భోజేశ్వర్ మహాదేవ ఆలయం మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌కు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న భోజ్‌పూర్ గ్రామంలో ఉంది. శివునికి అంకితం చేయబడిన వెయ్యి సంవత్సరాల పురాతన ఆలయం ఇది. బెత్వా నది ఒడ్డున ఈ ఆలయం ఉంది. ఇప్పటికీ ఆలయ నిర్మాణ వైభవం, చారిత్రక ప్రాముఖ్యత ఆకర్షణకు కేంద్రంగా ఉంది.
11వ శతాబ్దంలో భోజ్‌పూర్‌లోని రాజా భోజ్ ఆధ్వర్యంలో నిర్మించారు. ఈ ఆలయానికి భక్తులు ఏడాది పొడవునా వస్తూ ఉంటారు. భోజేశ్వర మహాదేవ ఆలయాన్ని తూర్పు సోమనాథ్ ఆలయం అని కూడా అంటారు. ఈ ఆలయ నిర్మాణం ఇప్పటికీ అసంపూర్తిగా ఉంది.
అందుకే ప్రజలు దీనిని అసంపూర్ణ శివాలయం అని అంటారు. స్థానిక పురాణాల ప్రకారం భోజ్ రాజు తీవ్రమైన అనారోగ్యం నుంచి కోలుకున్నాక, ప్రపంచంలోనే అతిపెద్ద శివ లింగాన్ని స్థాపించాలని ఆలయ నిర్మాణ ప్రక్రియను మొదలుపెట్టారు.
కొన్ని మత విశ్వాసాల ప్రకారం, ఆలయ నిర్మాణం కేవలం ఒక రాత్రిలో పూర్తి చేయాలి. లేదంటే నిర్మించడం కుదరదట. అయితే అలా పూర్తి కాకపోవడం వలన ఇప్పటికి కూడా అది పూర్తి కాలేదని ప్రజలు అంటూ ఉంటారు.
సంబంధిత కథనం