Bhai Dooj: భాయ్ దూజ్ పండుగ ఎప్పుడు వచ్చింది? దీని ప్రాముఖ్యత ఏంటి?
Bhai Dooj: అన్నాచెల్లెళ్ల ప్రేమకు చిహ్నంగా జరుపుకునే పండుగ భాయ్ దూజ్. దీపావళి వచ్చిన రెండు రోజుల తర్వాత ఈ వేడుకను జరుపుకుంటారు. ఈ పండుగతో ఐదు రోజుల దీపావళి వేడుకలు ముగుస్తాయి. ఈ ఏడాది భాయ్ దూజ్ ఎప్పుడు వచ్చింది? దీని ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం.
భాయ్ దూజ్ పండుగను ప్రతి సంవత్సరం కార్తీక మాసంలోని శుక్ల పక్షం రెండవ రోజున జరుపుకుంటారు. దీనిని యమ ద్వితీయ అని కూడా అంటారు. ఈ సంవత్సరం భాయ్ దూజ్ 03 నవంబర్ 2024, ఆదివారం వచ్చింది. దీనితోనే ఐదు రోజుల దీపావళి పండుగ వేడుకలు ముగుస్తాయి. దీపావళి పండుగ వచ్చిన రెండు రోజులకు దీన్ని జరుపుకుంటారు.
భాయ్ దూజ్ పండుగ సోదరసోదరీమణుల మధ్య ప్రేమకు చిహ్నంగా జరుపుకుంటారు. అన్నదమ్ములకు ఈ రోజున సోదరీమణులు నుదుట తిలకం వేసి, అతని దీర్ఘాయువు, సంతోషాన్ని కోరుకుంటారు. భాయ్ దూజ్ రోజున శుభ సమయంలో సోదరీమణులు తమ సోదరుడికి తిలకం వేస్తే, అతని జీవితంలో ఆనందం, శ్రేయస్సు వస్తుందని నమ్ముతారు. రక్షా బంధన్ వేడుక మాదిరిగానే ఇది కూడా ఉంటుంది. భాయ్ దూజ్ శుభ సమయం తెలుసుకోండి.
భాయ్ దూజ్ ప్రాముఖ్యత
ఈ రోజున యమునా తన సోదరుడు యమధర్మరాజును గౌరవంగా ఇంటికి పిలిచి ఆహారం తినిపించిందని నమ్ముతారు. మత విశ్వాసాల ప్రకారం ఈ రోజున యమునా నదిలో స్నానం చేసి యముడిని పూజించే వ్యక్తి మరణానంతరం యమలోకానికి వెళ్లవలసిన అవసరం ఉండదు. సూర్యుని కుమార్తె యమునా అన్ని కష్టాలను తొలగించేదిగా పరిగణించబడుతుంది. ఈ రోజున యముడిని పూజించడం వల్ల ఆశించిన ఫలితాలు లభిస్తాయని నమ్ముతారు.
భాయ్ దూజ్ శుభ ముహూర్తం 2024
కార్తీక మాసంలోని శుక్ల పక్ష ద్వితీయ తిథి 02 నవంబర్ 2024న రాత్రి 08:21 గంటలకు ప్రారంభమవుతుంది. తిథి 03 నవంబర్ 2024న రాత్రి 10:05 గంటలకు ముగుస్తుంది. భాయ్ దూజ్‌లో తిలక్ శుభ సమయం మధ్యాహ్నం 01:10 నుండి 03:21 వరకు ఉంటుంది.
ఛోఘడియ ముహూర్తం
లాభం - పురోభివృద్ధి: 09:19 AM నుండి 10:41 AM వరకు
అమృత్ - ఉత్తమం: 10:41 AM నుండి 12:04 PM వరకు
శుభం - ఉత్తమం: మధ్యాహ్నం 01:26 నుండి 02:48 వరకు
శుభం - ఉత్తమం: సాయంత్రం 05:33 నుండి 07:11 వరకు
అమృత్ - ఉత్తమం: 07:11 PM నుండి 08:49 PM వరకు
రక్షాబంధన్‌కు ముందు నుంచే ఈ పండుగ సనాతన సమాజంలో భాగంగా ఉండేది. దీని ప్రాముఖ్యత గురించి స్కంద పురాణం, బ్రహ్మవైవర్త పురాణం రెండింటిలోనూ వివరించబడింది. ఈ రోజున పెళ్లయిన తన చెల్లెలి ఇంటికి వెళ్లి ఆమె వండిన ఆహారాన్ని తినడం ప్రతి సోదరుడి బాధ్యత. మీ సామర్థ్యాన్ని బట్టి బహుమతులు ఇవ్వండి. సోదరి పెళ్లికాని, చిన్న వయస్సులో ఉంటే, ఆమె కోరిక మేరకు ఆమెకు బహుమతులు అందించడం సోదరుడి బాధ్యత.
గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనది అని మేము క్లెయిమ్ చేయము. వీటిని అవలంబించే ముందు, ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి.
టాపిక్