గ్రహాల చెడు ప్రభావాలు అధికంగా ఉన్నాయా? అయితే ఇలా చేయండి-which gems are auspicious for people from aries to pisces ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  గ్రహాల చెడు ప్రభావాలు అధికంగా ఉన్నాయా? అయితే ఇలా చేయండి

గ్రహాల చెడు ప్రభావాలు అధికంగా ఉన్నాయా? అయితే ఇలా చేయండి

Gunti Soundarya HT Telugu
Nov 08, 2024 07:20 PM IST

గ్రహాల అననుకూల ఫలితాల వల్ల ఒక వ్యక్తి జీవితంలో అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. వాటి నుంచి బయట పడేందుకు జ్యోతిష్య శాస్త్రంలో అనేక మార్గాలు ఉన్నాయి. వాటిలో రత్నాలు ధరించడం ఒకటి. ఏ రాశి వాళ్ళు ఏ రత్నం ధరిస్తే మంచిదో తెలుసుకుందాం.

ఈ రత్నం మీ ధైర్య సాహసాలను పెంచుతుంది
ఈ రత్నం మీ ధైర్య సాహసాలను పెంచుతుంది

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవగ్రహాలు పన్నెండు రాశుల మీద ఆధిపత్యం కలిగి ఉంటాయి. గ్రహాల అశుభ స్థానాల వల్ల ఒక వ్యక్తి జీవితంలో అనేక ఇబ్బందులు చోటు చేసుకుంటాయి.

గ్రహాల సంచారం అన్ని రాశుల మీద ప్రభావం చూపిస్తుంది. కొన్ని సార్లు అది శుభ ప్రభావాలు ఇస్తే మరికొన్ని సార్లు అశుభ ప్రభావాలు కలిగిస్తుంది. గ్రహాల అశుభాలను తగ్గించుకోవడానికి రత్నాలను ధరించడం మంచిది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల యొక్క అననుకూల ప్రభావాల కారణంగా ఒక వ్యక్తి జీవితం చెడుగా ప్రభావితమవుతుంది. జ్యోతిషశాస్త్రంలో 12 రాశిచక్రాలు ఉన్నాయి. ప్రతి రాశిని పాలించే గ్రహాలు భిన్నంగా ఉంటాయి. పాలక గ్రహం రాశిచక్రంపై పూర్తి ప్రభావాన్ని చూపుతుంది. ఒక్కో రాశికి ఒక్కో రత్నం ఉంటుంది. ఏ రాశి వాళ్ళు ఏ రత్నం ధరిస్తే మేలు జరుగుతుందో తెలుసుకుందాం. అయితే వీటిని జ్యోతిష్య నిపుణులు సూచించిన మేరకే ధరించాలి.

మేష రాశికి అధిపతి కుజుడు. ధైర్యం, శౌర్యం వంటి వాటికి అంగారకుడు ప్రతీకగా భావిస్తారు. కాస్త ఆవేశపూరిత స్వభావం కలిగి ఉంటారు. అటువంటి మేష రాశి వారు పగడం ధరించాలి.

వృషభ రాశికి అధిపతి సంపదను ఇచ్చే శుక్రుడు. ఆసురుల అధిపతిగా శుక్రుడిని పిలుస్తారు. ఈ రాశి వాళ్ళు శుక్రుడి చెడు ప్రభావాల నుంచి బయట పడేందుకు డైమండ్, ఒపల్ లేదా జిర్కాన్ ధరించాలి.

మిథున రాశికి గ్రహాల రాకుమారుడు బుధుడు అధిపతి. వాక్కు, వ్యాపారం వంటి వాటికి బుధుడు కారకుడు. బుధ గ్రహ చెడు ప్రభావం వల్ల మాటల్లో మాధుర్యం తగ్గుతుంది. అందువల్ల ఈ రాశి వారు పచ్చ రాయి ధరించవచ్చు.

కర్కాటక రాశికి అధిపతి చల్లని మనసు కలిగిన చంద్రుడు. జాతకంలో చంద్ర దోషం కలిగిన వాళ్ళు ముత్యాన్ని ధరించడం వల్ల మేలు జరుగుతుంది.

సింహ రాశికి అధిపతి గ్రహాల రాజు సూర్యుడు. అలాగే సూర్య భగవానుడికి ఎంతో ప్రీతికరమైన రాశి ఇది. జాతకంలో సూర్యుడి స్థానం బలహీనంగా ఉన్న వారు రూబీని ధరించాలి.

కన్యా రాశికి అధిపతి బుధుడు. ఈ రాశి వాళ్ళు కూడా పచ్చని ధరించవచ్చు.

తులా రాశికి శుభాలను ఇచ్చే శుక్రుడు అధిపతిగా వ్యవహరిస్తాడు. శుక్ర దశల వల్ల దుష్ప్రభావాలు ఎదుర్కొనే వారు డైమండ్, ఒపల్ లేదా జిర్కాన్ ధరించాలి.

వృశ్చిక రాశిని కుజ గ్రహం పరిపాలిస్తుంది. కుజ దోషాలతో బాధపడే వాళ్ళు పగడం ధరించాలి.

ధనుస్సు రాశికి దేవ గురువు బృహస్పతి అధిపతిగా వ్యవహరిస్తాడు. ఈ రాశి వారు పుష్పరాగము ధరించాలి.

మకర రాశికి న్యాయ దేవుడిగా పిలిచే శని అధిపతిగా ఉన్నాడు. శని బాధలు, దోషాల వల్ల ఇబ్బందులు పడే వాళ్ళు, ఏలినాటి శనితో కష్టాలు పడుతున్న వారు నీలమణిని ధరించాలి.

కుంభ రాశికి కూడా శని దేవుడే అధిపతి. ఏలినాటి, అర్థాష్టమ శనితో ఇబ్బంది పడే వారు నీలమణిని ధరించాలి. దీన్ని ధరించడం వల్ల

మీన రాశికి గురు గ్రహం అధిపతి. గురు దోషాలు తొలగిపోయేందుకు ఈ రాశి వాళ్ళు పుష్పరాగము ధరించడం ఉత్తమం.

నిరాకరణ: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనదని మేము క్లెయిమ్ చేయము. వివరణాత్మక మరియు మరింత సమాచారం కోసం, సంబంధిత రంగంలోని నిపుణుడిని సంప్రదించండి.

Whats_app_banner