ఒడిశాలోని పూరీలో ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో జగన్నాథుని రథయాత్ర జరుగుతుంది, ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఈ సంవత్సరం జగన్నాథ రథయాత్ర 27 జూన్, 2025న ప్రారంభమవుతుంది, దీనిలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొనడానికి వస్తారు.
జగన్నాధుని రథాన్ని లాగిన వారికి పుణ్యం లభిస్తుందని చెబుతారు. ఈ యాత్రలో ప్రత్యేకత ఏమిటంటే, జగన్నాథుడు తన అన్న బలభద్రుడు, సోదరి సుభద్రతో కలిసి తన అత్తగారి ఇల్లు 'గుండిచా మందిర్'కు వెళతారు.
మీరు కూడా జగన్నాథుని ఆలయానికి వెళ్లాలని ఆలోచిస్తుంటే, ఇక్కడ నుండి తిరిగి వెళ్ళేటప్పుడు కొన్ని వస్తువులను ఇంటికి తీసుకు వస్తే మంచిది. జగన్నాథుని ఆలయం నుండి ఈ వస్తువులను ఇంటికి తీసుకురావడం వల్ల మీ ఇంట్లో లక్ష్మీదేవితో పాటు అన్నపూర్ణ దేవి అనుగ్రహం కలిగి, సంతోషం ఉండచ్చు. పూరీని భూమిపై వైకుంఠం అంటారు.
ఆలయం నుండి కర్ర తప్పకుండా తీసుకురావాలి. ఆలయం నుండి కర్ర లేదా చెక్క పుల్ల (బెత్ స్టిక్) తీసుకువచ్చిన వారి ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని, దుఃఖం, దరిద్రం తొలగిపోతాయని చెబుతారు. ఇక్కడ పూజ తర్వాత బెత్తంతో కొడతారు, దీనివల్ల దుఃఖం, దరిద్రం తొలగిపోయి, బలం, బుద్ధి, కీర్తితో పాటు లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి.
ఆలయం నుండి నిర్మాల్య బియ్యాన్ని తీసుకురావాలి. ఎండిన బియ్యం అని చెప్పచ్చు. ఈ ఆలయంలో లభిస్తుంది. వాస్తవానికి, మహాప్రసాద్ బియ్యం జగన్నాథుని ఆలయంలోని కోయిలిలో వండుతారని, ఆపై ఎండలో ఆరబెడతారని నమ్ముతారు. తర్వాత దీనిని నైవేద్యంగా పెడతారు. దీనిని ఎరుపు రంగు సంచిలో ఇస్తారు. వీటిని కూడా ఇంటికి తెచ్చుకోవడం మంచిది.
వీటిని ఇంట్లో శుభ్రమైన ప్రదేశంలో ఉంచండి. ఏదైనా శుభకార్యం చేస్తే ఒక గింజను ఆహారంలో వేయండి. అంతేకాకుండా, దీనిలోని ఒక గింజను ధాన్యం నిల్వ చేసే ప్రదేశంలో వేయడం వల్ల ఇంట్లో ఎప్పుడూ ఆహారానికి కొరత ఉండదు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.