Holi 2025: ఈసారి హోలీ ఎప్పుడు? హోలికా దహనం సమయంతో పాటు ఈ పురాణం కథ తెలుసుకోండి-when is holi 2025 check holika dahan time and also this purana story see full details here ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Holi 2025: ఈసారి హోలీ ఎప్పుడు? హోలికా దహనం సమయంతో పాటు ఈ పురాణం కథ తెలుసుకోండి

Holi 2025: ఈసారి హోలీ ఎప్పుడు? హోలికా దహనం సమయంతో పాటు ఈ పురాణం కథ తెలుసుకోండి

Peddinti Sravya HT Telugu
Feb 04, 2025 12:00 PM IST

Holi 2025: అధర్మంపై ధర్మం సాధించిన విజయంగా ఈ పండుగను జరుపుకుంటారు. ఈసారి హోలీ పండుగ ఎప్పుడు వచ్చింది?, హోలీ తేదీ, హోలికా దహనం తేదీ వంటి వివరాలను తెలుసుకుందాం.

Holi 2025: ఈసారి హోలీ ఎప్పుడు? హోలికా దహనం సమయంతో పాటు ఈ పురాణం కథ తెలుసుకోండి
Holi 2025: ఈసారి హోలీ ఎప్పుడు? హోలికా దహనం సమయంతో పాటు ఈ పురాణం కథ తెలుసుకోండి

హోలీ అంటే రంగుల పండుగ. ప్రతీ సంవత్సరం ప్రజలు ఎంతో సరదాగా, సంతోషంగా హోలీ పండుగను జరుపుకుంటారు. ఫాల్గుణ మాసం శుక్లపక్ష పౌర్ణమి నాడు హోలీ పండుగను జరుపుకుంటారు. పౌర్ణమి రాత్రి హోలికా దహనం జరుపుతారు. సరదాగా హోలీ పండుగ చేసుకుంటారు.

సంబంధిత ఫోటోలు

అధర్మంపై ధర్మం సాధించిన విజయంగా ఈ పండుగను జరుపుకుంటారు. ఈసారి హోలీ పండుగ ఎప్పుడు వచ్చింది?, హోలీ తేదీ, హోలికా దహనం తేదీ వంటి వివరాలను తెలుసుకుందాం.

హోలీకా దహన సమయం

వైదిక క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం ఫాల్గుణ మాసం పౌర్ణమి మార్చి 13, 2025 ఉదయం 10:25 గంటలకి మొదలైంది. మార్చి 14, 2025 మధ్యాహ్నం 12:03 గంటలకు ముగుస్తుంది. హోలికా దహనం మార్చి 13న ఉంటుంది.

హోలికా దహనానికి శుభసమయం

మార్చి 13, 11:26 నుంచి 12:30 వరకు హోలికా దహనం కోసం అర్ధరాత్రి 64 నిమిషాలు లేదా దాదాపు గంట అందుబాటులో ఉంటుంది.

హోలీ ఎప్పుడు?

మార్చి 13 అర్ధరాత్రి హోలికా దహనం తర్వాత మరుసటి రోజు మార్చి 14న హోలీ పండుగ జరుపుకుంటారు. దీనిని ధూలేడి పండుగ అని అంటారు.

హోలీ పండుగను ఎందుకు జరుపుకోవాలి?

హోలీకాను దహనం చేసి హోలీ పండుగను జరుపుకోవడం వెనుక పురాణ కథ ఉంది. పురాతన కాలంలో రాక్షస రాజు హిరణ్యకశిపుని కుమారుడు ప్రహ్లాదుడు విష్ణు భక్తుడు. హిరణ్యకశిపుడుకి ఇది నచ్చలేదు. అప్పుడు అతను తన కొడుకు ప్రహ్లాదుడిని చంపడానికి ప్రయత్నాలు చేస్తాడు. కానీ ప్రతీసారి దేవుడు అతన్ని రక్షించాడు. ప్రహ్లాదుడు జుట్టుకి కూడా హాని జరగలేదు.

అప్పుడు హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడుని చంపడానికి అతని సోదరి హోలికను అగ్నిలో కాల్చమని కోరాడు. హోలికకు బ్రహ్మ దేవుడు నుంచి అగ్ని తనని కాల్చడని వరం పొందింది.

అటువంటి పరిస్థితుల్లో హోలికా తన ఒళ్ళో ప్రహ్లాదుడిని పెట్టుకుని చెక్కలపై కూర్చుంది. కానీ విష్ణువు దయతో హోలిక కాలిపోయింది. ప్రహ్లాదుడు రక్షించబడ్డాడు. అప్పటినుంచి అధర్మంపై ధర్మం విజయంగా ప్రతి సంవత్సరం హోలికా దహనం జరుగుతుంది.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Whats_app_banner

సంబంధిత కథనం