చాలామంది వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం అనుసరించడం వలన సానుకూల శక్తి వ్యాపించి, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. వాస్తు ప్రకారం పాటించడం వలన సమస్యలు కూడా తీరిపోతాయి. వాస్తు శాస్త్రంలో ప్రతి గదికి, ప్రతి వస్తువుకీ ఏ దిశలో ఉంచాలి అనే విషయాన్ని స్పష్టంగా పేర్కొంటారు.
ప్రతి ఇల్లు, ప్రతి ఆఫీసులో ఇన్వర్టర్ ఉంటుంది. సరైన స్థలంలో ఇన్వర్టర్ ఉంచడం చాలా అవసరం. లేకపోతే, ప్రతికూల శక్తిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇది వ్యక్తి మనసుపై చెడు ప్రభావాన్ని చూపిస్తుంది.
తద్వారా జీవితంలో ఇబ్బందులు వస్తాయి. అదే వాస్తు ప్రకారం పాటిస్తే, శాంతి, శ్రేయస్సు, విజయం వంటివి లభిస్తాయి. ఏకాగ్రత కూడా పెరుగుతుంది. ప్రశాంతమైన మనసుతో అవగాహన పెరిగి, సరైన నిర్ణయాలు తీసుకోవచ్చు.
ఇన్వర్టర్‌ను సరైన దిశలో ఉంచాలి. ఇన్వర్టర్ బరువుగా ఉంటుంది. దానికి బ్యాటరీ కూడా ఉంటుంది. కనుక ఇన్వర్టర్‌ను ఈశాన్యం వైపు ఉంచితే చాలా నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. వాస్తు ప్రకారం, ఇంటి ఈశాన్య దిశను పరిశుభ్రమైన, తేలిక శక్తి దిశగా పరిగణిస్తారు.
దీనిని దేవతల దిశ అని కూడా అంటారు. ఈ దిశ వ్యక్తి మనస్సు, ఆలోచనలు, ఊహా శక్తికి సంబంధించినది. అందుకే ఇంట్లో పూజ గది ఈశాన్యం వైపు ఉంటుంది. బరువైన సామాన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఇన్వర్టర్ వంటి వాటిని ఈశాన్యం వైపు ఉంచడం వలన ప్రతికూల శక్తిని ఎదుర్కోవాల్సి వస్తుంది. కొన్నిసార్లు సమస్యలు ఏర్పడతాయి.
ఇన్వర్టర్‌ను ఎప్పుడూ దక్షిణం లేదా తూర్పు వైపు ఉంచడం మంచిది. ఇలా చేయడం వలన సానుకూల శక్తి వ్యాపిస్తుంది. ఒకవేళ మీ ఇన్వర్టర్ ఇప్పటికే ఈశాన్యం వైపే ఉండి, దానిని మార్చడం కుదరకపోతే.. దాని చుట్టూ తెల్లటి క్లాత్ లాంటి వాటిని పెట్టండి. ఇలా చేయడం వలన వాస్తు దోషాల నుంచి బయట పడచ్చు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.