హిందూ మత విశ్వాసాల ప్రకారం, విష్ణువు మొత్తం 24 ఏకాదశులు సృష్టించాడు. ప్రతి ఏకాదశి నాడు ఉపవాసం ఉండడం, విష్ణువును ఆరాధించడం వలన శుభం ఫలితాన్ని పొందవచ్చు. 24 ఏకాదశుల్లో కొన్ని ఏకాదశిలకు ఎంతో ప్రత్యేకత ఉంది.
జ్యేష్ఠ మాసంలో శుక్లపక్షంలోని ఏకాదశి కూడా ఎంతో ప్రాధాన్యత కలిగి ఉంది. ఈ ఏకాదశి నాడు నిర్జల వ్రతాన్ని పాటిస్తారు. అందుకనే దీనిని నిర్జల ఏకాదశి అని పిలుస్తారు. నిర్జల ఏకాదశి ఉపవాసం చేయడం వలన ఎంతో మంచి ఫలితం ఉంటుంది. 24 ఏకాదశి ఉపవాసాలు పాటించినంత పుణ్యం వస్తుంది.
అయితే, ఈ ఏకాదశి తిధి రెండు రోజులు రావడం వల్ల నిర్జల ఏకాదశి వ్రతాన్ని ఏ రోజు చేయాలి? అనే అనుమానం అందరిలో ఉంది. జూన్ 6న చేయాలా? లేదంటే 7న చేయాలా? అని సందిగ్ధంలో పడ్డారు. మరి ఏకాదశి వ్రతాన్ని ఎప్పుడు చేయాలి? నిర్జల ఏకాదశి వ్రత పూజలు ఏ రోజు చేస్తే మంచిది వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పంచాంగం ప్రకారం ఏకాదశి తిథి జూన్ 6వ తేదీన అర్దరాత్రి 2:15 గంటలకు మొదలవుతుంది. జూన్ 7 ఉదయం 7:47 గంటల వరకు ఉంటుంది. ఈ లెక్కన చూస్తే, నిర్జల ఏకాదశి ఉపవాసం జూన్ 6, శుక్రవారం నాడు చేయాలి. నిర్జల ఏకాదశి ఉపవాసం ఉన్నవారు నీరు తాగకుండా 32 గంటల పాటు ఉండాల్సి ఉంటుంది.
ఈసారి నిర్జల ఏకాదశికి ఎంతో ప్రత్యేకత వుంది. త్రిపుష్కర యోగం, శివయోగం, స్వాతి నక్షత్రాల కలయిక ఉన్నందున దీనిని ప్రత్యేకంగా భావిస్తారు. ఈరోజు ఉపవాసం ఉండడం వలన అనేక రెట్లు ఎక్కువ ఫలితాన్ని పొందవచ్చు.
ప్రజలు ఏకాదశి వ్రతం చేస్తే సకల పాపాలు తొలగిపోతాయి. నిర్జల ఏకాదశిని భీమసేని ఏకాదశి, పాండవ ఏకాదశి అని కూడా అంటారు. ఈ వ్రతం చేసిన తర్వాత దాన ధర్మాలు చేస్తే మంచిది. అలా చేయడం వలన ఉపవాసం యొక్క పూర్తి ఫలితం వస్తుంది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.