Vastu tips for water tank: ఇంటి వాటర్ ట్యాంక్ ఈ దిశలో ఉంటే మీ సంపద పెరుగుతుంది
Vastu tips for water tank: ఇంటి నిర్మాణ విషయంలో వాటర్ ట్యాంక్ వాస్తు కీలకం. సరైన దిశలో పెట్టడం వల్ల కుటుంబసంపద పెరుగుతుంది.

Vastu tips for water tank: ఇంటిని నిర్మించుకునేటప్పుడు ప్రతీ ఒక్కటి కూడా వాస్తు ప్రకారం చూసుకుంటారు. ఇల్లు మాత్రమే కాదు ఇంట్లో వస్తువులు కూడా వాస్తు ప్రకారమే సర్దుకుంటారు. ప్రతి ఒక్కరి ఇంటి మీద ఖచ్చితంగా నీళ్ళ ట్యాంక్ ఉంటుంది. కొంతమంది అయితే అండర్ గ్రౌండ్ వాటర్ ట్యాంక్ లు ఏర్పాటు చేసుకుంటున్నారు.
వాస్తు శాస్త్రంలో నీటికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. పంచభూతాలలో నీరు కూడా ఒకటి. వాస్తు నియమాల ప్రకారమే ఐదు మూలకాలు ఇంట్లో పెడితే ఆ ఇంటికి ఎటువంటి సమస్యలు ఉండవు. ఇంటి మీద ఉండే ట్యాంక్ పై స్లాబుకి రెండు అడుగుల ఎత్తులోనే ఉంటుంది. డాబాకి ఆనుకుని ఎప్పుడు ట్యాంక్ ఉండకపోవడానికి కారణం ఏమిటో తెలుసా? వాస్తు ప్రకారమే అందరూ ఇలా నిర్మించుకుంటారు.
ఇంటి పైన నీటి ట్యాంక్ ఏ దిశలో ఉండాలి?
ఇంటి మీద ఏర్పాటు చేసుకునే నీళ్ళ ట్యాంక్ ఎప్పుడూ నైరుతి దిశలోనే పెట్టుకోవాలి. లేదంటే తీవ్ర సమస్యలు ఎదురవుతాయి. నైరుతి దిశలో పెట్టడం కుదరకపోతే దక్షిణం వైపు పెట్టుకోవాలి. ఈశాన్యంలో బరువు పెట్టకూడదని పెద్దలు చెప్తునే ఉంటారు. ఈశాన్యంలో నీటి ట్యాంక్ పెట్టుకోవడం వల్ల వృధా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి.
అది మాత్రమే కాదు ఇంటి సభ్యులని మాత్రమే కాదు వాస్తు ప్రకారం కూడా ట్యాంక్ పరిమాణం ఉండాలి. వాటర్ ట్యాంక్ వంట గది మీద అసలు పెట్టుకోకూడదు. ఓవర్ హెడ్ ట్యాంక్, భూగర్భంలో ఏర్పాటు చేసే ట్యాంక్ రెండూ ఒకే దిశలో ఉండాలని అనుకోకూడదు. ఇంటి మీద నిర్మించుకునే వాటర్ ట్యాంక్ ఎప్పుడు ఇంటి మధ్య పెట్టకూడదు. అది ఇంటి యజమాని మీద ప్రతికూల ప్రభావం చూపుతుంది.
అండర్ గ్రౌండ్ వాటర్ ట్యాంక్ కి ఏ దిశ మంచిది?
అండర్ గ్రౌండ్ వాటర్ ట్యాంక్ నీటి మూలకాన్ని సూచిస్తుంది. ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ భూమి మూలకాన్ని సూచిస్తుంది. అందుకే ఈ రెండింటి నిర్మాణంలో కూడా భిన్నమైన దిశలో ఉండాలి. వాస్తు నిపుణులు చెప్పే దాని ప్రకారం అండర్ గ్రౌండ్ వాటర్ ట్యాంక్ ఈశాన్య దిశలో ఉండాలి. నైరుతి దిశలో ఏర్పాటు చేసుకోకూడదు. ఈశాన్యంలో అండర్ గ్రౌండ్ వాటర్ ట్యాంక్ పెట్టడం వల్ల కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుంది.
సంపద పెరిగేలా చేస్తుంది. వాస్తు ప్రకారం భూగర్భ వాటర్ ట్యాంక్ ఉత్తరం, తూర్పు దిశలోనైనా పెట్టుకోవచ్చు. ఇది ఇంట్లో సానుకూలత పెరిగేలా చేస్తుంది. పశ్చిమ దిశలో భూగర్భ నీటి ట్యాంక్ ఉంచడం కూడా మంచిదే. ఇది మీకు లాభాలు తీసుకొచ్చేందుకు సహకరిస్తుంది. వ్యాపారస్థులకు ఇది ఉత్తమమైన ఎంపిక. నైరుతి దిశలో పెడితే గుండె సంబంధిత సమస్యలు, ఒత్తిడి, పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. ఆగ్నేయ మండలంలో ఉంచితే ప్రమాదాలు పొంచి ఉంటాయి. ఆర్థిక పరిస్థితి దిగజారుతుంది.
టాపిక్