ప్రపంచం అంతం ఎప్పుడు? వివిధ మతాలు ఏం చెబుతున్నాయో తెలుసా?-when will the world end do you know what different religions say ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  ప్రపంచం అంతం ఎప్పుడు? వివిధ మతాలు ఏం చెబుతున్నాయో తెలుసా?

ప్రపంచం అంతం ఎప్పుడు? వివిధ మతాలు ఏం చెబుతున్నాయో తెలుసా?

Gunti Soundarya HT Telugu
Nov 04, 2024 10:37 AM IST

ప్రపంచం ఎప్పుడు అంతం అవుతుంది? అనే దానికి సంబంధించి ఎప్పుడూ ఏదో ఒక కథ వినిపిస్తూనే ఉంటుంది. అయితే అది ఎప్పుడు అనేది ఎవరూ ఖచ్చితంగా చెప్పలేరు. అయితే వివిధ మతాలు, గ్రంథాల ప్రకారం యుగాంతం ఎప్పుడు అనేది తెలుసుకోండి.

యుగాంతం ఎప్పుడు?
యుగాంతం ఎప్పుడు? (pinterest)

యుగాంతం దీని గురించి అప్పుడప్పుడు వార్తలు, అనేక కథనాలు వినిపిస్తూనే ఉంటాయి. మరి కొన్ని రోజుల్లో యుగాంతం వస్తుందని ప్రపంచం ముగిసిపోతుందని లెక్కలేనన్ని  వచ్చాయి.

కొందరు కల్కి అవతారం వచ్చినప్పుడు ప్రపంచం అంతమైపోతుందని అంటారు. మరికొందరు యుగాంతాన్న  సూచించే ఒక గుహలో నాలుగవ స్తంభం విరిగిపోయినప్పుడు వస్తుందని అంటారు. మరొకరు శివలింగం గుహను తాకినప్పుడు వస్తుందని అంటారు. వివిధ మతాలలో యుగాంతం ఎప్పుడూ అనేదానికి సంబంధించి వేర్వేరు వివరణలు, నమ్మకాలు ఉన్నాయి. అవి ఏంటో చూద్దాం. 

క్రైస్తవ మతం

యేసుక్రీస్తు తిరిగి రావడంతో ప్రపంచం ముగుస్తుందని క్రైస్తవులు నమ్ముతారు. దీనిని రెండవ రాకడ అని కూడా పిలుస్తారు. యేసు క్రీస్తు వచ్చి తీర్పు తీర్చి రక్షణ మార్గంలో నిలిచిన వారిని తనతో పాటు తీసుకువెళ్తాడని చెడు మార్గంలో పయనిస్తున్న వారికి బాధలు విడిచిపెడతారని అంటారు. నీతిమంతులు పునరుద్దానం చేయబడతారు. దుర్మార్గులు దేవుని కోపాన్ని ఎదుర్కొంటారని నమ్ముతారు. 

ఇస్లాం మతం

ప్రపంచం అంతం ఖయామత్ లేదా కియామా  అనే తీర్పుదినంగా ఇస్లాం మతస్థులు భావిస్తారు. ఈ సమయంలో అనేక విభిన్న సంఘటనలు జరుగుతాయని నమ్ముతారు. తీర్పుదినానికి ముందు ప్రపంచం నైతిక పతనాన్ని చూస్తుందని విభేదాలు పెరుగుతాయని నిజాయితీ అనేది ఉండదని అంటారు. చనిపోయిన ఆత్మల పునరుద్దానం చేయబడతాయని అల్లా ప్రతి ఒక్కరిని వారి పనులు ప్రకారం తీర్పు ఇస్తాడని నమ్ముతారు ప్రజలు అలా ఇచ్చే జన్నా(బహుమానం) లేదా శిక్ష (జహన్నమ్) పొందుతారని విశ్వసిస్తారు. 

హిందూ మతం

హిందూ మతంలో ప్రపంచం అంతం అనేది ఒకసారిగా జరిగే సంఘటన కాదు. సత్య యుగంతో ప్రారంభమై ప్రస్తుతం కలియుగం నడుస్తోంది. ఇది దారుణంగా ఉంటుందని అంటారు. నిజాయితీ, నైతికత, ప్రేమ, సోదర భావం అనేది ఉండవని అంటారు. చీకటి, అబద్ధం, నైతిక క్షీణత, ప్రతికూల విషయాలు ఎక్కువగా ఉన్న యుగంగా కలియుగాన్ని భావిస్తారు. పాపాలు ఎక్కువైనప్పుడు విష్ణువు తన పదవ అవతారముగా భావించే కల్కి అవతారం ఎత్తి ప్రపంచాన్ని చెడు నుంచి విముక్తి కలిగిస్తాడని ధర్మాన్ని పునరుద్ధరిస్తాడని హిందూ గ్రంథాలు చెబుతున్నాయి.

బౌద్ధమతం

బౌద్ధ బోధనల ప్రకారం ప్రపంచంతో సహా అన్ని విషయాలు అశాశ్వతమైనవని అవి క్షీణిస్తాయని అంటారు. నైతికత క్షీణించినప్పుడు, అసత్య మార్గంలో ప్రజలు ప్రవేశించినప్పుడు, జ్ఞానం పూర్తిగా అదృశ్యమైనప్పుడు బుద్ధుడు మైత్రియుడిగా భూమిపై కనిపించి తన వాక్యాన్ని వ్యాప్తి చేస్తాడని నమ్ముతారు. తన జ్ఞానంతో ప్రపంచాన్ని ప్రకాశవంతం చేస్తాడని విశ్వసిస్తారు.

జొరాస్ట్రియనిజం

ప్రపంచంలోని పురాతన మతాలలో ఒకటే జొరాస్ట్రియనిజం.  అహురా మజ్దాను అత్యున్నతమైన దేవుడిగా వీళ్ళు కొలుస్తారు. ఆయన ద్వారా శుద్ధీకరణతో ప్రపంచం అంతమవుతుందని నమ్ముతారు. ఇందులో దుష్టశక్తులు దేవుని పురుషులు యుద్ధంలో పాల్గొంటారని నమ్ముతారు. ఇది ముగించడంతో ఈ ప్రపంచం ముగిసిపోతుంది. నీతిమంతులకు స్వర్గంలో స్థానం లభిస్తుంది. చెడ్డవారికి అగ్ని ద్వారా శుద్ధికరణ ఉంటుంది. 

గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.

 

 

Whats_app_banner