Makar sankranti: 2024 లో మకర సంక్రాంతి ఏ తేదీన వచ్చింది? శుభ సమయం ఎప్పుడు
Sankranti: సూర్యుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి మారతాడు. 2024 సంవత్సరంలో మకర సంక్రాంతి ఎప్పుడు వచ్చిందంటే..
Sankranti: కొత్త సంవత్సరంలో వచ్చే మొదటి పండుగ మకర సంక్రాంతి. సూర్యుడు ధనస్సు రాశి నుంచి మకరరాశిలో ప్రవేశిస్తాడు. అందుకే ఆ రోజును మకర సంక్రాంతి పండుగను జరుపుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. ఈ పండుగని లోహ్రి, తెహ్రీ, పొంగల్ సర్కత్ వంటి అనేక పేర్లతో పిలుచుకుంటారు.
మకర సంక్రాంతి పండుగని జనవరి 14 న జరుపుకుంటారు. కానీ ఈసారి పంచాంగం ప్రకారం జనవరి 15 న మకర సంక్రాంతి జరుపుకోవడం శుభప్రదం. మకర రాశి సూర్యుడులోకి ప్రవేశించినప్పుడు నువ్వులు తినడం శుభప్రదంగా చెప్తారు. ఈరోజు దానం చేయడం వల్ల ఎంతో మేలు జరుగుతుందని నమ్ముతారు.
సంక్రాంతి పండుగ సమయంలో అందరూ సంబరంగా గాలిపటాలు ఎగరేసుకుంటూ సంతోషంగా గడుపుతారు. మకర సంక్రాంతి నుంచి ఉత్తరాయణం ప్రారంభం అవుతుంది. నెలరోజుల ఖర్మ కాలం ముగిసి ఈ మకర సంక్రాంతి రోజు నుంచి వివాహాది శుభ కార్యాలు మళ్ళీ ప్రారంభం అవుతాయి.
మకర సంక్రాంతి పుణ్యకాలం- ఉదయం 7.15 నుంచి సాయంత్రం 5.46 వరకు
నిడివి-10 గంటల 31 నిమిషాలు
మకర సంక్రాంతి మహా పుణ్య కాలం- ఉదయం 7.15 నుంచి 9.00 గంటల వరకు
నిడివి- గంటా 45 నిమిషాలు
మకర సంక్రాంతి క్షణం- తెల్లవారుజామున 2.54 నిమిషాలు
ఇవి దానం చేస్తే మంచిది
మకర సంక్రాంతి రోజు దేవతలు భూమిపైకి వస్తారని నమ్ముతారు. ఆ సమయంలో గాజులు, నువ్వులు, స్వీట్లు, బియ్యం, వస్త్రాలు దానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది. గంగా స్నానం చేసి సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి. స్నానం చేసిన తర్వాత చురా పెరుగు, నువ్వులు తినడం శుభకరం. సంక్రాంతి రోజు దానం చేయడం వల్ల ఇంట్లో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి.
మకర రాశిలోకి సూర్యుడు మారడం వల్ల దేవతలకు పగలు, రాక్షసులకు రాత్రి మొదలవుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ సమయం నుంచి పగలు ఎక్కువ, రాత్రి వేళ తక్కువగా ఉంటుంది. ఖర్మ మాసం ముగిసి మాఘ మాసం మొదలవుతుంది.
మకర సంక్రాంతి పూజా విధి
మకర సంక్రాంతి రోజున సూర్య ఉత్తరాయణం జరుపుకుంటారు. దేవతల రోజులు ప్రారంభం కావడంతో శుభకార్యాలు జరుగుతాయి. మకర సంక్రాంతి రోజున సూర్య భగవానుడికి నీరు, ఎరుపు రంగు పువ్వులు, దుస్తులు, గోధుమలు, అక్షత్, తమలపాకు వంటివి సమర్పిస్తారు. పూజ చేసిన తర్వాత పేదలకు దానం చేస్తే మంచిది. మకర సంక్రాంతి రోజున దానం చేస్తే ఆ వ్యక్తికి ప్రతిఫలం వెయ్యి రెట్లు ఎక్కువగా వస్తుందని నమ్ముతారు.
గుజరాత్ లో ఉత్తరాయణం.. పంజాబ్ లో లోహ్రి
గుజరాత్ లో పంటల సీజన్ కు గుర్తుగా ఉత్తరాయణం ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఈ పండుగ సందర్భంగా పతంగులు ఎగురవేసి సంతోషంగా గడుపుతారు. బెల్లం, వేరుశెనగ చిక్కిలు తీసుకుంటారు. ఉత్తరాయణం సందర్భంగా చేసే ప్రత్యేక వంటకం ఉంధియ. ప్రత్యేకమైన మసాలా దినుసులు, కాల్చిన కూరగాయలతో తయారు చేస్తారు. లోహ్రి పంజాబ్ లో జరుపుకుంటారు. ఈ పండుగ్ సాయంత్రం వేళ భోగి మంటలు వేసి వేరుశెనగలు, నువ్వులు, బెల్లం అధికంగా తింటారు.