Kamika Ekadashi 2024: కామికా ఏకాదశి ఎప్పుడు? ఆ రోజు ఉపవాసం చేస్తే అన్ని కోరికలు తీరుతాయి-when is kamika ekadashi 2024 if you fast on that day all your wishes will be fulfilled ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Kamika Ekadashi 2024: కామికా ఏకాదశి ఎప్పుడు? ఆ రోజు ఉపవాసం చేస్తే అన్ని కోరికలు తీరుతాయి

Kamika Ekadashi 2024: కామికా ఏకాదశి ఎప్పుడు? ఆ రోజు ఉపవాసం చేస్తే అన్ని కోరికలు తీరుతాయి

Haritha Chappa HT Telugu
Jul 10, 2024 08:00 AM IST

Kamika Ekadashi 2024: ఈ ఏడాది శ్రావణ మాసంలోని కృష్ణపక్షం రోజున కామికా ఏకాదశి వస్తోంది. ఆ రోజు ఉపవాసం చేస్తే మీరు కోరిన కోరికలు తీరుతాయి.

కామిక ఏకాదశి ఎప్పుడు?
కామిక ఏకాదశి ఎప్పుడు?

కామికా ఏకాదశి 2024: కామికా ఏకాదశి ఉపవాసం విష్ణువుకు అంకితం చేస్తారు. ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే పాపాలు నశిస్తాయి. ఈ ఏడాది శ్రావణ మాసంలోని కృష్ణపక్షం రోజున కామికా ఏకాదశిని నిర్వహించుకుంటారు. కామికా ఏకాదశి నాడు ఉపవాసం ఉండటం వల్ల కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. కామికా ఏకాదశి వ్రత తేదీ, ముహూర్తం, పూజా విధి గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.

కామికా ఏకాదశి ఎప్పుడు?

పంచాంగం ప్రకారం, కామికా ఏకాదశి జూలై 30, 2024 సాయంత్రం 04:44 గంటలకు ప్రారంభమవుతుంది. జూలై 31, 2024 మధ్యాహ్నం 03:55 గంటలకు ముగుస్తుంది. తిథి ప్రకారం, జూలై 31 న కామిక ఏకాదశి ఉపవాసం ఉండాలి.

కామికా ఏకాదశి శుభ ముహూర్తాలు

  • ఏకాదశి తిథి ప్రారంభ కాలం - జూలై 30, 2024 సాయంత్రం 04:44 గంటలకు
  • ఏకాదశి తిథి ముగిసే కాలం - జూలై 31, 2024 మధ్యాహ్నం 03:55 గంటలకు
  • ఉపవాసం విరమించే సమయం - ఉదయం 05:43 నుండి 08:24 గంటల మధ్యన
  • ఏకాదశినాడు మహా విష్ణువును పూజించాలి.
  • పంచామృతంతో పాటు గంగాజలంతో స్వామివారికి అభిషేకం చేయాలి. ఇప్పుడు స్వామికి పసుపు, చందనం, పసుపు రంగు పువ్వులు సమర్పించాలి. తరువాత నెయ్యితో దీపం వెలిగించాలి.

శ్రీ మహావిష్ణువు చాలీసాను పఠించాలి. భక్తితో స్వామి వారికి హారతి ఇవ్వాలి. పెసరపప్పును నానబెట్టి ప్రసాదంగా సమర్పించాలి. ఏకాదశి రోజు బ్రాహ్మణుడికి భోజనం పెట్టాలి. వారికి దక్షిణ సమర్పించాలి. ఆ తరువాతే ఉపవాస దీక్షను విరమించాలి.

మహా విష్ణువును పూజించి ఉపవాసం ఉండడం వల్ల చేసిన పాపాలు పొగొట్టుకోవచ్చు. ఏకాదశి తిధి ప్రతి నెలా రెండు సార్లు వస్తుంది. ఏడాదిలో 24 ఏకాదశులు ఉంటాయి. ఇప్పుడు జూలై 31న కామిక ఏకాదశి వచ్చింది. కామిక ఏకాదశి కోరిన కోరికలు నెరవేరే ఏకాదశిగా చెప్పుకుంటారు. ఈరోజున విష్ణువును పూజిస్తే పితృ దేవతలు సంతోషిస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి. కామిక ఏకాదశి చేయడం వల్ల అశ్వమేధ యాగానికి సమానమైన పుణ్యం దక్కుతుంది. విష్ణువు పాద పద్మాలను తాకడం వల్ల ఎంతో మంచిది. కామికా ఏకాదశి వ్రతాన్ని చేసే భక్తులు ‘ఓం నమో భగవతే వాసుదేవాయ నమ:’ అని జపిస్తూ ఉండాలి.

చేయాల్సిన పరిహారాలు

కామిక ఏకాదశి రోజు కొన్ని పరిహారాలు చేయడం వల్ల కొన్ని రకాల పాపాలు పోతాయి. కుటుంబంలో గొడవలు పడుతున్నవాళ్లు మహా విష్ణువుకు నీటిని సమర్పించాలి. పూర్వీకుల అనుగ్రహం పొందడానికి ఏకాదశి రోజు భగవద్గీతను చదవాలి. ఆనందం, ఆశీర్వాదం దక్కాలంటే వేణువును విష్ణువుకు సమర్పించాలి. తులసి మొక్క ముందు దీపాన్ని వెలిగించి ‘ఓం నమో భగవతే వాసుదేవాయ నమ:’ అనే మంత్రాన్ని జపించాలి. ఈ పండుగల రోజు ఎవరితోనూ గొడవలు పడకుండా ప్రశాంతంగా ఉండాలి. దానాలు వంటివి చేస్తూ ఉండాలి.

WhatsApp channel

టాపిక్