Kaal Ashtami 2024: కాల భైరవ జయంతి ఎప్పుడు? పూజా విధానం, ప్రాముఖ్యతలు
Kaal Ashtami 2024: పరమ శివుడు భయంకరమైన రూపంలో బాబా కాల్ భైరవ్‌గా అవతారమెత్తిన రోజును కాల భైరవ అష్టమి లేదా కాల బైరవ జయంతిగా జరుపుకుంటారు. మార్గశిరలో అమావాస్య రోజులైన ఎనిమిదో రోజున ఈ కాల బైరవుడు ఆవిర్భవించినట్లుగా విశ్వసిస్తారు.
కాలాష్టమి లేదా కాల భైరవ జయంతిని ఆ పరమశివుడు ఉగ్ర రూపంలో బాబా కాల బైరవ్ బాబాగా అవతారమెత్తిన సందర్భంగా జరుపుకుంటారు. ఈ పండుగ మార్గశిర మాసం కృష్ణ పక్షంలో ఎనిమిదో రోజు వస్తుంది. ఆ రోజంతా పవిత్రంగా భావించి శక్తివంతమైన కాల బైరవ బాబాను ప్రత్యేకమైన ఆచారాలతో ఆరాధిస్తారు. పరమేశ్వరుడి ఆశీస్సులు అందుకుని ఆధ్మాత్మికంగానూ, సుఖ సంతోషాలతోనూ జీవిస్తామని విశ్వసిస్తారు. మనిషిని నాశనం చేసే కోపం, దురాశ, కామం నుంచి రక్షణ దొరుకుతుందని నమ్ముతారు.
కాల భైరవ జయంతి ప్రాముఖ్యత:
ఒకానొక సందర్భంలో శ్రీ విష్ణువు, బ్రహ్మదేవుడి మధ్య ఎవరు గొప్ప, ఎవరు అత్యంత శక్తిమంతుడనే చర్చ నడుస్తుంటుంది. ఈ చర్య కాస్త తగవుగా మారడంతో పరిష్కారం కోసం పరమ శివుడ్ని కోరతారు. దానిని బ్రహ్మదేవుడు ఒప్పుకోడు. తనకు ఐదు తలలు ఉన్నాయని మహేశ్వరుడి మధ్యవర్తిత్వాన్ని తిరస్కరిస్తాడు. దాంతో ఉగ్ర రూపుడైన శివుడు నుదుటి నుంచి పరమశివుని అంశ అయిన కాల భైరవుడు ఉద్భవిస్తాడు. ఐదు తలలు ఉన్నాయని చెబుతున్న బ్రహ్మదేవుని తలల్లో ఒక దానిని ఖండిస్తాడు. దాంతో బ్రహ్మదేవుడు వాస్తవం తెలిసి తన తప్పును అర్థం చేసుకుంటాడు. ఆ తర్వాత దేవుతలంతా కలిసి వేడుకోవడంతో కాల భైరవ రూపాన్ని తిరిగి తనలోకి తీసుకుని పరమేశ్వరుడు శాంతిస్తాడు.
కాల భైరవ జయంతి ప్రత్యేకత
పరమేశ్వరుడి అవతారమైన కాల భైరవ రూపాన్ని కొలిస్తే సకల కోరికలు ఫలమిస్తాయని నారద పురాణంలో పేర్కొన్నారు. కాల బైరవుని ఆరాధించడం వల్ల శారీరకంగా, మానసికంగా సుదీర్ఘ కాలంగా ఎదుర్కొంటున్న సమస్యలు, జబ్బుల నుంచి ఉపశమనం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. చేతబడులు, దుష్ట శక్తులు నుంచి బయటపడటానికి కాలభైరవుడు సాయం చేస్తాడని నమ్ముతారు.
కాల భైరవ జయంతి 2024:
ఈ ఏడాది కాల బైరవ జయంతి లేదా కాలాష్టమిని 2024 నవంబరు 22న జరుపుకోనున్నారు. 22వ తేదీ సాయంత్రం 6గంటల 7నిమిషాలకు అష్టమి తిథి ఆరంభమై 23వ తేదీ 7గంటల 56 నిమిషాలకు ముగియనుంది.
పూజ చేయాల్సిన పద్ధతి:
* ఉదయాన్నే లేచి పవిత్ర స్నానం చేయడం.
* ఉపవాస దీక్షను చేపట్టి రోజంతా మహిమాన్వితమైన "హ్రీం ఉన్మత్ భైరవాయ నమ:" అనే మంత్రాన్ని జపించడం.
* ఇంటిని, ముఖ్యంగా పూజా గదిని శుభ్రం చేయడం.
* పూజ గదిలో కాల భైరవ విగ్రహాన్ని లేదా కాల భైరవ యంత్రాన్ని ఉంచాలి.
* ఆవాల నూనెతో దీపం వెలిగించి, దండ, స్వీట్లు పెట్టాలి.
* కాల భైరవ అష్టకం పఠిస్తూ ప్రార్థనలు చేస్తారు.
* ఆ తర్వాత నలు దిక్కులా ఆవాల నూనెతో నాలుగు వైపులా దీపం వెలిగించాలి.
* కాల భైరవుడికి మద్యాన్ని, పాలను సమర్పిస్తారు.
* సాయంత్రం వేళల్లో నాలుగు వైపులా దీపాలు వెలిగించి అర్ధరాత్రి వరకూ పూజా కార్యక్రమం నిర్వహిస్తారు.
* ఉదయం నుంచి కఠిక ఉపవాసం నిర్వహించి ఉపవాస విరమణ తర్వాత నల్ల కుక్కకు తియ్యటి రోటీలు తినిపించడం వల్ల అదనపు ప్రయోజనాలు అందుతాయని విశ్వసిస్తారు.
నిష్టతో ఈ సంప్రదాయాలు ఆచరించడం వల్ల ఆ కాలభైరవుని ఆశీస్సులు, రక్షణ, మార్గదర్శకత్వం కోసం కోరుకుంటారు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.