వాస్తు ప్రకారం పాటించడం వలన సానుకూల శక్తి ప్రవహిస్తుంది. ప్రతికూల శక్తి తొలగిపోయి, సంతోషంగా ఉండడానికి వాస్తు ప్రకారం పాటించడం మంచిది. వాస్తు ప్రకారం అనుసరిస్తే సమస్యలన్నీ తొలగిపోయి, సంతోషంగా ఉండొచ్చు.
హిందూ మతంలో పావురాలకు విశేషమైన స్థానం ఉంది. పావురాలను సంపదకు చిహ్నంగా భావిస్తారు. శాంతి, ఆనందం, స్వచ్ఛతకు పావురాలు చిహ్నం. పావురాలు ఇంటికి వస్తే మంచి జరుగుతుందా లేదా అనే విషయాన్ని తెలుసుకోవడంతో పాటు, పావురం ఈకలను ఇంట్లో ఉంచితే ఏం జరుగుతుంది వంటి ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పావురం ఈకను ఇంట్లో పెట్టడం వలన అదృష్టం కలిసి వస్తుంది, సంపద పెరుగుతుంది, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. పావురం ఈక కనబడితే, దానిని ఇంటికి తెచ్చుకొని తెల్లని క్లాత్‌లో కట్టి ఇంట్లో పెట్టుకోవాలి. దీని వలన ఆనందం పెరుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుందని నమ్ముతారు.
చాలా మంది పావురం ఈకలను ఇంట్లో ఉంచుతారు. అలా చేస్తే లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్మకం ఉంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆదాయం కూడా పెరుగుతుంది, పురోగతి సాధిస్తారు.
పావురం ఈకను ఇంట్లో పెట్టడం వలన సానుకూల శక్తి కలుగుతుంది. గొడవలు, విభేదాలు వంటి సమస్యలు తొలగిపోతాయి. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా మారుతుంది. సమస్యలు తీరిపోవచ్చు. అదృష్టం, ఆనందం నెలకొంటాయి.
పావురం ఈకను ఉంచడం వలన ఎల్లప్పుడూ ఇంట్లో నివసిస్తారు. ఇంట్లో ఏర్పడిన సమస్యలన్నీ తొలగిపోతాయి.
ఇంట్లో పావురం ఈకను పెట్టేటప్పుడు వాస్తు ప్రకారం ఈ చిట్కాలను పాటించాలి. వాస్తు ప్రకారం, పావురం ఈకను లివింగ్ రూమ్‌లో దక్షిణం వైపున పెట్టితే మంచిది. అదే మీరు వంటగదిలో పెట్టాలనుకుంటే, ఉత్తరం వైపున పెట్టండి. పడకగదిలో తూర్పు వైపున పెడితే మంచిది. ఇలా పావురం ఈకను పెట్టడం వలన పైన చెప్పిన లాభాలను పొందవచ్చు. సానుకూల శక్తిని పొందవచ్చు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.