Mahabharatam: ధృతరాష్ట్రుడికి యుద్ధం గురించి తన కళ్లతో చెప్పిన సంజయుడు మహాభారత యుద్ధం తర్వాత ఎక్కడికి వెళ్లాడు?
Mahabharatam: కురుక్షేత్రంలో 18 రోజులు పాటు కౌరవులు పాండవులు మధ్య భీకర యుద్ధం జరిగినప్పుడు సంజయుడు ఆ సమయంలో హస్తినాపురంలో ఉన్నాడు. తన కళ్ళతో యుద్ధం గురించి ధృతరాష్ట్రుడికి చెప్పాడు. కానీ మహాభారత యుద్ధం ముగిసినప్పుడు సంజయుడు ఏమయ్యాడు? అతను ఎక్కడికి వెళ్ళాడు? ఇది చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.
మహాభారతంలో ప్రసిద్ధి పాత్ర సంజయుడు గురించి అందరికీ బాగా తెలిసి ఉంటుంది. కృష్ణుడు కాకుండా సహదేవుడు, సంజయుడు మాత్రమే యుద్ధం గురించి బాగా అర్థం చేసుకున్నారు. భవిష్యత్తును తెలుసుకునే శక్తి కలిగి ఉన్నారు. హస్తినాపురానికి రాజు అయిన ధృతరాష్ట్రుని సలహాదారు. రథసారథి.

కురుక్షేత్రంలో 18 రోజులు పాటు కౌరవులు పాండవులు మధ్య భీకర యుద్ధం జరిగినప్పుడు సంజయుడు ఆ సమయంలో హస్తినాపురంలో ఉన్నాడు. తన కళ్ళతో యుద్ధం గురించి ధృతరాష్ట్రుడికి చెప్పాడు. కానీ మహాభారత యుద్ధం ముగిసినప్పుడు సంజయుడు ఏమయ్యాడు? అతను ఎక్కడికి వెళ్ళాడు? ఇది చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పురాణ గ్రంథాల ప్రకారం సంజయుడు వేద వ్యాసుడి శిష్యుడు. ఆయన సేవకు సంతోషించిన మహర్షి దివ్యదృష్టిని అనుగ్రహించాడు. అతను సుదూర సంఘటనలు మాత్రమే కాదు. భవిష్యత్తులో జరిగే సంఘటనలు కూడా చూడగలరు. మహాభారత యుద్ధంలో కృష్ణుడు, అర్జునుడికి తన బ్రహ్మాండమైన రూపాన్ని చూపించినప్పుడు, విష్ణువుని ప్రత్యక్షంగా చూసిన రెండవ, చివరి వ్యక్తి సంజయుడు. ఆయన దివ్య స్వరూపాన్ని చూసే భాగ్యం ప్రపంచంలో ఇంకెవరికి కూడా కలగలేదు.
సంజయుడు వినయం, మతపరమైన స్వభావం కలవాడు. ఎప్పుడూ సత్యం మాట్లాడేవాడు. కేవలం రథసారథి అయినప్పటికీ హస్తినాపురం రాజు ధృతరాష్ట్రుడికి నిజం చెప్పడానికి ఎప్పుడూ వెనకాడ లేదు.
మహాభారత యుద్ధాన్ని తప్పించుకోవడానికి చివరి క్షణం దాకా ప్రయత్నం చేశాడు, పాచికల్లో పాండవులు ఓడిపోయాక దుర్యోధనుడు తన చాకచక్యాన్ని ఉపయోగించి అజ్ఞాతవాసానికి వెళ్ళమని బలవంతం చేసినప్పుడు సంజయుడు భవిష్యత్తును గ్రహించాడు.
యుద్ధాన్ని ఆపించాలనుకున్నాడు. సంజయుడు ధృతరాష్ట్రుడిని హెచ్చరిస్తూ 'ఓ రాజా కురువంశం నాశనం అవడం ఖాయం. కానీ మహా యుద్ధం లో భారీ సంఖ్యలో పౌరులు నష్టపోతారు' అని అన్నాడు. అయినా ధృతరాష్ట్రుడు అతని మాట వినకుండా యుద్ధం వైపు వెళ్ళాడు.
తర్వాత భీష్ముడు, ద్రోణాచార్యుడు ఇతర యోధుల సలహా మేరకు ధృతరాష్ట్రుడు మహాభారత యుద్ధాన్ని నివారించడానికి పాండవులను ఒప్పించడానికి సంజయుడుని పంపించారు. ఆయన అజ్ఞను అనుసరించి సంజయుడు పాండవుల దగ్గరకు వెళ్ళాడు. అయినప్పటికీ ఇప్పుడు యుద్ధాన్ని నివారించలేమని సంజయుడుకు ముందే తెలుసు.
మహాభారత యుద్ధం తర్వాత హిమాలయాలకు
కురుక్షేత్రంలో 18 రోజులపాటు జరిగిన మహాభారత యుద్ధంలో దుర్యోధనుడు, ఆయన సోదరులు చంపబడ్డారు. పాండవులు యుద్ధంలో విజయం సాధించినప్పుడు, ధృతరాష్ట్రుడు ఎంతో నష్టపోయాడు.
సైన్యం తక్కువ ఉన్నప్పటికీ పాండవులు కౌరవ సైన్యాన్ని ఓడిస్తారని ఊహించలేదు. ఈ యుద్ధం తర్వాత సంజయుడు చాలా కాలం హస్తినాపురంలో ఉండేవాడని చెప్తారు.
తర్వాత కుంతీ దేవి సన్యాసం తీసుకున్నప్పుడు సంజయుడు కూడా ప్రజా జీవితం నుంచి విరమించుకున్నారు. ధృతరాష్ట్రుని మరణంతరం సంజయుడు హిమాలయాల గుహలకు వెళ్లి జీవితాంతం అక్కడే గడిపారట.
సంబంధిత కథనం