వాస్తు ప్రకారం పాటించడం వలన సానుకూల శక్తి కలిగి, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. ఇంట్లో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి, వాస్తు ప్రకారం పాటించడం వలన కష్టాలు ఉండవు, సంతోషంగా, ప్రశాంతంగా, సానుకూల శక్తి కలిగి హాయిగా ఉండొచ్చు. మనం చేసే కొన్ని కొన్ని పొరపాట్ల వలన ఎంతో నష్టం కలుగుతుంది. చాలా మంది తెలియక చేసిన తప్పుల వలన నష్టాలను ఎదుర్కొంటూ ఉంటారు.
మనం ఇంటి పనులు చేసేటప్పుడు కూడా కొన్ని పొరపాట్లు చేయకుండా చూసుకోవాలి. కొన్ని తప్పులు వలన పెద్ద సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మనం ఎప్పటికప్పుడు బట్టల్ని ఉతుక్కుంటూ ఉంటాం. కానీ, కొన్ని రోజుల్లో బట్టలు ఉతకడం మంచిది కాదు.
ఎప్పుడు బట్టల్ని ఉతకడం వలన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. బట్టల్ని ఉతికేటప్పుడు ఏ రోజు బట్టలు ఉతకకూడదు?, ఏ సమయంలో బట్టల్ని ఉతకడం వలన నష్టాలని ఎదుర్కోవాల్సి ఉంటుంది వంటి విషయాలని ఇప్పుడు తెలుసుకుందాం.
వాస్తు శాస్త్రం ప్రకారం, బట్టలను రాత్రిపూట ఉతకడం మంచిది కాదు. ఇలా చేయడం వలన ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. రాత్రిపూట ప్రశాంతంగా ఉండాలి. ఈ సమయంలో ఎక్కువ శ్రమ పెట్టి బట్టలను ఉతకడం, నీటికి సంబంధించిన పనులు చేయడం వలన ప్రతికూల శక్తి తొలగిపోతుంది.
రాత్రిపూట బట్టలను ఉతకడం వలన శని దుష్ప్రభావాలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రతికూల శక్తి కలుగుతుంది. నష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, పేదరికం, మానసిక ఒత్తిడి ఎక్కువ అవుతాయి. ఉద్యోగం, బంధం, ఆరోగ్యం పై కూడా ప్రతికూల ప్రభావం పడుతుంది.
వారంలో ప్రతీ రోజు చాలా ముఖ్యమైనది. కానీ గురువారం నాడు బట్టలను ఉతకడం మంచిది కాదు. గురువారం విష్ణువుకి అంకితం చేయబడింది. ఈరోజు విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని ఆరాధించాలి. ఈరోజు మురికి దుస్తుల్ని ఉతకడం, ఎక్కువ నీరుని వృధా చేయడం వంటివి చేయకూడదు. గురువారం నాడు బట్టలను ఉతకడం వలన లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది. పేదరికం ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 బట్టలు ఉతకడానికి ఉత్తమ సమయం. మంగళవారం, గురువారం నాడు ఉతకడం మంచిది కాదు. ఈ తప్పు చేయడం వలన ఆనందం, ప్రశాంతత తగ్గుతాయని పెద్దలు అంటుంటారు. ప్రతికూల శక్తి కూడా వ్యాపించవచ్చు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.