లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే ఇంటిని ఎలా తుడుచుకోవాలి? స్నానానికి ముందు ఇంటిని తుడుచుకోవచ్చా?
స్నానం చేసాకా ఇల్లు తుడవాలా లేకపోతే స్నానం చేయకముందు ఇల్లు తుడవాలా? ఇంటిని ఎలా తుడిస్తే మంచిదని చాలా మందికి సందేహం ఉంటుంది. ఇంటిని శుభ్రం చేసుకునేటప్పుడు మీరు స్నానం చేయక ముందు ఇంటిని శుభ్రం చేసుకోవచ్చు. ఇంటిని రోజుకు మూడుసార్లు తుడుచుకోవాలి.
లక్ష్మీదేవి ఎక్కడైతే ఉంటుందో అక్కడ సిరిసంపదలు కలుగుతాయి. సంతోషంగా జీవించొచ్చు. లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని ప్రతి ఒక్కరూ వివిధ రకాల పద్ధతుల్ని అనుసరిస్తూ ఉంటారు. లక్ష్మీదేవి మన ఇంట్లో కొలువై ఉండాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి. అందుకోసం భక్త శ్రద్దలతో ఆరాధించడంతో పాటుగా కొన్ని పరిహారాలను కూడా చేస్తూ ఉంటారు. లక్ష్మీ ఎక్కడ ఉంటే అక్కడ ఆనందం, శ్రేయస్సు ఉంటాయని.. లక్ష్మీదేవిని ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తూ ఉంటారు.
లక్ష్మీదేవి ఇంట కొలువై ఉండాలంటే ఇలా చేయండి?
లక్ష్మీదేవి మన ఇంట కొలువై ఉండాలంటే కచ్చితంగా ఒక తులసి మొక్కని ఇంట్లో నాటాలి. తులసి మొక్కను ఇంటికి ఈశాన్య దిక్కులో నాటితే మంచిది. తులసి మన ఇంట్లో ఉండడం వలన పాపాలు తొలగిపోతాయి. రోగాల బారిన పడకుండా ఉండొచ్చు. లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే, ప్రతి శనివారం సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఆవాల నూనెతో దీపాన్ని వెలిగించాలి. లక్ష్మీదేవి అనుగ్రహం కలగడానికి అరటి చెట్టు కింద దీపం పెట్టి మూడుసార్లు ప్రదక్షణలు చేస్తే కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి, సిరిసంపదలు ఉంటాయి.
ఇంటిని శుభ్రంగా ఉంచాలి:
లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే ఇల్లు శుభ్రంగా ఉండాలి. ఇంట్లో చెత్తాచెదారం లేకుండా చూసుకోవాలి. లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే ఇంట్లో పనికిరాని సామాన్లు ఉండకూడదు. అలాగే దేవుడి గదిని అందంగా అలంకరించుకోవాలి. విరిగిపోయిన దేవుడి విగ్రహాలు ఇంట్లో ఉండకూడదు. ఇలాంటివి ఉంటే ప్రతికూల శక్తి కలుగుతుంది. ఇంటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలన్నా, ఇంట్లో సానుకూల శక్తి ప్రవహించాలన్నా కచ్చితంగా ఇల్లు ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి.
ఇంటిని ఎప్పుడు తుడవాలి? స్నానానికి ముందా, వెనుకా?
ఇంటిని శుభ్రం చేసుకునే విషయంలో కొంత మందికి కొన్ని సందేహాలు ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. స్నానం చేసాకా ఇల్లు తుడవాలా లేకపోతే స్నానం చేయకముందు ఇల్లు తుడవాలా? ఇంటిని ఎలా తుడిస్తే మంచిదని చాలా మందికి సందేహం ఉంటుంది. ఇంటిని శుభ్రం చేసుకునేటప్పుడు మీరు స్నానం చేయక ముందు ఇంటిని శుభ్రం చేసుకోవచ్చు. ఇంటిని రోజుకు మూడుసార్లు తుడుచుకోవాలి. ఉదయం స్నానం చేయకముందు, మధ్యాహ్నం భోజనానికి ముందు, రాత్రి సూర్యాస్తమయం దాటకముందు.
ఈ మూడు సమయాల్లో ఇంటిని తుడుచుకుంటే మంచిది. రోజూ ఇంటిని కడగలేని వారు గంగాజలం లేదా ఏదైనా నదీ నీటిని చల్లవచ్చు. ఇలా చేయడం వలన ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు కలగవు. కొందరి ఇంట్లో పూజగది ఉంటుంది. అలాంటివారు పూజగదిలోకి స్నానానికి ముందు వెళ్ళకూడదు కదా అని అంటారు. అలాంటప్పుడు మొత్తం ఇంటిని స్నానానికి ముందు తుడుచుకుని, స్నానం చేసిన తర్వాత పూజ గదిని శుభ్రం చేసుకోవచ్చు.
ఈ తప్పులు మాత్రం చేయకండి:
సూర్యాస్తమయానికి ముందే ఇల్లు తుడవాలి. ఇల్లు తుడిచిన తర్వాత ఆ చెత్తని సూర్యాస్తమయానికి ముందే పారబోయాలి. సూర్యాస్తమయం తర్వాత ఎట్టి పరిస్థితుల్లో చెత్త ఎత్తడం, చెత్త పారబోయడం వంటివి చేయకూడదు. లక్ష్మీదేవి మీ ఇంట కొలువై ఉండాలంటే దీనిని కచ్చితంగా పాటించడం మంచిది. ఇలా చేయడం వలన ఆర్థిక ఇబ్బందుల నుంచి కూడా గట్టెక్కొచ్చు.