పూరీలో జరిగే రథయాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రతి ఏటా జరిగే రథయాత్రకు దేశ విదేశాల నుంచి కూడా భక్తులు తరలివస్తారు. 15 రోజుల పాటు, తొమ్మిది రోజులు జరిగే ఈ పండుగలో అనేక క్రతువులు ఉంటాయి. పూరీలో జరిగే రథయాత్ర స్నాన పౌర్ణమితో మొదలవుతుంది.
తిరిగి దేవతలు ప్రధాన దేవాలయానికి చేరుకోవడంతో రథయాత్ర ముగుస్తుంది. ఇది కేవలం ఒడిశాలో జరిగే మాములు వేడుక కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు పాల్గొనే వేడుక. దేశ విదేశాల నుంచి లక్షలాది మంది రథయాత్ర చూడడానికి వస్తారు. అతి సుందరంగా అలంకరించిన రథాలలో దేవతలను ఊరేగించి గుండిచ ఆలయానికి తీసుకెళ్లడం జరుగుతుంది.
జగన్నాథ రథయాత్ర ఈసారి జూన్ 27న మొదలవుతుంది, జూలై 5 వరకు కొనసాగుతుంది. తొమ్మిది రోజులు పాటు అనేక క్రతువులతో ఈ రథయాత్రను జరుపుతారు.
ప్రతి ఏటా ఆషాఢ మాసం శుక్లపక్ష విద్య నాడు రథయాత్ర ప్రారంభమవుతుంది. ఈసారి ఆషాఢ మాసం శుక్లపక్ష విదియ జూన్ 26 మధ్యాహ్నం 1:25కు మొదలవుతుంది, జూన్ 27 ఉదయం 11:19తో ముగుస్తుంది. దీని ఆధారంగా చూసినట్లయితే, రథయాత్ర జూన్ 27న ప్రారంభమవుతుంది.
రథయాత్ర వేడుకల వివరాలు చూస్తే.. స్నాన పౌర్ణమి జూన్ 11న జరుగుతుంది. ఆ తర్వాత జూన్ 12 నుంచి 26వ తేదీ వరకు గోప్య చికిత్స జరుగుతుంది. జూన్ 26న గుండిచ ఆలయాన్ని శుభ్రపరిచే కార్యం. దీనిని గుండిచ మార్జన్ అని అంటారు. జూన్ 27న జగన్నాథ, బలభద్ర, సుభద్ర దేవి విగ్రహాలను గుండిచ ఆలయానికి రథాలలో తరలిస్తారు.
జూలై 1న లక్ష్మీదేవి గుండిచ ఆలయ సందర్శన, దీనిని హేరా పంచమి అంటారు. జూలై 4న బహుదా యాత్ర. అంటే దేవతలను తిరిగి జగన్నాథ ఆలయానికి తీసుకురావడం జరుగుతుంది. జూలై 5న సునా బేశ, అంటే దేవతలకు బంగారు ఆభరణాలను ధరింపజేసే అలంకరణ ఉంటుంది. అదే రోజున నీలాద్రి విజయ్. అంటే దేవతలు తిరిగి దేవాలయంలోకి ప్రవేశిస్తారు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.