Lakshmi Jayanthi 2025: ఈరోజే లక్ష్మీ జయంతి.. ఈ 5 పరిహారాలను పాటిస్తే ఏడు తరాలు ఐశ్వర్యం కలుగుతుంది, అప్పులు బాధలు ఉండవు
Lakshmi Jayanthi 2025: హోలీ పండుగ ఈరోజే వచ్చింది. లక్ష్మీదేవి పుట్టినరోజు కూడా ఈరోజే. ఈరోజు చాలా విశిష్టమైనది. శక్తివంతమైన ఈ పౌర్ణమి నాడు లక్ష్మీదేవిని ఎలా ఆరాధించాలి? లక్ష్మీ పుట్టిన ఈరోజు పాటించాల్సిన పరిహారాలు ఏంటి అనే వాటి గురించి ఇప్పుడే తెలుసుకుందాం.

ఈరోజే ఫాల్గుణ పౌర్ణమి. హోలీ పండుగ కూడా ఈరోజే వచ్చింది. లక్ష్మీదేవి పుట్టినరోజు కూడా ఈరోజే. ఈరోజు చాలా విశిష్టమైనది. ఈరోజు చేసే కొన్ని పనులు శుభ ఫలితాలను ఇస్తాయి. పైగా ఈరోజు ఎన్నో శుభయోగాలు కూడా ఉన్నాయి. దీంతో ఈరోజు చేసే కొన్ని పరిహారాలు మంచి ఫలితాలను తీసుకువస్తాయి. ఇక లక్ష్మీ జయంతి నాడు ఏం చేయాలి? వంటి విషయాలని తెలుసుకుందాం.
శక్తివంతమైన ఈ పౌర్ణమి నాడు లక్ష్మీదేవిని ఎలా ఆరాధించాలి?
- ఈ పౌర్ణమి నాడు మహిళలు ఉదయాన్నే నిద్ర లేచి తలస్నానం చేయాలి.
- ముందు ఇంటిని శుభ్రం చేసుకుని, గడపలకు పసుపు రాయాలి.
- ఇంటి గుమ్మం నిండుగా ఉంటే లక్ష్మీదేవి కూడా ఇంట్లోకి వస్తుంది. సంపద కలుగుతుంది.
- ఇంటి ముఖద్వారం ఎదురుగా అష్టదళ పద్మం వేయాలి. ఇలా చేయడం వలన లక్ష్మీదేవి అక్కడ కొలువై ఉంటుంది.
- లక్ష్మీ జయంతి నాడు గుమ్మం ముందు కచ్చితంగా ముగ్గు ఉండేటట్టు చూసుకోవాలి. ఆ తర్వాత ఇంట్లో పసుపు నీళ్లని చల్లండి. ఇల్లంతా పసుపు నీళ్లని చల్లడం వలన చెడు శక్తులు ఏమైనా ఉంటే అక్కడ నుంచి తొలగిపోతాయి.
- లక్ష్మీదేవి ఎదుట దీపారాధన చేయండి.
- లక్ష్మీదేవికి పాలతో చేసిన ఆహార పదార్థాలను నైవేద్యంగా పెడితే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఈరోజు సాయంత్రం సంధ్యవేళలో తులసి మొక్క ఎదురుగా దీపం పెట్టడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది.
- ఈ పౌర్ణమి రోజున కనకధార స్తోత్రం చదివితే సంపద పెరుగుతుంది.
- లక్ష్మీదేవికి ఎర్రటి పూలు అంటే చాలా ఇష్టం. ఎర్రటి పూలతో లక్ష్మీదేవిని ఆరాధించడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది.
లక్ష్మీ పుట్టిన ఈరోజు పాటించాల్సిన పరిహారాలు
ఈరోజే లక్ష్మీదేవి పాలసముద్రం నుంచి జన్మించింది. ఈరోజు చంద్ర గ్రహణం కూడా ఉంది. ఈ అద్భుతమైన ఘటన 100 సంవత్సరాల క్రితం జరిగింది. మళ్లీ ఇప్పుడు జరగబోతుందని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు.
1.స్వస్తిక్
పౌర్ణమి నాడు కుబేరుడు నివసించే ఉత్తర దిశలో గంధంతో స్వస్తిక్ వేయడం వలన విపరీతమైన ధన లాభం కలుగుతుంది .
2.తాబేలు
ఒక చిన్న తాబేలు విగ్రహాన్ని తెచ్చుకుని పూజ గదిలో ఉత్తరం వైపు పెట్టండి. తాబేలు విగ్రహం ఎక్కడ ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి కూడా ఉంటుంది .
3.రాళ్ల ఉప్పు
పౌర్ణమినాడు రాళ్ల ఉప్పుని ఇంటికి తెచ్చుకోవడం వలన ఏడు తరాలు ఐశ్వర్యం మీ కుటుంబానికి కలుగుతుంది. డబ్బు కొరత కూడా ఉండదు .
4.సాంబ్రాణి పొగ
ఈ పౌర్ణమినాడు ఇల్లంతా సాంబ్రాణి పొగ వేయడం వలన ఇంట్లో దరిద్ర దేవత వెళ్ళిపోతుంది. కష్టాల నుంచి బయటపడతారు. సాంబ్రాణి పొగ వేయడం వలన ఇంట్లో దైవశక్తులని ఆకర్షిస్తుంది. ఎల్లప్పుడూ శ్రేయస్సు ఉంటుంది.
5. బీరువా తలుపులకు
లక్ష్మీదేవి మీ ఇంట కొలువై ఉండాలంటే పౌర్ణమి నాడు బీరువా తలుపుని శుభ్రంగా తుడిచి కుంకుమ బొట్టు పెట్టాలి . ఇలా చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట కొలువై ఉంటుంది . మీ పనుల్లో కూడా ఆటంకాలు ఉండవు. మీ పనులన్నీ విజయవంతంగా పూర్తి అవుతాయి.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం