేందుకు ఈ పాత్రలు నిజంగా వెండి మాదిరిగానే అనిపిస్తాయి. వీటిని జర్మన్ సిల్వర్ అంటారు.

పూజకు ఎట్టి పరిస్థితిలోనూ ఇనుము, స్టీల్ పాత్రలు ఉపయోగించకూడదు. వాస్తు ప్రకారం పూజ పనుల్లో ఇనుము, అల్యూమినియం, ఉక్కు పాత్రలు ఉపయోగించడం శుభప్రదంగా పరిగణించరు. ధార్మిక కార్యక్రమాలకు బంగారం, వెండి, రాగి పాత్రలు ఉపయోగించడం మంచిదని పురాణాలు చెబుతున్నాయి.

ఉక్కు పాత్రలు ఎందుకు ఉపయోగించకూడదు?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పూజ సమయంలో వస్తువుల స్వచ్చత పరిశుభ్రత మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ఉక్కు, అల్యూమినియం, ఇనుము వంటివి స్వచ్చమైన లోహాలుగా పరిగణించరు. అందుకే పూజా సమయంలో ఈ లోహాలతో తయారు చేసిన పాత్రలు ఉపయోగించడం నిషిద్ధం. అలాగే సహజ సిద్ధమైన లోహాలు పూజకి ఉపయోగించాలి. ఉక్కు అనేది మానవ నిర్మిత లోహం. తడి తగలడం వల్ల తుప్పు పడుతుంది. విగ్రహాలు కూడా ఈ లోహాలతో అందుకే తయారు చేయరు.

ఆధ్యాత్మిక పరంగా కూడా స్టీలు పాత్రలు పూజకు వినియోగించకూడదు. స్టీలు, ఇనుము వంటివి శనికి సంబంధించినవి. వీటిని శని త్వరగా ఆకర్షిస్తుంది. పూజ గదిలో ఉండే పంచ పాత్రని ఎప్పుడూ ఖాళీగా ఉంచకూడదు. చాలా మంది పూజ చేసేందుకు పంచ పాత్ర ఉపయోగిస్తారు. ఈ పంచ పాత్రలో ఎప్పుడు శుభ్రమైన నీటిని పోసి అందులో తులసి ఆకులు వేసి ఉంచాలి.

అది ఖాళీగా ఉంటే జీవితంలో ఇబ్బందులు, ఆర్థిక కష్టాలు ఎదురవుతాయి. పూజకి సరైన పాత్రలు వినియోగించినప్పుడే ఎటువంటి దోషాలు లేకుండా సంపూర్ణ ఫలితాలు అందుకుంటారు. దేవుడి ఆశీస్సులు మీ మీద ఉంటాయి.

Whats_app_banner