Chaitra Navratri 2025: చైత్ర నవరాత్రులు సమయంలో ఏం చేయాలి? తేదీ, శుభ సమయం, పూజా విధానంతో పాటు పూర్తి వివరాలు ఇవిగో-what we should do on chaitra navratri 2025 check dates subha muhurtam puja timing and full details ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Chaitra Navratri 2025: చైత్ర నవరాత్రులు సమయంలో ఏం చేయాలి? తేదీ, శుభ సమయం, పూజా విధానంతో పాటు పూర్తి వివరాలు ఇవిగో

Chaitra Navratri 2025: చైత్ర నవరాత్రులు సమయంలో ఏం చేయాలి? తేదీ, శుభ సమయం, పూజా విధానంతో పాటు పూర్తి వివరాలు ఇవిగో

Peddinti Sravya HT Telugu

Chaitra Navratri 2025: చైత్ర మాసంలో వచ్చే ఈ నవరాత్రులను చైత్ర నవరాత్రులు అని పిలుస్తారు. చైత్ర నవరాత్రి 2025 తేదీ, సమయం, శుభ సమయం, పూజా విధానంతో పాటు పూర్తి వివరాలతో పాటు దుర్గాదేవి అనుగ్రహం కోసం ఈ తొమ్మిది రోజులు ఏం చేయాలనేది కూడా చూసేద్దాం.

Chaitra Navratri 2025: చైత్ర నవరాత్రులు సమయంలో ఏం చేయాలి? (pinterest)

చైత్ర మాసంలో వచ్చే ఈ నవరాత్రులను చైత్ర నవరాత్రులు అని పిలుస్తారు. మరికొన్ని రోజుల్లో చైత్ర నవరాత్రి మొదలు కాబోతోంది. 9 రోజులు కూడా అమ్మవారిని తొమ్మిది రూపాల్లో పూజిస్తారు. ఈసారి చైత్ర నవరాత్రి మార్చి 30న ప్రారంభం కాబోతోంది. చైత్ర నవరాత్రి మార్చి 30, 2025న ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 6, 2025 తో ముగుస్తుంది. తొమ్మిది రోజులు పాటు ఈ పండుగ కొనసాగుతుంది. ఈ సమయంలో భక్తులు ఉపవాసాలు చేస్తారు. వివిధ పద్ధతుల్లో అమ్మవారిని ఆరాధిస్తారు.

చైత్ర నవరాత్రి 2025 తేదీ, సమయం

ప్రతిపాద తిథి ప్రారంభం - మార్చి 29, 2025 - 04:27 PM

ప్రతిపాద తిథి ముగింపు- మార్చి 30, 2025 - 12:49 PM

కలశ స్థాపన ముహూర్తం - ఉదయం 06:13 నుండి 10:21 వరకు

కలశ స్థాపన అభిజీత్ ముహూర్తం - 12:00 PM నుండి 12:50 PM వరకు

చైత్ర నవరాత్రి 2025 ప్రాముఖ్యత

సంవత్సరానికి నాలుగు సార్లు నవరాత్రులని జరుపుకుంటాము. చైత్ర నవరాత్రులు, శారదీయ నవరాత్రులు అత్యంత ముఖ్యమైనవి. చైత్ర నవరాత్రి వసంత ఋతువు ప్రారంభాన్ని సూచిస్తుంది. పైగా ఇది ఆధ్యాత్మిక పునరుద్ధరణకు సమయంగా పరిగణించబడుతుంది. భక్తులు తొమ్మిది రోజులు పాటు దుర్గాదేవిని వివిధ రూపాలలో పూజిస్తారు. తొమ్మిదవ రోజున శ్రీరాముని జన్మదినము రామ నవమితో ముగుస్తాయి.

చైత్ర నవరాత్రి పూజా విధానం, ఉపవాసం వివరాలు

  1. దుర్గాదేవిని తొమ్మిది రోజులు కూడా వివిధ రూపాల్లో ఆరాధించి ఉపవాసాలు చేస్తారు. కలశ స్థాపనతో ఈ పండుగ మొదలవుతుంది.
  2. రోజూ ప్రత్యేక పూజలు, భజనలు చేస్తారు.
  3. అమ్మవారికి ఇష్టమైన వాటిని నివేదిస్తారు.
  4. తొమ్మిది రోజులూ కూడా అమ్మవారిని సరైన విధంగా ఆరాధిస్తే సానుకూల శక్తి ప్రవహిస్తుంది. అమ్మవారి అనుగ్రహం కూడా కలుగుతుంది.

కలశ స్థాపన, అఖండ దీపం

చైత్ర నవరాత్రుల్లో రోజూ సూర్యోదయం కంటే ముందు నిద్రలేవాలి. మొదటి రోజు కలిసి స్థాపన చేయాలి. దశమి తిధి దాకా రోజూ అఖండ దీపాన్ని పెట్టవచ్చు. ఇలా చేయడం వలన శుభ ఫలితం ఉంటుంది. ఒకవేళ ఇది సాధ్యం కాకపోతే రోజూ ఉదయం, సాయంత్రం హారతి ఇచ్చి పూజ చేస్తే సరిపోతుంది.

దుర్గాదేవి విగ్రహం

నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా ఉపవాసం చేస్తే ఎంతో మంచి ఫలితం ఉంటుంది. మొదటి రోజు నుంచి తొమ్మిది రోజుల వరకు ఉదయం, సాయంత్రం ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. దుర్గాదేవి విగ్రహం కానీ ఫోటో కానీ ప్రతిష్టించాలి. అమ్మవారికి ఎడమవైపు వినాయకుడిని పెట్టి పూజించాలి. దుర్గాదేవి శ్లోకాలను మంత్రాలని పఠించాలి. ఉదయం, సాయంత్రం రెండు పూట్ల కూడా దీపారాధన చేయాలి.

చైత్ర నవరాత్రుల సమయంలో ఈ పొరపాట్లు చేయకండి

  1. నవరాత్రుల సమయంలో ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ లేని ఆహార పదార్థాలు మాత్రమే తినాలి.
  2. మద్యం, మాంసాహారం సేవించకూడదు. లేదంటే అమ్మవారికి కోపం వస్తుంది.
  3. ఈ తొమ్మిది రోజులు గోర్లు కత్తిరించుకోవడం, జుట్టు కత్తిరించుకోవడం, షేవింగ్ చేయించుకోవడం వంటివి చేయకూడదు.
  4. ఈ నవరాత్రుల సమయంలో నలుపు రంగు దుస్తులు వేసుకోవడం కూడా మంచిది కాదు.
  5. నవరాత్రుల వ్రతాన్ని ఆచరిస్తున్నట్లయితే తోలుతో చేసిన వస్తువులను ఉపయోగించకూడదు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Peddinti Sravya

eMail

సంబంధిత కథనం