హిందూ మతం ప్రకారం మనం చాలా విషయాలని పాటిస్తూ ఉంటాము. ఎన్నో పద్ధతుల్ని ఆచరిస్తూ ఉంటాము. అయితే, హిందూ మతం ప్రకారం జుట్టు కత్తిరించుకోవడానికి, గోళ్లు కత్తిరించుకోవడానికి కూడా కొన్ని అశుభకారమైన రోజులు ఉన్నాయి.
అలాగే వివాహమైన మహిళలు జుట్టు కత్తిరించుకోవడానికి, తల స్నానం చేయడానికి కూడా కొన్ని ప్రత్యేక నియమాలు ఉన్నాయి. ఈ నియమాలని పాటిస్తే సంపద కలుగుతుంది. ఆస్తులు కూడా కలిగే అవకాశం ఉంది. సౌభాగ్యం, ఆనందం పెరుగుతాయి.
అయితే, వివాహమైన స్త్రీలు ఏ రోజు తలస్నానం చేస్తే మంచిది?, ఏ రోజు తలస్నానం చేయడం వలన అశుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది వంటి విషయాలని ఇప్పుడే తెలుసుకుందాం.
మంగళవారం, గురువారం, శనివారం నాడు స్త్రీలు తలస్నానం చేయడం మంచిది కాదు. ముఖ్యంగా పెళ్లి అయిన వారు గురువారం, శనివారం నాడు తలస్నానం చేయడం మంచిది కాదు. అలా చేస్తే సంతోషం తొలగిపోతుంది. సంపద కూడా తగ్గిపోతుంది.
దీంతో పాటుగా సోమవారం నాడు కూడా తల స్నానం చేయకుండా చూసుకోవాలి. అమావాస్య, పౌర్ణమి రోజుల్లో కూడా స్త్రీలు తలస్నానం చేయకూడదు. కనుక ఈ రోజుల్లో తల స్నానం చేయకుండా చూసుకోవాలి. కొన్ని పర్వదినాలప్పుడు కూడా తల రుద్దుకోకూడదు. కేవలం తలపై నీళ్లు పోసుకుని స్నానం చేయాలి.
వాస్తు ప్రకారం జ్యోతిష్యం ప్రకారం బుధవారం శుక్రవారం నాడు తలస్నానం చేయడం మంచిది. ఇది శుభ ఫలితాలను తీసుకువస్తుంది. బుధవారం, శుక్రవారం నాడు స్త్రీలు తలస్నానం చేయడం వలన సంపద పెరుగుతుంది. వైవాహిక జీవితంలో కూడా ప్రేమ పెరుగుతుంది. ఆదివారం నాడు కూడా తలస్నానం చేయవచ్చు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం