గురు పూర్ణిమకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. గురు మరియు శిష్యుల మధ్య పవిత్ర సంబంధానికి ప్రతీక. ఈ రోజున, శిష్యులు తమ గురువుకు కృతజ్ఞత వ్యక్తం చేస్తారు. గురువులను గౌరవిస్తారు. హిందూ మతంలో గురు పూర్ణిమ పండుగను ముఖ్యమైనదిగా భావిస్తారు. గురు పూర్ణిమను వ్యాస పూర్ణిమ, వేద పూర్ణిమ అని కూడా అంటారు. ఆషాఢ మాసంలో పౌర్ణమి రోజున గురు పూర్ణిమ జరుపుకుంటారు.
ధార్మిక విశ్వాసాల ప్రకారం నాలుగు వేదాల జ్ఞానాన్ని ప్రసాదించిన మహర్షి వేద వ్యాస మహర్షి ఈ రోజున జన్మించారు. మానవాళికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఆయన జయంతిని గురు పూర్ణిమగా జరుపుకుంటారు. వేద వ్యాస మహర్షి నాలుగు వేదాల జ్ఞానాన్ని తొలిసారిగా మానవాళికి అందించారు. అందువలన ఆయనకు మొదటి గురువు అనే బిరుదు ఇవ్వబడింది.
ఈ ఏడాది గురుపౌర్ణమి జూలై 10న ఉంది. పూర్ణిమ తిథి జూలై 10, 2025 ఉదయం 01:36 గంటలకు మొదలవుతుంది. జూలై 11, 2025 తెల్లవారుజామున 02:06 గంటలకు ముగుస్తుంది.
భారతీయ నాగరికతలో గురువుకు ప్రత్యేక స్థానం ఉంది. గురువు ఒక వ్యక్తికి సన్మార్గం చూపిస్తాడు. గురువు అనుగ్రహంతో మనిషి జీవితంలో విజయం సాధిస్తాడని చెబుతారు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.