Shani Amavasya: శని అమావాస్య నాడు శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఏం చేయాలి, ఏం చేయకూడదు?-what we should do on shani amavasya and what we should not do on this day ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Shani Amavasya: శని అమావాస్య నాడు శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఏం చేయాలి, ఏం చేయకూడదు?

Shani Amavasya: శని అమావాస్య నాడు శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఏం చేయాలి, ఏం చేయకూడదు?

Peddinti Sravya HT Telugu

Shani Amavasya: జ్యోతిషశాస్త్రం ప్రకారం, శని అమావాస్య రోజున శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి కొన్ని పరిహారాలు చేయాలి. శని అమావాస్య నాడు ఏం చేయాలో, ఏం చేయకూడదో తెలుసుకోండి.

శని అమావాస్య నాడు ఏం చేయాలి, ఏం చేయకూడదు?

హిందూమతంలో అమావాస్య తిథికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున తర్పణాలు వదలడం, పవిత్ర నదుల్లో స్నానం చేయడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. 2025, మార్చి 29 శనివారం నాడు, చైత్ర మాసం అమావాస్య. శనివారం వచ్చే అమావాస్యను శని అమావాస్య అంటారు. శని అనుగ్రహం పొందడానికి ఈ రోజును ప్రత్యేకమైనదిగా భావిస్తారు.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, వారి జాతకంలో శని ప్రభావం సరిగ్గా లేకపోతే ఈ రోజున కొన్ని ప్రత్యేక పరిహారాలు పాటించాలి. ఇలా చేయడం వల్ల శని దోషం నుంచి విముక్తి, శని అశుభ ప్రభావాలు తగ్గుతాయని నమ్ముతారు. శని అమావాస్య రోజున ఏం చేయాలి, ఏం చేయకూడదో తెలుసుకోండి.

శని అమావాస్య రోజున ఏం చేయాలి?

  1. శనీశ్వరుని అనుగ్రహం పొందాలంటే శని దేవుని ముందు ఆవనూనె దీపం వెలిగించాలి. అందులో నల్ల మినప్పప్పు, కొద్దిగా నల్ల నువ్వులు వేయాలి.
  2. శని అమావాస్య రోజున నల్ల నువ్వులు, నల్ల దుప్పట్లు, మినప్పప్పు, నల్లని వస్త్రాలను నిరుపేదలకు దానం చేయండి.
  3. ఈ రోజున రావిచెట్టు చుట్టూ ఏడు సార్లు ప్రదక్షిణలు చేసి దాని ముందు దీపం వెలిగించాలి.
  4. ఈ రోజున నల్ల కుక్కకు ఆవనూనెతో రొట్టె తినిపించాలి.
  5. ఈ రోజున శమీ వృక్షాన్ని పూజించడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు.
  6. శని అమావాస్య నాడు గంగానదిలో స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని విశ్వాసం.
  7. శని అమావాస్య రోజున హనుమంతుడుకి బెల్లం, శనగలు సమర్పించాలి. ఇలా చేయడం వల్ల హనుమంతుడు సంతోషిస్తాడని, శని అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు.

శని అమావాస్య నాడు ఏం చేయకూడదు?

  1. ఈ రోజున మాంసం, మద్యం వంటివి తీసుకోకూడదు.
  2. ఈ రోజున పూర్వీకులను, పెద్దలను అవమానించకండి.
  3. ఈ రోజున కుక్కలు, ఆవులు, కాకులు వంటి జంతువులు, పక్షులకు హాని తలపెట్టడం అశుభంగా భావిస్తారు.
  4. ఈ రోజున జుట్టు, గడ్డం, గోర్లు కత్తిరించకూడదు. ఇలా చేయడం వల్ల గ్రహ దోషాలు వస్తాయని నమ్ముతారు.
  5. శని అమావాస్య రోజున శనికి సంబంధించిన ఇనుప వస్తువులు, బూట్లు, వస్తువులు కొనుగోలు చేయకూడదు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Peddinti Sravya

eMail

సంబంధిత కథనం