గ్రహాలు కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. ఈ సమయంలో శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడతాయి. రాశులు, గ్రహాలు జీవితం పై ఖచ్చితంగా ప్రభావం చూపిస్తాయి. చాలా మంది ఈ విషయాన్ని బలంగా నమ్ముతారు కూడా. ఒకసారి గ్రహాలు సహకరించాలని రత్నాలను కూడా ధరిస్తూ ఉంటారు.
అయితే, చాలా మందిలో ఉండే సందేహం ఏంటంటే, ఎవరు ఏ రత్నాన్ని ధరించాలి? ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఏ బాధ లేకుండా సంతోషంగా ఉండాలని, విజయాలను అందుకోవాలని అనుకుంటారు. జీవితాంతం కష్టపడుతూ ఉంటారు. జీవితంలో సక్సెస్ అవ్వాలంటే కచ్చితంగా అదృష్టం ఉండాలి. లేకపోతే చాలా సఫర్ అవ్వాల్సి ఉంటుంది.
గ్రహాలు సహకరించడానికి రత్నాలను ధరిస్తూ ఉంటారు. పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా రత్నాలను ధరిస్తూ ఉంటారు. రత్నాలు అదృష్టాన్ని కలిగిస్తాయా? ఏ రత్నం ధరించడం వలన ఎటువంటి లాభాలను పొందవచ్చు? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
శని గ్రహాన్ని నీలమణి సూచిస్తుంది. దీనిని ధరించడం వలన జీవితంలో కష్టాలను అధిగమించవచ్చు. అయితే, ఈ రత్నాన్ని ఎవరు పడితే వారు ధరించకూడదు. జ్యోతిష నిపుణులు సలహా మేరకు ధరిస్తే మంచిది. ఈ రత్నాన్ని వేలకు ధరిస్తే మంచి ఫలితం కనబడుతుంది.
ఇది బుధ గ్రహాన్ని సూచిస్తుంది. మంచి ఆలోచనలను కల్పించడానికి ఇది సహాయపడుతుంది. మాట్లాడే వృత్తిలో ఉన్నవారు, బోధకులు, రచయితలు వంటి వారికి ఇది సరిగ్గా సరిపోతుంది. చిటికెన వేలుకు ధరిస్తే శుభ ఫలితాలను పొందవచ్చు.
సూర్యుడు శక్తిని ప్రతిబింబిస్తుంది. దీనిని ధరిస్తే నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. కఠిన నిర్ణయాలు తీసుకునేవారు ఎక్కువగా రూబీని ధరిస్తారు. ఉంగరం వేలికి ధరిస్తే శుభ ఫలితాలను పొందవచ్చు.
ఎర్ర పగడాలు మంగళ గ్రహానికి సంకేతం. ఎవరైనా సవాళ్లను ఎదుర్కొంటున్నట్లయితే, దీనిని ధరించడం మంచిది. ధైర్యాన్ని ఇది పెంచుతుంది. మధ్య వేలుకు ధరిస్తే శుభ ఫలితాలను పొందవచ్చు.
ముత్యాలు చంద్రుడిని సూచిస్తాయి. అంతర్గత శాంతి కోసం ముత్యాలను ధరించడం మంచిది. ముత్యాలను ధరిస్తే ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవచ్చు. మనపై మనకి నమ్మకం కూడా కలుగుతుంది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.