రెండు శుభ యోగాల వేళ సంకటహర చతుర్థి.. పూజా సమయం, పూజా విధానంతో పాటు ఏమేం దానం చేయాలో తెలుసుకోండి!
ఏప్రిల్ నెలలో సంకటహర చతుర్థి ఏప్రిల్ 16న వచ్చింది. పైగా ఈరోజు రెండు శుభ యోగాలు కూడా ఏర్పడనున్నాయి. దీంతో ఈరోజు ప్రాముఖ్యత మరింత పెరిగింది. సంకటహర చతుర్థి పూజా సమయం, పూజా విధానంతో పాటు ఏమేం దానం చేయాలో తెలుసుకోండి
ఎటువంటి విఘ్నాలు కలగకుండా ఉండడానికి వినాయకుడిని మనం ఆరాధిస్తాము. పైగా ఏ పని మొదలు పెట్టినా మొట్టమొదట గణపతిని పూజిస్తాము. హిందువులకు సంకష్ట చతుర్థి చాలా ముఖ్యమైనది. ఈరోజు వినాయకుడిని భక్తితో ఆరాధిస్తారు. సంకటహర చతుర్థి నాడు ఉపవాసం ఉండడం వలన వినాయకుడి ఆశీస్సులు కలిగి సంతోషంగా ఉండొచ్చు.
ఎటువంటి సమస్యలు ఉన్నా తొలగిపోతాయి. సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చు. సంకటహర చతుర్థి నాడు ఉపవాసము ఉండడం, వినాయకుడిని ఆరాధించడం వలన జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. సంపద కలుగుతుంది.
ఏప్రిల్ నెలలో సంకటహర చతుర్థి ఎప్పుడు వచ్చింది?
ఏప్రిల్ నెలలో సంకటహర చతుర్థి ఏప్రిల్ 16న వచ్చింది. పైగా ఈరోజు రెండు శుభ యోగాలు కూడా ఏర్పడనున్నాయి. దీంతో ఈరోజు ప్రాముఖ్యత మరింత పెరిగింది.
సంకటహర చతుర్ధి సమయం
చైత్ర కృష్ణపక్ష చతుర్థి బుధవారం ఏప్రిల్ 16న 1:15 గంటలకు మొదలవుతుంది. ఏప్రిల్ 17న 3:22 వరకు ఉంటుంది. ఇటువంటి సమయంలో ఏప్రిల్ 16న ఉపవాసం ఉండాలి.
సంకటహర చతుర్థి పూజ విధానం
- ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి తల స్నానం చేయాలి. ఆ తర్వాత భక్తి శ్రద్దలతో వినాయకుడిని ఆరాధించాలి. వినాయకుడిని పూజించి వినాయకుడికి ఇష్టమైన వాటిని నివేదన చేయాలి.
- అరటి పండ్లు, కొబ్బరికాయతో పాటుగా మీకు నచ్చిన పండ్లు, నైవేద్యాలను భగవంతుడికి సమర్పించవచ్చు.
సంకటహర చతుర్థి నాడు వచ్చిన శుభయోగాలు
సంకటహర చతుర్థి నాడు సర్వార్థ సిద్ధియుగం, అమృత సిద్ధి యోగం కూడా ఉన్నాయి. దీంతో పూజ చేసిన వారికి శుభ ఫలితం ఉంటుంది. కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుంది. సంకటహర చతుర్ధి నాడు ఉపవాసం ఉండడం వలన సంతోషం, సంపద పెరుగుతాయి. జీవితంలో ఉన్న కష్టాలని వినాయకుడు తొలగించి సంతోషంగా ఉంచుతారు.
సంకటహర చతుర్ధి నాడు ఏ వస్తువులను దానం చేయాలి?
- పేదలకు, అవసరం ఉన్నవారికి దుస్తులని దానం చేయడం మంచిది.
- బియ్యం పప్పులు, గోధుమలు ఇతర ధాన్యాలను ఈరోజు దానం చేయవచ్చు.
- పేదలకు, అవసరం ఉన్నవారికి డబ్బుని ఇస్తే కూడా మంచిది.
- వినాయకుడికి పూజలో పండ్లు, స్వీట్లు వంటివి సమర్పించవచ్చు. వీటిని పేదలకు పంచి పెట్టొచ్చు కూడా.
- ఆవులు, కుక్కలు ఇతర జంతువులకి ఈ రోజు ఆహారం పెట్టడం కూడా మంచిది.
- దాహం వేసిన వారికి నీరు అందించడం, వేసవిలో దాహార్తి తీర్చడానికి చలివేంద్రం వంటివి ఏర్పాటు చేయడం కూడా శుభ ఫలితాలను ఇస్తుంది.
- గొడుగు, చెప్పులను దానం చేస్తే కూడా మంచి ఫలితం ఉంటుంది.
- ఇంట్లో సానుకూల శక్తి కలగడానికి నెయ్యిని దానం చేయడం మంచిది.
- సమస్యలతో సతమతమయ్యే వారు బెల్లం దానం చేయడం వలన ఉపశమనం కలుగుతుంది. అదృష్టం కూడా కలిసి వస్తుంది.
దానం విషయంలో ఈ తప్పులు చేయకండి
- పేదలకు దానం చేయాలి. దానం చేసినప్పుడు స్వార్థం అస్సలు పనికిరాదు.
- దానం చేసేటప్పుడు ఎవరిని అవమానించడం లాంటివి చేయకూడదు.
శక్తి కొద్ది దానం చేయాలి.
3. దానధర్మాలని చేసిన తర్వాత ఎవరికీ చెప్పకూడదు. వాటిని రహస్యంగా ఉంచాలి.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం