Tulasi vivah: తులసి వివాహం రోజున ఇవి దానం చేశారంటే .. డబ్బులే డబ్బులు-what to donate on tulasi vivah 2024 in karthika masam ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Tulasi Vivah: తులసి వివాహం రోజున ఇవి దానం చేశారంటే .. డబ్బులే డబ్బులు

Tulasi vivah: తులసి వివాహం రోజున ఇవి దానం చేశారంటే .. డబ్బులే డబ్బులు

Ramya Sri Marka HT Telugu
Nov 11, 2024 11:56 AM IST

తులసి వివాహం 2024 నాడు ఏమి దానం చేయాలి: హిందూ మతంలో తులసి వివాహానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున తులసి వివాహం జరిపించడంతో పాటు కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల జీవితంలో ఆర్థిక శ్రేయస్సు మరియు ఆనందం లభిస్తుందని నమ్ముతారు. తులసి పెళ్లి రోజున ఏయే వస్తువులు దానం చేయాలో తెలుసుకోండి.

తులసి వివాహం రోజున ఏం దానం చేయాలి?
తులసి వివాహం రోజున ఏం దానం చేయాలి? (istock)

ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో వచ్చే శుక్లపక్షం ఏకాదశి తిథి లేదా ద్వాదశి తిథి నాడు తులసి వివాహం జరుపిస్తారు. దీన్నే దేవోత్తన ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ రోజున, లక్ష్మీ అవతారంగా కొలుచుకునే తులసి దేవి శాలిగ్రామ రూపంలో ఉన్న విష్ణుమూర్తిని వివాహం చేసుకుంటుంది. తులసీ వివాహం నిర్వహించడం వల్ల వైవాహిక జీవితంలో సమస్యలు రాకుండా ఉంటాయినీ, చక్కటి ఆరోగ్యంతో పాటు ఆనందంగా ఉంటారనీ నమ్ముతారు. ఇంట్లో శాంతి చేకూరి శ్రేయస్సు లభించేలా సకల దేవతల ఆశీర్వచనాలు అందుతాయని చెబుతున్నారు.

ఈ ఏడాది ఏకాదశి తిథి నవంబర్ 12 మంగళవారం రోజున వచ్చింది. ఈ ఏడాది తులసి వివాహంపై సర్వార్థ సిద్ధి, రవియోగం, హర్షన్ యోగం వంటి అనేక శుభకార్యాలు జరుగుతున్నాయి.ఈ రోజున దంపతులు ఇద్దరు కలిసి తులసి వివాహం జరిపించడం వల్ల వైవాహిక జీవితంలో ఇబ్బందులు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. తులసి దేవికి వివాహం జరిపించడంతో పాటు కొన్నింటిని దానం చేయడం వల్ల మరిన్ని మంచి ఫలితాలు అందుతాయి. తులసి వివాహం రోజున ఏమి దానం చేయాలో తెలుసుకోండి.

లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి కార్తీక పౌర్ణమి నాడు ఈ పరిహారాలు

చేయండి

  1. తులసి వివాహం రోజున పేదవారికి కొత్త బట్టలు, పండ్లు, కూరగయాలు వంటి ఆహారపదార్థాలను దానం చేయడం వల్ల శుభఫలితాలు కలుగుతాయని భక్తుల నమ్మిక. ఈ రోజున ఆభరణాలను దానం చేయడం కూడా శుభప్రదంగా భావిస్తారు. ఇలా చేయడం వల్ల ఒక వ్యక్తి జీవితంలో పురోగతిని పొందుతాడని నమ్ముతారు. ఆర్థికంగా కూడా మంచి పురోభివృద్ధి ఉంటుంది.

2. హిందూ సంప్రదాయం ప్రకారం.. కన్యాదానం చేయడం అనేది అతిపెద్ద విరాళంగా పరిగణించబడుతుంది. కాబట్టి ఈ రోజున తులసీమాతను తన కుమార్తెగా భావించి కన్యాదానం చేసి వివాహం జరిపించాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి, విష్ణుమూర్తిల అనుగ్రహంతో కలిగి కోరుకున్న ఫలం లభిస్తుందని నమ్ముతారు.

3. తులసి వివాహం రోజున వరి, మొక్కజొన్న, గోధుమ, మినుము వంటి చిరుధాన్యాలు, మొదలైన వాటిని దానం చేయడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఇలా చేయడం వల్ల జీవితంలో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు కలుగుతాయని నమ్ముతారు.

4. తులసి వివాహ రోజున బెల్లం దానం చేయాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో సంతోషం, శాంతితో పాటు శ్రేయస్సు కలుగుతాయని నమ్ముతారు.

5. తులసి వివాహం జరిపించిన తర్వాత సింఘాడా, చిలగడదుంప, సీతాఫలం వంటి సీజనల్ పండ్లను దానం చేయడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఇలా చేయడం వల్ల విష్ణుమూర్తి, లక్ష్మీదేవిల అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం.

ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనది అని మేము క్లెయిమ్ చేయము. వీటిని అవలంబించే ముందు, ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి.

Whats_app_banner